ఆయన ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి | Megastar Chiranjeevi Speech In ANR National Award Function 2019 | Sakshi
Sakshi News home page

ఏఎన్నార్‌ ఎప్పుడూ మన మనస్సులో: చిరంజీవి

Published Sun, Nov 17 2019 8:22 PM | Last Updated on Sun, Nov 17 2019 8:58 PM

Megastar Chiranjeevi Speech In ANR National Award Function 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎప్పటికైనా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం’  దాదాసాహెబ్‌ ఫాల్కే పురస్కారం స్థాయికి చేరుతుందని మెగాస్టార్‌ చిరంజీవి ఆదివారం వ్యాఖ్యానించారు. ఏఎన్నార్‌ నేషనల్‌ అవార్డ్స్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ఏఎన్నార్‌ ఎప్పుడూ మన మనస్సులో ఉంటారు. చనిపోయే ముందు వరకూ ఆయన ఎంతో ధైర్యంగా ఉండేవారు. ఏఎన్నార్‌ జీవితం నాలో స్ఫూర్తి నింపింది. మా అమ్మకు అక్కినేని నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. డెలివరీ సమయంలో కూడా అక్కినేని సినిమా చూడాలంటూ అమ్మ పట్టుబట్టి మరీ చూశారట. అందుకేనేమో ఆమె కడుపులో ఉన్న నాకు సినిమాలు అంటే ఇష్టం ఏర్పడిందేమో. అక్కినేని గారితో ‘మెకానిక్‌ అల్లుడు’ చిత్రంలో కలిసి నటించా. ఆయన చాలా బాగా మాట్లాడేవారు. అక్కినేని దగ్గర చాలా నేర్చుకున్నా.’ అంటూ అక్కినేనితో ఉన్న అనుబంధాన్ని మెగాస్టార్‌ గుర్తు చేసుకున్నారు.

చదవండి: అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

‘శ్రీదేవి, రేఖలకు అక్కినేని పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితమైన నిర్ణయం. భారతదేశంతో పాటు ముఖ్యంగా దక్షిణాది గర్వించదగ్గ నటీమణులు శ్రీదేవి, రేఖ అని వారిద్దర్ని సన్మానించుకోవడం గర్వంగా ఉంది. ఇక మరణించే ముందు కూడా నటించిన ఏకైక ‘లేడీ సూపర్‌ స్టార్‌’  శ్రీదేవి. అలాగే రేఖ చేతలు మీదగా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డు తీసుకోవడం మరిచిపోలేని జ్ఞాపకం. ఇప్పుడు నా చేతుల మీదగా ఆమెకు అక్కినేని పురస్కారం అందచేయడం చాలా సంతోషంగా ఉంది. రాజ్యసభకు రేఖ వస్తుంటే సభ అంతా నిశ్శబ్దం అయిపోయేది. ఆమెను చూస్తూ అందరూ అలా ఉండిపోయేవాళ్లు. అందుకేనేమో రేఖ ఎక్కువగా సభకు వచ్చేవాళ్లు కాదు. ఇక నా భార్య పేరు సురేఖ అయినా నేను మాత్రం రేఖ అనే పిలుస్తాను. ఎందుకంటే నా ఆరాధ్య నటి రేఖ పేరుతో పిలుస్తాను ఆ విషయం ఇప్పటివరకూ మా ఆవిడకు కూడా తెలియదు.’  అని చిరంజీవి తెలిపారు.

చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement