ఒక్క సినిమాతో ఫేమస్‌.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’! | Actress Aaradhya Devi’s Rise and Struggles in Tollywood | From Viral Fame to Missed Chances | Sakshi
Sakshi News home page

ఒక్క సినిమాతో ఫేమస్‌.. కనిపించకుండా పోయిన ‘అందాల తార’!

Sep 21 2025 12:22 PM | Updated on Sep 21 2025 2:24 PM

This RGV Actress Famous With One Movie, Now Waiting For Offers

ఒకే ఒక్క చాన్స్‌తో చిత్రపరిశ్రమలో స్టార్స్‌గా ఎదిగినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. పదుల సంఖ్యలో సినిమాలు చేసినా రాని గుర్తింపు ఒక్క సినిమాతో కొట్టిసి..ఇండస్ట్రీలో సిర్థపడిన వాళ్లు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఇక్కడ పోటీ చాలా ఎక్కువ. కొంతమంది మాత్రం తొలి సినిమాతోనే ఫేమస్‌ అవుతుంటారు. 

అలాంటి వారిలో శ్రీలక్ష్మీ సతీష్‌ ఒకరు. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టకపోవచ్చు. ఆరాధ్య దేవి అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ మధ్య ఈ పేరు టాలీవుడ్‌లో మారుమోగిపోయింది. సినిమా రిలీజ్‌ కాకముందే ఆరాధ్య దేవి టాప్‌ సెలెబ్రిటీ అయిపోయింది. దానికి కారణంగా ఆర్జీవీ. ఆయన తీర్చిదిద్దిన ‘అందాల తార’నే ఈ ఆరాధ్య.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఆరాధ్య దేవి.. చీరకట్టులో ఫోటో షూట్‌ చేసి ఇన్‌స్టాలో షేర్‌ చేయగా..అవి ఆర్జీవీ కంట పడ్డాయి. దీంతో తన ‘శారీ’ సినిమాలో ఆరాధ్యను హీరోయిన్‌గా తీసుకున్నాడు. సినిమా ఫలితం పక్కన పెడితే.. ఆరాధ్య మాత్రం ఇండస్ట్రీలో బాగా వైరల్‌ అయిపోయింది. 

ఆమె అందం, అభినయం చూసి.. ఇక టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో చేరిపోవడం పక్కా అనుకున్నారు. కానీ ‘శారీ’ తర్వాత ఇండస్ట్రీ ఆమెకు ‘సారీ’ చెప్పినట్లు ఉంది. ఈ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో ఎలాంటి అవకాశాలు రాలేదు.  ఎలాంటి పాత్రలు చేయడానికైనా రెడీ అని, అవసరం అయితే గ్లామర్‌ షో కూడా చేస్తానని చెప్పినా.. ఆరాధ్య దేవికి అవకాశాలు రావట్లేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement