అక్కినేని ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎంపిక | Akkineni foundation of america team selected for 2018 | Sakshi
Sakshi News home page

అక్కినేని ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎంపిక

Published Sun, Jan 21 2018 5:55 PM | Last Updated on Sun, Jan 21 2018 5:55 PM

Akkineni foundation of america team selected for 2018 - Sakshi

అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2018 సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు.

నూతన కార్యవర్గం :
వ్యవస్థాపక అధ్యక్షులు : డా. ప్రసాద్ తోటకూర
అధ్యక్షులు : రావు కల్వల
ఉపాధ్యక్షులు : శారద ఆకునూరి
కార్యదర్శి : చలపతి రావు కొండ్రకుంట
బోర్డు సభ్యులు : రవి కొండబోలు, ధామ భక్తవత్సలు, డా. సి. ఆర్. రావు, మురళి వెన్నం, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి.

 
ఈ సమావేశంలో డా. ఏ. ఎన్. ఆర్ తో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాల్ని, అనుభవాల్ని బోర్డు సభ్యులు నెమరవేసుకున్నారు. ముఖ్యంగా 2012 లో డా. అక్కినేని నాగేశ్వర రావు అమెరికాలో జరిపిన చివరి పర్యటన, డాలస్ నగరంలో అత్యంత వైభవంగా 89వ జన్మదిన వేడుకలను, ఆయన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆక్కినేని నాల్గవ అంతర్జాతీయ పురస్కార వేడుకలు గత నెల డిసెంబర్ 16న ఏలూరులో ఎంతో ఘనంగా జరగడానికి సహకరించిన వారందరకీ ఏ.ఎఫ్.ఏ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అక్కినేని 5వ అంతర్జాతీయ పురస్కార వేడుక”లను ఈ సంవత్సరం డిసెంబర్ 22న కరీంనగర్లో జరుపనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు రావు కల్వల వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement