ఆర్జీవీని ఆటపట్టించిన రాజమౌళి | Rajamouli Calls Ram Gopal Varma As Ramu Grandpa In His Tweet | Sakshi
Sakshi News home page

రాంగోపాల్‌ వర్మను తాత అని పిలుస్తోన్న జక్కన్న

Published Mon, Feb 10 2020 2:03 PM | Last Updated on Mon, Feb 10 2020 2:34 PM

Rajamouli Calls Ram Gopal Varma As Ramu Grandpa In His Tweet - Sakshi

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ముక్కుసూటి మనిషి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఎప్పుడూ ఎవరికో ఒకరికి కౌంటర్‌ ఇస్తూ ఉండటం ఆర్జీవీకి వెన్నతో పెట్టిన విద్య. అలాంటి వ్యక్తికి ఆర్‌ఆర్‌ఆర్‌ దర్శకుడు రాజమౌళి సెటైర్‌ విసిరాడు. ఆర్జీవీని ఏమని పిలవాలో అర్థం కావటం లేదంటూ తీవ్ర సందిగ్ధంలో పడ్డాడు. అయితే అతని గందరగోళానికి కారణం లేకపోలేదు. వర్మ కూతురు రేవతికి ప్రణవ్‌ అనే వైద్యుడితో 2013లో వివాహం జరిగింది. కాగా నేడు ఉదయం రేవతి అమ్మాయికి జన్మనిచ్చింది. (నా తదుపరి చిత్రం ‘దిశ’: వర్మ)

ఈ సందర్భంగా జక్కన్న వర్మను ఆటపట్టిస్తూ.. ‘వర్మ తాతయ్యకు శుభాకాంక్షలు.. ఇన్నాళ్లకు ఆయనకు కళ్లెం వేసే వ్యక్తి వచ్చేసింది. ఇంతకీ నిన్ను రాము నాన్న లేదా రాము తాతయ్య.. ఏమని పిలవాలబ్బా’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఓవైపు దీనికి ఆర్జీవీ ఏమని రిప్లై ఇస్తాడోనని కొంతమంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మరికొందరు మాత్రం నిరాశకు లోనయ్యారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా అప్‌డేట్‌ ఇచ్చాడేమోనని ఆశించి భంగపడ్డామని కొందరు అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. ఇక ఆర్జీవీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనను సినిమాగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. (రోజా పక్కన దిష్టి బొమ్మ?: వర్మ​)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement