కట్టంగూర్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా కట్టంగూర్ మండలంలో 22 జీపీలకు నూతనంగా ఏర్పడిన రామచంద్రాపురం గ్రామం ఏకగ్రీవం అయ్యింది. రామచంద్రాపురం గ్రామానికి మెదటి సర్పంచ్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి సూరారపు ప్రియాంకగణేశ్ ఎన్నికకావడం పట్ల ఆ గ్రామ ప్రజలు, వైస్‌ఎంపీపీ బొడ్డుపల్లి జానయ్య శుభాకాంక్షలు తెలిపారు. కాగా ఈనెల 30న 22 జీపీలకు గాను 21 జీపీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉపసంహరణల ప్రక్రియ మంగళవారం ముగిసింది. మండలంలోని 22 జీపీలకు 121 మంది సర్పంచ్‌లు నామినేషన్ వేయగా 57 మంది ఉపసంహరించుకోవడంతో 64 మంది బరిలో ఉన్నారు. 206 వార్డులకు గాను 631 నామినేషన్లు వేయగా 158 మంది ఉపసంహరించుకోగా 473 మంది వార్డు సభ్యులు బరిలో ఉన్నారు. రామచంద్రాపురం గ్రామంలో 8 వార్డులు సభ్యులు నందికొండ పార్వతమ్మ, రేకల చందన, సూరారపు మహేందర్, మహేశ్వరం మహేందర్, బొడ్డుపల్లి రేణుక, నీలం గణేశ్, అనంతుల సురేశ్, బోయపల్లి పద్మ, మల్లారం గ్రామంలో 5 వార్డులు, కట్టంగూర్ గ్రామంలో 13వ వార్డు సభ్యులు నిమ్మల యాదయ్య, గార్లబాయిగూడెం గ్రామంలో 6వ వార్డు, నల్లగుంటబోలు గ్రామంలో 6 వార్డులు చొప్పున మొత్తం 21 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. బరిలో ఉన్న సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం వేడిక్కింది.
Comments
Please login to add a commentAdd a comment