Akkineni Foundation of America
-
అక్కినేని అంతర్జాతీయ అవార్డులు ప్రకటన
డాలస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 96వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం డాలస్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఏఎఫ్ఏ అధ్యక్షురాలు శారద ఆకునూరి మాట్లాడుతూ.. అనేక దశాబ్దాలుగా అక్కినేని నాగేశ్వరరావు గారితో సన్నిహితంగా మెలిగి ఆయనను 1997లోను, 2012లోను టెక్సాస్‌కు తీసుకురావడంలో ముఖ్య కారకులైన డా.తోటకూర ప్రసాద్ నాయకత్వంలో 2014లో ఈ ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటికి వరకు ఐదు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని అన్నారు. 2019 సంవత్సరానికి గానూ డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు విశాఖపట్నంలో వీఎమ్ఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఆరవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శారద ఆకునూరి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం, రావు కల్వల, డా. సి.ఆర్ రావులు అక్కినేని గారితో తమకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషని కొనియాడారు. అక్కినేని అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా మెలిగిన అమెరికాలోని మిత్రులం కొంతమంది ‘అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా.అక్కినేని ఒక చిన్న కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించి కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్థైర్యం, దూరదృష్టితో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ అంశాలనే ముఖ్యంగా యువతలో ప్రేరేపించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని ప్రసాద్ తోటకూర పేర్కొన్నారు. 2014లో గుడివాడ, 2015లో హైదరాబాద్, 2016లో చెన్నై, 2017లో ఏలూరు, 2018లో కరీంనగర్లో అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరిగాయని తెలిపారు. 2019 అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు “జీవిత సాఫల్య పురస్కారం”– శ్రీమాగంటి మురళీమోహన్, సినీ, వ్యాపార, రాజకీయ రంగాలలో ప్రముఖులు "విద్యా రత్న” – ప్రొఫెసర్. పద్మశ్రీ కొలకలూరి ఇనాక్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఛైర్మన్ "సినీ రత్న"– “మహానటి” చిత్రబృందం, జాతీయ స్థాయిలో ఎన్నో పురస్కారాలు అందుకున్న చిత్రం "వ్యాపార రత్న"- డా. సూరపనేని విజయకుమార్, నిర్మాణ రంగంలో అగ్రగ్రామి, కళాపోషకులు "రంగస్థలరత్న"– పద్మశ్రీ డాక్టర్. శోభానాయుడు, కూచిపూడి నృత్యంలో అగ్రశ్రేణి నర్తకి, నాట్యాచారులు "వైద్య రత్న"- డాక్టర్. ముళ్ళపూడి వెంకటరత్నం, సామాన్య ప్రజల పాలిట పెన్నిధి "సేవా రత్న" – “మన కోసం మనం ట్రస్ట్”– చల్లపల్లి, పరిశుభ్రత, పచ్చదనంలో సమిష్టి కృషి "వినూత్న రత్న"– శ్రీసత్తిరాజు శంకరనారాయణ, పెరేన్నికగన్న పెన్సిల్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ "యువ రత్న” – శ్రీ ఫణికెర క్రాంతికుమార్, సాహసవీరుడు కాగా, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థకు డాక్టర్.ప్రసాద్ తోటకూర(వ్యవస్థాపక అధ్యక్షులు), శారద ఆకునూరి(అధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట(ఉపాధ్యక్షులు), డాక్టర్.సి.ఆర్.రావు( కార్యదర్శి), రవి కొండబోలు(కోశాధికారి), రావు కల్వల, ధామా భక్తవత్సలు, డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్‌గా వ్యవహరిస్తున్నారు. మరిన్ని వివరాలకు www.akkinenifoundationofamerica.org ను సందర్శించండి. -
జమునకు జీవితసాఫల్య పురస్కారం
