కరీంనగర్ (జ్యోతినగర్): పేకాట ఆడుతున్న పదిమందిని ఎన్టీపీసీ పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఎలకలపల్లి గ్రామ శివారులో ఆదివారం ఉదయం పేకాడుతున్న పదిమంది పేకాట రాయుళ్లను పోలీసులు ఆట కట్టించారు. వారినుంచి రూ.99వేల నగదు, 11 సెల్‌ఫోన్లతో సహా ఐదు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ మల్లారెడ్డి పేర్కొన్నారు.