చెన్నైలో అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవం | 3rd international akkineni awards to be fecilitated at chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో అక్కినేని అంతర్జాతీయ అవార్డుల ప్రధానోత్సవం

Published Fri, Dec 9 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 10:18 PM

3rd international akkineni awards to be fecilitated at chennai



'అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా' ఆధ్వర్యంలో 'అక్కినేని 3వ అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవం' చెన్నై లోని కామరాజ్ ఆరంగంలో నిర్వహించనున్నట్లు అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు రవి కొండబోలు, కార్యదర్శి ధామ భక్తవత్సలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 14వ తేది సాయంత్రం 5:30గంటల నుంచి 9:30వరకు పురస్కారాల ప్రధానం జరుగుతుందని పేర్కొన్నారు.
 
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్.ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. 70 సంవత్సారాల క్రితం అక్కినేని సినీ ప్రస్ధానం ప్రారంభించిన చెన్నై నగరంలో 3వ అక్కినేని అంతర్జాతీయ పురస్కార ప్రధానోత్సవాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమాని అందరూ హాజరు కావాలని కోరారు.

 
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, అపోలో వైద్య సంస్థల అధిపతి, పద్మ విభూషణ్, డాక్టర్ ప్రతాప్ రెడ్డి, మహా నటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, నోబెల్ ఆసుపత్రి వ్యవస్థాపకుడు ఆర్.వి.భాస్కరన్, కుమురన్ స్టోర్స్ అధినేత పి.సి.జయ రామన్ చెట్టియార్ మరియు చెన్నై ఆంధ్రా అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్.కె.సుబ్బారెడ్డి ప్రత్యేక అతిధులు గా హాజరుకానున్నారు.
 
అక్కినేని ఫౌండేషన్ అఫ్ అమెరికా ఉపాధ్యక్షురాలు శారద అకునూరి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో 'అక్కినేని ఆరాధన' పేరిట అలనాటి గాయకుడు, సంగీత దర్శకుడు జి.ఆనంద్ 'స్వర మాధురి' నిర్వహణలో  ప్రముఖ గాయనీ, గాయకులతో  ఓ ప్రత్యేక సంగీత విభావరిని  కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 
 
నవరత్నాల పేరిట వివిధ రంగాలలోని తొమ్మిది మంది ప్రముఖులకు పురస్కారాలను అందజేస్తున్నట్లు డా.ప్రసాద్ తోటకూర చెప్పారు. పురస్కారాలు అందుకోనున్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి.
 
'జీవిత సాఫల్య పురస్కారం' - పద్మశ్రీ  గుత్తా మునిరత్నం నాయుడు 
 
'వైద్య రత్న' - డాక్టర్.సి.ఎం.కె. రెడ్డి
 
'విశిష్ట వ్యాపార రత్న' - వి.ఎల్.ఇందిరా దత్
 
'విద్యా రత్న' - డాక్టర్.రంగరాజన్, డాక్టర్. శకుంతల రంగరాజన్
 
'సినీ రత్న' - రావి కొండల రావు
 
'రంగస్థల రత్న' - నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) 
 
'సేవా రత్న' - ఉమా ముత్తురాం, నారాయణ స్వామి ముత్తురాం
 
'యువరత్న' - జయవేల్ చెల్లై
 
'వినూత్న రత్న' - ఈశ్వర ప్రసాద్ భట్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement