విజ‌య‌వాడ‌లో `వంగ‌వీటి` ఆడియో | Vangaveeti Audio Launch Koneru Lakshmaiah University Grounds, Vijayawada | Sakshi
Sakshi News home page

విజ‌య‌వాడ‌లో `వంగ‌వీటి` ఆడియో

Published Tue, Nov 29 2016 12:36 PM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM

విజ‌య‌వాడ‌లో `వంగ‌వీటి` ఆడియో - Sakshi

విజ‌య‌వాడ‌లో `వంగ‌వీటి` ఆడియో

విజ‌య‌వాడ న‌గ‌రంలో ఒక‌ప్పుడు సంచలనం రేపిన కొంత‌మంది వ్య‌క్తులు, కొన్ని సంఘ‌ట‌న‌ల ఆధారంగా  దర్శకుడు రామ్‌గోపాల్ వ‌ర్మ సినిమా చేయ‌బోతున్నాడని అనౌన్స్ చేయ‌గానే సినిమాపై ఆస‌క్తి  పెరిగింది. రామదూత‌ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దాసరి కిర‌ణ్‌కుమార్ ఈ సినిమా తీస్తున్నాడు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేసిన వంగ‌వీటి ట్రైల‌ర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వ‌చ్చాయి. ఈ సినిమా ఆడియో విడుదల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లో గ్రాండ్‌గా చేయ‌నున్నారు.

చిత్ర ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ మాట్లాడుతూ .. ‘విజ‌య‌వాడ రౌడీయిజంపై నా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న వంగ‌వీటి నాకు చాలా ప్ర‌త్యేక‌మైన చిత్రం. అప్ప‌ట్లో అక్కడ జ‌రిగిన చాలా సంఘ‌ర్ష‌ణ‌ల‌కు నేను ప్ర‌త్య‌క్ష‌సాక్షిని.  ఇప్ప‌టికే విడుద‌లైన‌ ట్రైల‌ర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ర‌వి శంక‌ర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాట‌లు కూడా అంద‌రినీ ఆక‌ట్టుకుంటాయి. డిసెంబ‌ర్ 3న వంగవీటి ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వాడ‌లోని కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివ‌ర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురు ప్ర‌ముఖుల స‌మక్షంలో విడుద‌ల చేయ‌నున్నాం. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement