ప్రముఖ హాలీవుడ్ హీరో, హాస్యనటుడు కెవిన్ హార్ట్(40) ప్రమాదానికి గురయ్యారు. అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ముల్హోల్యాండ్ రహదారిపై కెవిన్, అతని స్నేహితులు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారు జామున ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కెవిన్‌కు తీవ్ర గాయాలు కాగా, అతని స్నేహితులు బ్లాక్, ఇంటర్నెట్ ఫిట్నెస్ మోడల్ ,బ్లాక్ ఫియాన్సీ రెబెక్కా కూడా తీవ్రంగా గాయపడ్డారు. వేరే వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరి ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.