Megastar Chiranjeevi Get Together Meet With College Friends - Sakshi
Sakshi News home page

రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం: చిరంజీవి

Published Sun, Nov 20 2022 2:36 PM | Last Updated on Mon, Nov 21 2022 9:24 AM

Megastar Chiranjeevi Get Together With College Friends - Sakshi

సాక్షి, ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): ‘‘రాజకీయాల్లో అన­డం, అనిపించుకోవడం ఉంటుంది. ప్రస్తుత రాజ­కీ­యాల్లో రాణించడం చాలా కష్టం. ఒకదశలో నాకు రాజకీయాలు అవసరమా అనిపించిందని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన వైఎన్‌ఎం కళాశాల (పశ్చిమ­గోదావరి జిల్లా నర్సాపూర్‌లోని కాలేజీ) పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చిరంజీవి పాల్గొన్నారు.

తనతో కలిసి చదివినవారు, నాటి అధ్యాపకులను కలిసి గత స్మృతులను గుర్తుచేసుకున్నారు. తాను ఏది తీసుకున్నా ఆ విషయంలో రాణించకుండా ఉండనని.. అయితే తన మనసును అంతగా ఆకట్టుకోలేకపోయిన దూరంగా ఉన్నానని చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సిని­మా చిత్రీకరణ శరవేగంగా సాగుతోందని.. దాని­తో ఈ కార్యక్రమానికి రావడం కుదురుతుందో లే­దో అనుకున్నానని చెప్పారు. మొత్తానికి ఈ కార్య­క్రమానికి రావడం సంతోషంగా ఉందన్నారు.

రాజీనామా’ నాటకంతో..
కాలేజీలో చదువుకునే రోజుల్లోనే మన లక్ష్యాలకు విత్తనం పడుతుందని, తన విషయంలోనూ అదే జరిగిందని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. తనకు నటన పట్ల మక్కువ ఉండటం, ఆ సరదాతో కాలేజీలో ‘రాజీనామా’ అనే నాటకంలో నటించడం, దానికి ఉత్తమ నటుడి అవార్డు రావడం.. తన ప్రస్థానానికి పునాదులని వివరించారు.


తన­కు అప్పుడే అభిమానులు మొదలయ్యారని చె­ప్పా­రు. ఎన్‌సీసీలో సీనియర్‌ కెప్టెన్‌ పొజిషన్‌ వ­ర­కు వెళ్లానని, 1976 సంవత్సరంలో రిపబ్లిక్‌ డే సందర్భంగా ఏపీ తరఫున రాజ్‌పథ్‌లో మార్చింగ్‌ చేశానని గుర్తు చేసుకున్నారు. అలా తనకు మంచి క్రమశిక్షణ అలవడిందని చెప్పారు. కేవలం పుస్త­కా­ల నుంచే కాకుండా మన చుట్టూ ఉండే వారి నుంచి నేర్చుకుంటూనే ఉండాలని సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement