చిత్తూరు, వి.కోట : మండలంలో వ్యభిచార ముఠా గుట్టును వి.కోట పోలీసులు రట్టు చేశారు. సీఐ యతీంద్ర తెలిపిన వివరాల మేరకు పట్టణానికి చెందిన (టీడీపీ నాయకుడికి సంబంధించిన ) లాడ్జి మేనజర్‌గా పనిచేస్తున్న నగేష్, వి.కోటకు చెందిన నరేంద్రబాబు పలమనేరు చెందిన పర్వీన్‌తో రహస్యంగా ఒప్పదం కుదుర్చుకుని వి.కోటలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహించేవారు. ఆదివారం రాత్రి వి.కోటకు చెందిన సతీష్ అనే విటుడిని లాడ్జికి రప్పించి ఓ యువతితో వ్యభిచారం చేయించడానికి ప్రయత్నించారు.
రాత్రి పలువురితో కలసి బురఖాతో వెళుతున్న యువతిని చూసిన పరిసరాల ముస్లిం యువకులు వారిని అడ్డగించగా వ్యభిచార విషయం బయటపడింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు లార్డికి చేరుకోగా, యువతి, యువకులతో సహా ముఠా సభ్యులు పరారయ్యారు. సోమవారం ఉదయం లాడ్జి మేనేజర్ నాగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. లాడ్జిలో వ్యభిచారం చేస్తున్న వైనాన్ని అతడు వెల్లడించాడు. లాడ్జి మేనేజర్ నాగేష్ , గంగవరానికి చెందిన పర్వీన్, వి.కోట నాగేంద్రబాబు, విటుడు సతీష్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వ్యభిచార నిర్వహణకు సంబంధించి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment