అక్కినేనికి ఘన నివాళి అర్పించిన ప్రవాస భారతీయులు | Nri Tribute To Akkineni Nageswara Rao On His 98th Birth Anniversary Message | Sakshi
Sakshi News home page

అక్కినేనికి ఘన నివాళి అర్పించిన ప్రవాస భారతీయులు

Published Tue, Sep 21 2021 9:23 PM | Last Updated on Tue, Sep 21 2021 9:29 PM

Nri Tribute To Akkineni Nageswara Rao On His 98th Birth Anniversary Message - Sakshi

దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు, పద్మ విభుషణ్ పురస్కార గ్రహీత నట సామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు 98వ జయంతిని పురస్కరించుకుని 5 ఖండాలు 30 దేశాల తెలుగు సంస్థల సహకారంతో వంశీ ఇంటెర్నేషనల్ ఇండియా, తెలుగు కళా సమితి ఒమన్ సంస్థల సంయుక్త ఆధ్వర్యములో జరిగిన కార్యక్రమంలో అక్కినేనికి ఘన నివాళి అర్పించారు. అంతర్జాల వేదికగా జరిగిన కార్యక్రమానికి అమెరికా నుంచి అమెరికా గాన కోకిల శారదా ఆకునూరి, ఇండియా నుంచి కళాబ్రహ్మ శిరొమణి వంశీ రామరాజు, వ్యవస్థాపకులు వంశీ, అనీల్ కుమార్ కడించర్ల కన్వీనర్ తెలుగు కళా సమితి, ఒమన్ నిర్వహణలో 16 గంటల పాటు నిర్విఘ్నంగా జరిగింది.
చదవండి : .Miss Universe Singapore-2021: మిస్‌ సింగపూర్‌గా శ్రీకాకుళం యువతి

ఈ కార్యక్రమంలో  ప్రముఖ వైద్య నిపుణులు సన్‌షైన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డా. గురువా రెడ్డీకి అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం, వైద్య సేవ శిరొమణి బిరుదు ప్రదానం చేశారు. కరోనా కారణంగా డా. గురువా రెడ్డికి ఆయన నివాసంలోనే కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించి అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబంతో తనకు విడదీయారాని బందం ఉందన్నారు. అక్కినేని పేరు మీద ఈ పురస్కారం అందుకోవడం అందులోనూ తమ కుటుంబ సభ్యులు తనను సత్కరించడం అపూర్వ సన్నివేశమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా నటి కళాభారతి డా. జమున రమణా రావు, సినీ దర్శకులు కే. విశ్వనాథ్, మాజీ కేంద్ర మంత్రి సుబ్బిరామిరెడ్డి, పద్మ భుషణ్ పురస్కార గ్రహిత డా. కేఎల్. వరప్రసాద్ రెడ్డి, డా. కె.వి.రమణ, తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వ సలహా దారులు, మాజీ పార్లమెంటరీ సభ్యులు, సినీ నటులు మురళిమోహన్,ఏపీ పూర్వ ఉప సభాపతి బుద్ధప్రసాద్, మహనటి సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, దేవుల పల్లి మనుమరాలు లలితారామ్(అమెరికా), ఉపేంద్ర చివుకుల కమిషనర్ న్యూజెర్సీ బోర్డ్ ఆఫ్ ఉటిలిటి(అమెరికా), డా. మెడసాని మొహన్, డా.కె.వి.క్రిష్ణ కుమారి, సుద్ధాల అశోక్ తేజ, భువన చంద్ర, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, డా. ఆళ్ళ శ్రీనివాస రెడ్ది( అమెరికా), రవి కొండబొలు(అమెరికా), డా. చిట్టెన్ రాజు వంగూరి( అమెరికా), జయ తాళ్ళురి ( తానా పూర్వ అధ్యక్షుడు), శీరిష తూముగుంట్ల(కల్చరల్ సెక్రేటరి తానా), శారదా సింగిరెడ్డి(చైర్ పర్సన్ ఆటా), గురుజాడ శ్రీనివాస్(అమెరికా) పాల్గొన్నారు. 

వారితో పాటుగా డా.లక్ష్మి ప్రసాద్ కపటపు, తాతాజీ ఉసిరికల(తెలుగు కళా సమితి ఖతర్, కే. సుధాకర్ రావు( ఊటాఫ్ కువైత్), వేదమూర్తి  యూఏఈ), సత్యనారయాణ రెడ్డి( ఏకేవీ ఖతర్ ), సురేష్ తెలుగు తరంగిణీ(యూఏఈ), ప్రదీప్ (యూఏఈ), శివ యెల్లెపు(బహ్రెయిన్), వెంకట్ భాగవతుల(ఏకేవీ ఖతర్), దీపిక రావి( సౌదీ అరేబియా ), రత్నకుమార్ కవుటూరు(సింగపూర్), రాజేష్ టెక్కలి(అమెరికా), సారధి మొటుమర్రి(ఆస్ట్రేలియా), విజయ గోల్లపుడి(ఆస్ట్రేలియా), పార్థసారధి( ఉగండా), కె.ఆర్. సురేష్ కుమార్(టాంజనియా ), డా.G.V.L. నరసింహం, డా.తెన్నెటి సుధా, శైలజ సుంకరపల్లి, రాధికా నూరి( అమెరికా), సత్యదేవి మల్లుల(మలేషియా), డా. శ్రీరామ్ శొంటి, శారదా పూర్ణ శొంటి(అమెరికా), సుధా పాలడుగు(అమెరికా), లక్ష్మీ రాయవరపు(కెనడా), గుణ సుందరి కొమ్మారెడ్డి(అమెరికా), శ్రీదేవి జాగర్లమూడి(అమెరికా ), శ్రీలత మగతల(న్యూజిలాండ్), విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి (లండన్), చిన్న రావు, వేణు గొపాల్ హరి, టి. నాగ, బి.కుమార్, చైతన్య, సీతరాం, చరణ్ కుమర్, అరుందతి, రాజశేఖర్, ఆనంద్, శారద, అపర్ణ, రాణి, సునీత, లక్ష్మీ కామేశ్వరి, విజయ కుమార్ పర్రి(స్కాట్లాండ్‌), రవి గుమ్మడవల్లి(ఐర్లాండ్), రాధిక మంగినపుడి(సింగపూర్), రాజేష్ తొలెటి(లండన్), డా. తెన్నెటి శ్యాంసుందర్, డా. తెన్నెటి విజయ చంద్ర ఆమని, డా. సమరం, గుమ్మడి గోపాలకృష్ణ, అపార గంటసాల, కామేశ్వర రావు, సింగినగ స్టార్ విజయలక్ష్మి తదితరులు పాల్లొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా వెంకట్ ప్రసారం చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గoటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలు దేశాల నుండి గాయనీ గాయకులు అక్కినేని నాగేశ్వర రావు నటించిన చిత్రాల నుంచి గీతాలను ఆలపించారు.
చదవండి: ఇల్లినాయిస్‌లో నాట్స్ ఉమెన్ త్రో బాల్ టోర్నమెంట్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement