వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
కోస్గి/బల్మూర్ : జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కోస్గి మండలంలోని సంపల్లి గ్రామశివారులో ఓ గుర్తుతెలియని వృద్ధురాలు(60) రోడ్డు దాటుతుండగా.. గుర్తుతెలియని వాహనం శనివారం రాత్రి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తుల ద్వారా వీఆర్‌ఓ సంజీవరెడ్డి పోలీసులకు సమాచారమందించారు. మృతురాలికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదని ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపారు. పోలీసులు కేసుదర్యాప్తు చేస్తున్నారు.
అలాగే బల్మూర్ మండలంలోని జిన్‌కుంట మైసమ్మ మలుపు దగ్గర శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వినయ్‌కుమార్‌గౌడ్(20) అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తికి చెందిన వినయ్‌కుమార్‌గౌడ్, శివకుమార్, రమేష్ సాగర్ అనే ముగ్గురు స్నేహితులు అచ్చంపేటలో జరిగిన ఓ వివాహానికి వెళ్లి తిరిగి వెళ్తుండగా.. నాగర్‌కర్నూల్ నుంచి దేవరకొండ వెళ్తున్న టాటా ఏస్ ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వినయ్‌కుమార్‌గౌడ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. అతడి స్నేహితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు బల్మూర్ ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.
మరో వృద్ధురాలు
గోపాల్‌పేట: బైక్ ఢీకొనడంతో ఓ వృద్ధురాలు మృత్యువాతపడింది. గోపాల్‌పేట ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాలు.. ఏదుట్ల గ్రామానికి దూడోళ్ల బక్కమ్మ(60) తన కొడుకు, కొడలితో కలిసి వ్యవసాయ పనులకు వెళ్తుండగా రేమద్దులకు వెళ్తున్న మోతూరి రవి బైక్‌పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్సకోసం వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బక్కమ్మ మృతి చెందింది. మృతురాలి కొడుకు దూడోళ్ల శేషయ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రక్తమోడిన రహదారులు
Published Mon, Mar 16 2015 4:05 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement