నిందితురాలు స్టెల్లా
కర్ణాటక, యశవంతపుర : మూడు కేసులకు సంబంధించి అటవీ దొంగ వీరప్పన్ సహచరుడి భార్యను చామరాజనగర పోలీసులు అరెస్ట్ చేశారు. హనూరు తాలూకా మాట్కళ్లి గ్రామానికి చెందిన స్టెల్లా అలియాస్ స్టెల్లామేరిని ఆరెస్ట్ చేశారు. పాలార్ బాంబ్ పేలుళ్లకు సంబంధించి అక్రమంగా మారణాయుధాలను సమకుర్చిన కేసులో మేరి నిందితురాలు. 27 ఏళ్లు నుండి కేసు జరుగుతోంది. అనంతరం కేసును చామరాజపేట పోలీసులు ఛేదించారు. మేరి తన 13 ఏటనే వీరప్పన్ బృందంలో చేరింది.
వీరప్పన్ సంపాదించి పెట్టిన డబ్బులను స్టెల్లా బావ శేషరాజ్‌లు కలిసి దొంగలించారు. విషయం తెలుసుకున్న వీరప్పన్ స్టెల్లాను, ఆమె బావ శేషరాజ్‌లను కిడ్నాప్ చేశాడు. దొంగలించిన డ బ్బులను ఇవ్వాలని డి మాండ్ చేశా రు. అయి న వీరు ఇవ్వలేదు. ఇదే సమయంలో వీరప్పన్ మరో సహచరు డు సుండ వెల్లెయన్ స్టెల్లా ను ప్రేమి ంచి పెళ్లి చేసుకున్నారు. అనంతరం ఏడాదిన్నరపాటు వీరప్పన్ బృందంలోనే పని చేస్తూ స్టెల్లా పాలార్ బాంబ్ పేలుళ్లు కేసు, రామాపుర పోలీసుస్టేషన్‌కు నిప్పు పెట్టిన కేసుతో పాటు టాడా కేసు నమోదు చేశారు. 27 ఏళ్లు తరువాత ఆమెను అరెస్ట్ చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment