
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎక్కువే. సినీ ఇండస్ట్రీలో కూడా అతనికి వీరాభిమానులు ఉన్నారు. అందులో నిఖిల్ సిద్దార్థ ఒకరు. అయితే పవన్‌ను టార్గెట్ చేస్తూ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "పవర్ స్టార్: ఎన్నికల ఫలితాల తర్వాతి కథ" పేరుతో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి 'గడ్డి తింటావా?' సాంగ్‌ను రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ లీకైపోయింది. అయితే ఇలా వర్మ పీకేను టార్గెట్ చేయడం నిఖిల్‌కు అస్సలు నచ్చలేదు. దీంతో వర్మ పేరెత్తకుండానే ఆయన్ని కుక్కతో పోల్చుతూ మండిపడ్డారు. "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా.. ఆ మహాశిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా.." అంటూ ట్వీట్ చేశారు. (చైనా కావాలనే ఇలా చేసింది : హీరో నిఖిల్)
దీనికి పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు. దీంతో వర్మకు తిక్క కుదిరిందంటూ పవన్ అభిమానులు సంతోషపడుతుంటే వారి ఆనందాన్ని ఆవిరి చేస్తున్నారు మరికొందరు నెటిజన్లు. 'అవును.. శిఖరం అంటే 120 స్థానాల్లో డిపాజిట్ గల్లంతు అవడం ఏమో అనుకుంట', 'ఇప్పుడు పవర్ స్టార్ ఫ్లవర్ స్టార్ అయ్యాడు. అభిమానులకు పెద్ద కాలీఫ్లవర్ పెడతాడు' అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద మాటన్నాక వర్మ నిమ్మకు నీరెత్తనట్టు ఊరుకుంటారా? రివర్స్ కౌంటర్ ఇస్తారా చూడాలి. (‘పవర్ స్టార్’ ట్రైలర్ రిలీజ్ చేసిన ఆర్జీవీ)
Comments
Please login to add a commentAdd a comment