అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని | Sakshi
Sakshi News home page

అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని

Published Sat, Oct 21 2023 7:58 AM

Akkineni Is A Pan Indian Star At Early Days - Sakshi

పాన్‌ ఇండియా నటుడు అక్కినేని
నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అల నాడే పాన్ ఇండియా నటుడు అయ్యారు అన్నారు పూర్వ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ ఉప కులపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య కొలకలూరి ఇనాక్..

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్టొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్‌
ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికా లోని డల్లాస్ నగరం లోని ప్రిస్కో లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా,నటసమ్రాట్ ఆక్కి నేని - ఆకృతి జాతీయ పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాదుకు ప్రదానం చేశారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్  దుశ్హాలువాతో, పుష్పగుచ్ఛంతో, ఘనంగా సత్కరించి అక్కినేని ఆకృతి జాతీయ పురస్కారాన్ని తోటకూర ప్రసాద్ కు  అందించారు..

చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి
ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తూ,   అక్కినేని తన పాత్రల ఎంపిక లో ఎంతో పరిణతి చూపెవారన్నారు.. స్వయం కృషి తో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు.. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రలలో పరిధవిల్లడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు.. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ అమెరికా లోని తెలుగు సమాజానికి  అండగా వుంటు అక్కినేని పేరిట అనేక కార్య క్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు..

అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పురస్కార గ్రహీత
పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తన బలం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేవారని అన్నారు.. ఆయన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు..

విశిష్ట అతిథిగా డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి
విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికా లోని ప్రముఖ కార్డియాజిస్ట్ డా.  ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆకృతి అమెరికా లో నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు.. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కలవల అక్కినేని తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్, మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా వ్యవహరించారు.. ఈ సందర్భంగా అమెరికా లో తెలుగు గాయకులు చంద్రహాస్, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేనీ చిత్ర గీతాల విభావరి జనరంజకంగా నిర్వహించారు..

Advertisement
Advertisement