డల్లాస్, టెక్సాస్: పద్మవిభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సామ్రాట్, డా. అక్కినేని నాగేశ్వర రావు 95వ జయంతి (సెప్టెంబర్ 20) సందర్భంగా డల్లాస్‌లో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం లో ఏఎఫ్ఏ ప్రస్తుత అధ్యక్షులు రావు కల్వల మాట్లాడుతూ..1992, 2012 లో అక్కినేని నాగేశ్వరరావును డల్లాస్‌కు ఆహ్వానించి తీసుకువచ్చిన డా. ప్రసాద్ తోటకూర నాయకత్వంలోనే 2014 లో ఏఎఫ్ఏ సంస్థను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అప్పటినుండి ఇప్పటికివరకు నాలుగు అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలు జరుపుకున్నామని, ఈ సంవత్సరం డిసెంబర్ 22న సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు కరీంనగర్ లో ప్రతిమా మల్టీప్లెక్స్ లో ఐదవ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాన్ని జరుపుతున్నట్లు ప్రకటించి అందరూ హాజరు కావలసిందిగా ఆహ్వానం పలికారు. వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ డా. అక్కినేనిని ఒక ప్రముఖ సినిమా నటుడిగా మాత్రమే గాక, గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనిషిగా గుర్తించి, ఆయన అంతిమ శ్వాస వరకు అత్యంత సన్నిహితంగా గడిపిన కొంతమంది మిత్రులం కలిసి అమెరికాలో “అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” అనే సంస్థను ఏర్పాటుజేశామని తెలిపారు. డా. అక్కినేని కృష్ణా జిల్లాలో, ఒక కుగ్రామంలో, అతిసాధారణ కుటుంబంలో జన్మించినా కేవలం కృషి, పట్టుదల, ఆత్మ స్తైర్యం, దూరదృష్టి లాంటి లక్షణాలతో అద్భుత విజయాలు సాధించడం అనన్య సామాన్యమని, ఈ లక్షణాలు అందరికి ఆదర్శనీయం కావాలనే ఉద్దేశ్యంతోనే ప్రతి సంవత్సరం తెలుగుగడ్డ పై అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రదానోత్సవాలను జరుపుతున్నామని పేర్కొన్నారు. ఏఎఫ్ఏ సంస్థకు డా. ప్రసాద్ తోటకూర (వ్యవస్థాపక అధ్యక్షులు) , రావు కల్వల (అధ్యక్షులు), శారద అకునూరి (ఉపాధ్యక్షులు), చలపతి రావు కొండ్రకుంట ( కార్యదర్శి), ధామా భక్తవత్సలు (కోశాధికారి), డా. సి.ఆర్. రావు, రవి కొండబోలు, డా. శ్రీనివాసరెడ్డి ఆళ్ల, మురళి వెన్నం బోర్డు అఫ్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 2018 పురస్కార గ్రహీతలు : జీవిత సాఫల్య పురస్కారం : అనేక సాంఘిక, పౌరాణిక చిత్రాలలో అద్వితీయమైన పాత్రలను పోషించి అందరి అభిమానాన్ని చూరగొన్న కథానాయకి, పూర్వ లోకసభ సభ్యురాలు, ‘కళాభారతి’ జమున. విద్యా రత్న: ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ ఆచార్యులు, పూర్వ శాసనమండలి సభ్యులు, ప్రస్తుత రాజకీయాలపై తన నిష్పక్షపాత వైఖరితో కూడిన రాజకీయ విశ్లేషణ చేస్తున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్. సినీ రత్న: సినీ రంగంలో అద్భుతమైన గీతాలు రాస్తూ గీత రచయితగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయిత గా పురస్కారం అందుకున్న డా. సుద్దాల అశోక్ తేజ. విశిష్ట వ్యాపార రత్న: పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా పవర్ రంగంలో ‘పవర్ మెక్’ కంపెనీ ద్వార అద్భుత విజయాలు సాధించి, తన ప్రగతిని కేవలం లాభాల్లోనే లేక్కవేసుకోకుండా సామాజిక స్పృహతో విద్యా, వైద్య రంగాల్లో తనవంతు సహాయం చేస్తున్న పారిశ్రామికవేత్త సజ్జా కిషోర్ బాబు. రంగస్థల రత్న : ఆదిభట్ల నారాయణదాసు శిష్య పరంపరలో హరికథల్లో శిక్షణ తీసుకుని ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఎస్.వి. సంగీత, నృత్య కళాశాలలో హరికథా విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తూ, హరికథా రంగంలో అగ్రగణ్యులైన డా. ముప్పవరపు సింహాచల శాస్త్రి. వైద్య రత్న : కరీంనగర్ లోని ‘ప్రతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్)’ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆసరాగా అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న బి. శ్రీనివాసరావు. సేవా రత్న: ‘వృక్షో రక్షతి రక్షతః’ అనే నినాదంతో తన జీవితాన్ని చెట్ల పెంపకానికి అంకితం చేసి లక్షలాది మొక్కలను నాటుతున్న వనజీవి పద్మశ్రీ ‘దారిపెల్లి జానకి రామయ్య’. వినూత్న రత్న: తన అద్భుతమైన కళాదృష్టితో వ్యర్ధ పదార్దాల నుండి కూడా అద్భుతమైన కళాఖండాలను తయారుజేసి తన ఇంటినే మ్యుజియం గా మార్చిన చిత్రకారిణి డా. కమలా ప్రసాద రావు -
అక్కినేని ఫౌండేషన్ నూతన కార్యవర్గం ఎంపిక
అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా(ఏఎఫ్ఏ) నూతన కార్యవర్గ సభ్యుల పేర్లను వెల్లడించింది. ఏఎఫ్ఏ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ సమావేశంలో 2018 సంవత్సరానికి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు అక్కినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్. ప్రసాద్ తోటకూర తెలిపారు. నూతన కార్యవర్గం : వ్యవస్థాపక అధ్యక్షులు : డా. ప్రసాద్ తోటకూర అధ్యక్షులు : రావు కల్వల ఉపాధ్యక్షులు : శారద ఆకునూరి కార్యదర్శి : చలపతి రావు కొండ్రకుంట బోర్డు సభ్యులు : రవి కొండబోలు, ధామ భక్తవత్సలు, డా. సి. ఆర్. రావు, మురళి వెన్నం, డా. ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి. ఈ సమావేశంలో డా. ఏ. ఎన్. ఆర్ తో వ్యక్తిగతంగా తమకున్న అనుబంధాల్ని, అనుభవాల్ని బోర్డు సభ్యులు నెమరవేసుకున్నారు. ముఖ్యంగా 2012 లో డా. అక్కినేని నాగేశ్వర రావు అమెరికాలో జరిపిన చివరి పర్యటన, డాలస్ నగరంలో అత్యంత వైభవంగా 89వ జన్మదిన వేడుకలను, ఆయన పట్ల ప్రజలు చూపిన అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. ఆక్కినేని నాల్గవ అంతర్జాతీయ పురస్కార వేడుకలు గత నెల డిసెంబర్ 16న ఏలూరులో ఎంతో ఘనంగా జరగడానికి సహకరించిన వారందరకీ ఏ.ఎఫ్.ఏ సంస్థ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అక్కినేని 5వ అంతర్జాతీయ పురస్కార వేడుక”లను ఈ సంవత్సరం డిసెంబర్ 22న కరీంనగర్లో జరుపనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు రావు కల్వల వెల్లడించారు. -
అక్కినేని అవార్డుల వేడుక
చెన్నై కామరాజర్ అరంగమే వేదిక జీ ఆనంద్ స్వరమాధురి అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) నేతృత్వం ప్రవేశం ఉచితం సాక్షి ప్రతినిధి, చెన్నై: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (అఫా) నేతృత్వంలో అక్కినేని ఇంటర్నేషనల్ అవార్డుల కార్యక్రమం ఈనెల 14వ తేదీన చెన్నైలో జరుగనుంది. తేనాంపేట కామరాజర్ అరంగంలో సాయంత్రం 5.30 గంటలకు ఆరంభమయ్యే ఈ వేడుకలకు ప్రవేశం ఉచితంగా కాగా అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు. పద్మవిభూషణ్, నటసామ్రాట్ అక్కినేని ఇంటర్నేషనల్ పేరున అమెరికాకు చెందిన అఫా సంస్థ మూడో అవార్డుల వేడుకను చెన్నైలో నిర్వహించాలని తలపెట్టింది. అపోలో గ్రూపు ఆసుపత్రుల వ్యవస్థాపక చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, పల్లవ గ్రూపు సంస్థల చైర్మన్, ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్(ఆస్కా) అధ్యక్షులు డాక్టర్ కే సుబ్డారెడ్డి, మహానటి సావిత్రి కుమార్తె విజయచాముండేశ్వరి విశిష్ట అతిధులుగా హాజరవుతున్నారు. ప్రముఖ సినీ నేపధ్యగాయకులు, సంగీత దర్శకులు జీ ఆనంద్ వారి స్వరమాధురి ఫౌండేషన్ అధ్వర్యంలో మ్యూజికల్ నైట్ సాగనుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయకులు రాము, చంద్రతేజ, పవన్, సమీరా భరద్వాజ్, వర్దాని తమన్, ప్రవస్థి, ఆకునూరి శారద (యూఎస్ఏ), హరిప్రియ సినీ గీతాలను ఆలపిస్తారు. ఈ అవార్డుల మహోత్సవానికి అందరూ ఆహ్వానితులే, ప్రవేశం పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలిపారు. -
డిసెంబర్ 20న 'అక్కినేని' అవార్డుల ప్రదానోత్సవం
