
సాక్షి, విశాఖ : పొట్టిశ్రీరాములు జయంతి రోజున బండారు సత్యనారాయణ తప్పతాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేయడం దారుణమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు పేర్కొన్నారు. మా తాతల నుంచి ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి కబ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాపై బురద జల్లేందుకు ప్రెస్‌మీట్‌లు పెట్టి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. 2016లో టీడీపీ హయాంలో సివీఎస్ రంగారావు నేతృత్వంలో పరిశీలించిన వ్యవసాయ భూములను, చెరువులను మేము కబ్జా చేశామని చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. మా గౌరవాన్ని కించపరిచినందుకు మేము లీగల్‌గా కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.