open tenth exams
-
ఒకరికి బదులు మరొకరు..
నర్సంపేట రూరల్: ఒకరికి బదులు మరొకరు ఓపెన్ టెన్త్ పరీక్షలు రాసిన సంఘటన నర్సంపేట పట్టణంలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సంపేట పట్టణంలో సోమవారం నుంచి ఓపెన్ టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే అసలు అభ్యర్థులకు బదులు నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. దీంతో ఇన్విజిలేటర్లు వారిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నర్సంపేట పట్టణంలోని బాలుర హైస్కూల్లో 6, బాలికల హైస్కూల్లో 17 మంది పరీక్షలు రాస్తూ దొరికారు. వీరి హాల్‌టికెట్లు, ఓఎంఆర్ షీట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆయా పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, అబ్జర్వర్ల ఫిర్యాదు మేరకు 23 మందిపై మాల్‌ప్రాక్టీస్ కింద రెండు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
ఏప్రిల్ 17 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు
మెదక్‌మున్సిపాలిటీ: ఏప్రిల్ 17 నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఇన్చార్జి విద్యాధికారిని విజయలక్ష్మి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 17 నుంచి మే1 వరకు థియరీ, మే 8 నుంచి 12 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని తెలిపారు. మరింత సమాచారం కోసం జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి సెల్.8008403635 నంబర్లో సంప్రదించవచ్చునని తెలిపారు. -
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు
కదిరి టౌన్ : కదిరిలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఒకే రోజు ఏకంగా 15 మంది నకిలీ అభ్యర్థులు పట్టుబడటం సంచలనం సృష్టించింది. వారిని పోలీసులకు అప్పగించారు. పరీక్ష కేంద్రంలో 10 మంది నకిలీ అభ్యర్థులు పరీక్షలు రాస్తుండగా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ స్వరూప కనుగొన్నారు. మరో సెంటర్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ రాజేంద్ర ఐదు మంది నకిలీ అభ్యర్థులను పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకొన్నారు. మాల్ ప్రాక్టిస్ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేస్తామన్నారు. ఆర్డీఓ తనిఖీలో మరో ముగ్గురు బుక్ కదిరి ఆర్డీఓ వెంకటేశు పరీక్షా కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించగా మరో ముగ్గురు అభ్యర్థులు చూచి రాతలు రాస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిని బుక్ చేశారు. -
చాలా 'ఓపెన్' టెన్త్ ఎగ్జామ్స్