
రోడ్డు ప్రమాదంలో 18 మందికి తీవ్ర గాయాలు
శింగనమల /అనంతపురం మెడికల్/బుక్కరాయసముద్రం : బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్లో 15 మంది మహిళా వ్యవసాయ కూలీలు కావడం గమనార్హం. బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. శింగనమల మండలంలోని సోదనపల్లి, శింగనమల, గోవిందరాయునిపేట, మట్లగొంది గ్రామాలకు చెందిన కూలీలు పనుల కోసం ప్రతిరోజూ బుక్కరాయసముద్రం మండలానికి వెళ్లి వస్తుంటారు.
ఈ క్రమంలోనే శనివారం సోదనపల్లికి చెందిన సుమారు 70 మంది కూలీలు రెండు ఆటోలలో రెడ్డిపల్లి వద్దకు వ్యవసాయ కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం వరకు పని చేసి తిరిగి రెండు ఆటోలలో సోదనపల్లికి పయనమయ్యూరు. కొర్రపాడు-ఎస్‌ఆర్‌ఐటీ మధ్యకు రాగానే నాయనపల్లి క్రాస్ నుంచి వస్తున్న బైక్.. ఆటోను ఢీకొంది. దీంతో ఆటో రోడ్డు డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. అందులో 30 మందికిపైగానే మహిళా కూలీలు ఉండడంతో ఒకరు మీద ఒకరు పడ్డారు.
15 మందికి తీవ్ర గాయాలయ్యూరుు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గాయపడిన వారిని వెంటనే 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి తరలించారు. విజయలక్ష్మి(35), వరలక్ష్మి(34), సూరి(46) పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్సకు రెఫర్ చేశారు. ప్రతాప్(26), శివ(24), రామాంజినమ్మ(25), లక్ష్మిదేవి(35), లింగమ్మ(60), తులసి(25), సంఘవి(35), మనక్క(25), నారాయణమ్మ(35), ముత్యాలక్క(60), ఈశ్వరమ్మ(45), రామాంజినమ్మ(24), లాసక్క(33), రాధికలక్ష్మి(23), హైమావతి(29)లకు అనంతపురం సర్వజనాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఓరి దేవుడా ఇదేమి నరకం?
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని సర్వజనాస్పత్రికి శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో తీసుకువచ్చారు. వారికి తీవ్ర రక్తస్రావం అవుతోంది. వారి ఆక్రందనలతో ఎమర్జెన్సీ వార్డు మార్మోగింది. ఁసార్ నొప్పిగా ఉంది. రక్తం పోతోంది. చూడండి సార్..* అంటూ డాక్టర్లను వేడుకున్నారు. గ్రామస్తులు కూడా వందల సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. సెలైన్ బాటిళ్లను వారే చేత బట్టుకుని సాయం అందించేందుకు ప్రయత్నించారు.
అమ్మ ప్రేమంటే ఇదే..
‘అబ్బా నొప్పిగా ఉంది. అయ్యో దేవుడా నొప్పి’ అంటూనే ‘నా పిల్లలు ఎలాగున్నారో.. వారు జాగ్రత్త’ అంటూ సోదనపల్లికి చెందిన విజయలక్ష్మి రోదించింది. ఓ వైపు కాలు తెగి బాధపడుతూనే ఇంట్లో పిల్లల గురించి ఆమె పడ్డ తపన అంతా ఇంతా కాదు.
కిక్కిరిసిన ఎమర్జెన్సీ వార్డు
క్షతగాత్రులతో పాటు వందల సంఖ్యలో గ్రామస్తులు రావడంతో సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డు కిక్కిరిసిపోయింది. స్టాఫ్‌నర్సులు సేవలందించేందుకు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రభుత్వ విప్ యామినీ బాల క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన సేవలందించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావుకు సూచించారు. జేసీ బదిలీ