akkineni foudantion of america
-
అలనాడే పాన్ ఇండియా నటుడు అక్కినేని
పాన్ ఇండియా నటుడు అక్కినేని నటనలో శిఖరాగ్రాలను అందుకున్న అక్కినేని అల నాడే పాన్ ఇండియా నటుడు అయ్యారు అన్నారు పూర్వ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ పూర్వ ఉప కులపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆచార్య కొలకలూరి ఇనాక్.. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్టొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో అమెరికా లోని డల్లాస్ నగరం లోని ప్రిస్కో లో అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా,నటసమ్రాట్ ఆక్కి నేని - ఆకృతి జాతీయ పురస్కారం, అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా స్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాదుకు ప్రదానం చేశారు..ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కొలకలూరి ఇనాక్ దుశ్హాలువాతో, పుష్పగుచ్ఛంతో, ఘనంగా సత్కరించి అక్కినేని ఆకృతి జాతీయ పురస్కారాన్ని తోటకూర ప్రసాద్ కు అందించారు.. చిత్ర పరిశ్రమకు అక్కినేని సేవలు మరువలేనివి ఆచార్య కొలకలూరి ఇనాక్ ప్రసంగిస్తూ, అక్కినేని తన పాత్రల ఎంపిక లో ఎంతో పరిణతి చూపెవారన్నారు.. స్వయం కృషి తో ఉన్నత శిఖరాలు చేరుకున్న మహానటుడు ఆయన అన్నారు.. అంతేకాదు చలన చిత్ర పరిశ్రమ తెలుగు రాష్ట్రలలో పరిధవిల్లడానికి ఆయన చేసిన కృషి గణనీయమైనదని అన్నారు.. అక్కినేని పేరిట ఏర్పాటు చేసిన జాతీయ పురస్కారాన్ని అంతర్జాతీయ స్థాయిలో విశేష సేవలు అందిస్తూ అమెరికా లోని తెలుగు సమాజానికి అండగా వుంటు అక్కినేని పేరిట అనేక కార్య క్రమాలు చేస్తున్న డా. తోటకూర ప్రసాద్ కు అందించడం ఎంతో సముచిత నిర్ణయం అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పురస్కార గ్రహీత పురస్కార గ్రహీత తోటకూర ప్రసాద్ తనకు లభించిన ఈ పురస్కారం ఎంతో ప్రత్యేకమైనది అన్నారు.. అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.. తన బలం ఏమిటో, తన బలహీనతలు ఏమిటో నిర్మొహమాటంగా చెప్పేవారని అన్నారు.. ఆయన పాత్రల ఔచిత్యాన్ని సోదాహరణంగా వివరించారు.. విశిష్ట అతిథిగా డా.ఆళ్ళ శ్రీనివాసరెడ్డి విశిష్ట అతిథిగా పాల్గొన్న అమెరికా లోని ప్రముఖ కార్డియాజిస్ట్ డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని ఆకృతి అమెరికా లో నిర్వహించడం ఎంతో విశేషం అన్నారు.. అక్కినేని ఫౌండేషన్ బోర్డు సభ్యులు రావు కలవల అక్కినేని తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షత వహించారు.. వి. రాంభూపాల్ రావు, ఇంద్ర కరణ్, డా. వర్ష, మోహన్, రవీందర్, మున్నగు వారు ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలు గా వ్యవహరించారు.. ఈ సందర్భంగా అమెరికా లో తెలుగు గాయకులు చంద్రహాస్, ప్రభాకర్ కోట, లక్ష్మీ భారతి అక్కినేనీ చిత్ర గీతాల విభావరి జనరంజకంగా నిర్వహించారు.. -
చెన్నైలో అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవం
'అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా' ఆధ్వర్యంలో 'అక్కినేని 3వ అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవం' చెన్నై లోని కామరాజ్ ఆరంగంలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు రవి కొండబోలు, కార్యదర్శి ధామ భక్తవత్సలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14వ తేది సాయంత్రం 5:30గంటల నుంచి 9:30వరకు పురస్కారాల ప్రధానం జరుగుతుందని పేర్కొన్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 70 సంవత్సారాల క్రితం అక్కినేని సినీ ప్రస్ధానం ప్రారంభించిన చెన్నై నగరంలో 3వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాని అందరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, అపోలో వైద్య సంస్థల అధిపతి, పద్మ విభూషణ్, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, మహా నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నోబెల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు ఆర్.వి.భాస్కరన్, కుమురన్ స్టోర్స్ అధినేత పి.సి.జయ రామన్ చెట్టియార్ మరియు చెన్నై ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్.కె.సుబ్బారెడ్డి ప్రత్యేక అతిధులు గా హాజరుకానున్నారు. అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఉపాధ్యక్షురాలు శారద అకునూరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో 'అక్కినేని ఆరాధన' పేరిట అలనాటి గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ 'స్వర మాధురి' నిర్వహణలో ప్రముఖ గాయనీ, గాయకులతో ఓ ప్రత్యేక సంగీత విభావరిని కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నవరత్నాల పేరిట వివిధ రంగాలలోని తొమ్మిది మంది ప్రముఖులకు పురస్కారాలను అందజేస్తున్నట్లు డా.ప్రసాద్ తోటకూర చెప్పారు. పురస్కారాలు అందుకోనున్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి. 'జీవిత సాఫల్య పురస్కారం' - పద్మశ్రీ గుత్తా మునిరత్నం నాయుడు 'వైద్య రత్న' - డాక్టర్.సి.ఎం.కె. రెడ్డి 'విశిష్ట వ్యాపార రత్న' - వి.ఎల్.ఇందిరా దత్ 'విద్యా రత్న' - డాక్టర్.రంగరాజన్, డాక్టర్. శకుంతల రంగరాజన్ 'సినీ రత్న' - రావి కొండల రావు 'రంగస్థల రత్న' - నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) 'సేవా రత్న' - ఉమా ముత్తురాం, నారాయణ స్వామి ముత్తురాం 'యువరత్న' - జయవేల్ చెల్లై 'వినూత్న రత్న' - ఈశ్వర ప్రసాద్ భట్