నోటికొచ్చింది మాట్లాడతా.. ఎవరినైనా తిట్టేస్తా.. హద్దూఅదుపూ లేకుండా విచ్చలవిడిగా వాగుతా.. నన్ను ఆపేవాళ్లే లేరు.. ప్రశ్నించేవాళ్లే లేరు.. అంటూ రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు టీడీపీ నేత నారా లోకేశ్! మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నారు.. ఎప్పుడూ అడ్డగోలు ఆరోపణలు చేసే ఆయన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మను విమర్శించారు.
మిమ్మల్ని కనాలనుకోలే.. మీరు పుట్టారు
'ఎవడో నిర్మాత రామ్‌గోపాల్ వర్మ థర్డ్ గ్రేడ్ సినిమాలు తీస్తాడు. ఆ మహానుభావుడు సినిమాలు తీసేందుకు పర్మిషన్... ప్రజల తరపున పోరాడుతున్న లోకేశ్‌కు ఆంక్షలా..' అని పెదవి విరిచారు. దీనిపై వర్మ యూట్యూబ్ వేదికగా చెంప చెళ్లుమనేలా సమాధానమిచ్చాడు. 'లోకేశ్.. నేను థర్డ్ గ్రేడా? ఫిఫ్త్ గ్రేడా? అన్నది ముఖ్యం కాదు.. నా ప్రశ్న ఏంటంటే.. మా నాన్న ఎక్కడో చిన్న ఉద్యోగం చేసేవారు. అక్కడి నుంచి నాకు నేనుగా సినిమాల్లోకి వచ్చి డైరెక్షన్ చేశాను. హిట్లు తీశాను, ఫ్లాపులు, సూపర్ ఫ్లాపులు కూడా తీశాను. మీరేమో చంద్రబాబు నాయుడు అనే పెద్ద నాయకుడికి పుట్టారు. ఆయన మిమ్మల్నే కనాలనుకోలేదు, కానీ మీరు పుట్టారు. దాన్ని బయాలజికల్ యాక్సిడెంట్ అంటారు.
షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధమేంటి?
ఇంతవరకు మీరేం సాధించారు? నేనేం సాధించాను? అనేది పక్కపక్కనే ఓ జాబితా తయరు చేసుకుని చూసుకోండి. అయినా నేను థర్డ్ గ్రేడ్ అంటే మరి మీరేం గ్రేడో..! మీ తండ్రిని పక్కనపెట్టేస్తే మీరు అరవడం తప్పిస్తే ఏం చేశారు? అనేది నాకింతవరకు అర్థం కాలేదు. మీరు రాజకీయ నాయకులు.. మీ ర్యాలీకి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలియదు. ప్రతిరోజు వందల సినిమా షూటింగ్స్ జరుగుతాయి. నాకొక్కరికే కాదు, అందరికీ షూటింగ్‌కు అనుమతి ఇస్తారు. షూటింగ్ పర్మిషన్‌కు, మీటింగ్ పర్మిషన్‌కు మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు.
అభద్రతాభావంలో లోకేశ్!
మీరు తెలియక మాట్లాడతారా? జనాలకు తెలియదని మాట్లాడతారా? జనాలు పట్టించుకోరని మాట్లాడతారా? కొందరు ఆడియన్స్‌ను టార్గెట్ చేసి మాట్లాడతారా?.. మీరు ఓ వ్యూహం ప్రకారం మాట్లాడితే నాకు ఎలాంటి సమస్యా లేదు. మీరు అబద్ధం చెప్పినా, చెప్పాలనుకున్నా అందులో ఓ ఎజెండా ఉందనుకుంటే పర్వాలేదు. అలా కాకుండా మీరు ఏదేదో మాట్లాడితే.. మీకంటూ గుర్తింపు లేదని, తండ్రికి తగ్గ కొడుకుని కాదేమోనన్న అభద్రతాభావంలో ఉన్నారనిపిస్తోంది. మీకు నిజంగా ఈ సమస్య ఉంటే సైకియాట్రిస్ట్‌కు చూపించుకుంటే మంచిది. ఇదే నేను మీకిచ్చే సలహా' అని చెప్పుకొచ్చాడు వర్మ.
చదవండి: National film awards 2023: అల్లు అర్జున్... ఉత్తమ నటుడు
Comments
Please login to add a commentAdd a comment