హైదరాబాద్: నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు ఆశయాలకు అనుగుణంగా అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (ఏఎఫ్ఏ) పని చేస్తోందని చైర్మన్ తోటకూర ప్రసాద్ తెలిపారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక సేవ, దృక్పథం, కష్టపడే స్వభావం వంటి సులక్షణాలకు అక్కినేని మారుపేరని కొనియాడారు. అక్కినేని పేరు మీద అవార్డు నెలకొల్పి సమాజానికి సేవ చేస్తున్న వివిధ రంగాల ప్రముఖులకు అందజేస్తున్నామని ప్రసాద్ ఓ ప్రకటనలో తెలియజేశారు. దీనిలో భాగంగా ఏఎఫ్ఏ రెండో వార్షికోత్సవ సందర్బంగా 'అక్కినేని అంతర్జాతీయ అవార్డుల వేడుక'ను డిసెంబర్20న ఫిల్మ్‌నగర్‌లో నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ అవార్డుల ఫంక్షన్‌కి తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అవార్డు గ్రహితలు: లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు: సూపర్ స్టార్, కృష్ణ విశిష్ట వ్యాపార రత్న: ఏవీఆర్ చౌదరి(జీ&సీ గ్లోబల్) సినీ రత్న: కైకాల సత్యనారాయణ రంగస్థల రత్న: కర్నతి లక్ష్మీ నర్సయ్య(ప్రజానటుడు) విద్యారత్న: చుక్కారామయ్య(ఐఐటీ రామయ్య) విద్యారత్న: గుల్లా సూర్య ప్రకాశ్ సేవా రత్నా: డా.సునితా కృష్ణన్ యువరత్న: కుమారి పూర్ణమలావత్(ఎవరెస్ట్ అధిరోహకురాలు) చేనేత కళారత్న: నల్లా విజయ్ అంతేకాకుండా 'యువతను ప్రభావితం చేస్తున్న సామాజిక సవాళ్లు, వాటిపరిష్కారాలు' అనే అంశం మీద 6 నిమిషాలలోపు నిడివిగల షార్ట్పిల్మ్ పోటీల్లో గెలుపొందినవారికి లక్షరూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు. -
అక్కినేని జీవితం.. ఓ స్ఫూర్తి సంతకం
17న అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం సిటీబ్యూరో: అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో ఈ నెల 17న సాయంత్రం మూడున్నర గంటల నుంచి కృష్ణా జిల్లా గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో అక్కినేని అంతర్జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్ష, ఉపాధ్యక్షులు డాక్టర్ తోటకూర ప్రసాద్, రవి కొండబోలు తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. అక్కినేని జీవితం యువతకు స్ఫూర్తి కావాలనే లక్ష్యంతో వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వారు వివరించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేసి అవార్డులను ప్రదానం చేస్తారని పేర్కొన్నారు. పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సౌజన్యంతో తీర్చిదిద్దిన డాక్టర్ అక్కినేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. అక్కినేని ఫౌండేషన్ వెబ్సైట్ ఆవిష్కరణ, అక్కినేనిపై రూపొందించిన ప్రత్యేక సంచిక, డాక్టర్ కృష్ణకుమారి రచించిన ‘మనిషిలో మనిషి’ గ్రంథావిష్కరణ కూడా ఇదే వేదికపై జరగనున్నదని తెలిపారు. ‘అక్కినేని వ్యక్తిత్వం, జీవితం యువతరానికి ఒక స్ఫూర్తి సంతకం కావాలి’ అనే అంశంపై స్వాతి వారపత్రిక సౌజన్యంతో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు లక్ష రూపాల బహుమతి ప్రదానం చేస్తారన్నారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా కార్యదర్శి శారద ఆకునూరి, బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ మురళి వెన్నం తదితరులు పాల్గొన్నారు. అక్కినేని అంతర్జాతీయ పురస్కార గ్రహీతలు వీరే.. పద్మభూషణ్ డాక్టర్ కేఐ వరప్రసాద్ రెడ్డి( శాస్త్ర సాంకేతిక రంగం), జస్టిస్ ఎస్.పర్వతరావు( చట్టం, న్యాయం), ఐఎఎస్ అధికారి పి. సంపత్ కుమార్( పౌర సేవలు), యంఎన్ రాజు (విద్యారంగం), దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు(సినిమా), డాక్టర్ వంశీ రామరాజు (సామాజిక సేవ), గుమ్మడి గోపాలకృష్ణ (రంగస్థలం), డాక్టర్ గోపీచంద్ మన్నం (వైద్యరంగం), జ్యోతి సురేఖ వెన్నం (యువత - క్రీడారంగం)లు అక్కినేని అంతర్జాతీయ పురస్కారాలకు ఎంపికయ్యారు.