కదిరి టౌన్ : కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు ఏకంగా 15 మంది నకిలీ అభ్యర్థులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. వారిని పోలీసులకు అప్పగించారు. పరీక్ష కేంద్రంలో 10 మంది నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వరూప కనుగొన్నారు. మరో సెంటర్‌లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ రాజేంద్ర ఐదు మంది నకిలీ అభ్యర్థులను పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొన్నారు. మాల్ ప్రాక్టిస్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు.
ఆర్డీఓ తనిఖీలో మరో ముగ్గురు బుక్
కదిరి ఆర్డీఓ వెంకటేశు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించగా మరో ముగ్గురు అభ్యర్థులు చూచి రాతలు రాస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిని బుక్ చేశారు.
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు
Published Wed, Apr 19 2017 12:09 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement
Advertisement