వీరప్పన్ వస్తున్నాడు | Tamil film based on Veerappan Life Story | Sakshi
Sakshi News home page

వీరప్పన్ వస్తున్నాడు

Published Wed, Sep 11 2013 1:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:36 PM

వీరప్పన్ వస్తున్నాడు

వీరప్పన్ వస్తున్నాడు

మూడు రాష్ట్రాల పోలీసుల్ని గడగడలాడించి మూడు చెరువుల నీళ్లు తాగించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. అతని జీవిత కథాంశంతో రూపొందిన చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం తెలుగులో ‘వీరప్పన్’ పేరుతో అనువాదమవుతోంది. ఎ.ఎమ్.ఆర్.రమేష్ దర్శకుడు. ఎమ్.వెంకట్రావ్, ఎ.ఎమ్.ఆర్.రమేష్, కె.రామకృష్ణ ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు.
 
అర్జున్, లక్ష్మీరాయ్, కిషోర్, రవి కాలె ఇందులో ముఖ్యతారలు. ఈ నెల 20న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘వీరప్పన్ ఎక్కడ నివసించాడు? ఏఏ ప్రాంతాల్లో తిరిగాడు? అతని జీవన శైలి ఏంటి? వంటి అంశాలను ఇందులో దర్శకుడు క్లియర్‌గా చూపించారు. 
 
వీరప్పన్ తిరిగిన రియల్ లొకేషన్స్‌లోనే చిత్రీకరణ చేశారు. వీరప్పన్ పాత్రలో కిషోర్ అద్భుతంగా నటించారు. పోలీస్ అధికారిగా యాక్షన్ కింగ్ అర్జున్ అదరగొట్టారు. సందీప్ చౌతా సంగీతం ఈ సినిమాకు మెయిన్ హైలైట్. అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ సూపర్‌గా ఉంటాయి’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విజయ్ మిల్టన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement