bandaru sathya narayana
-
గ్రామస్థులు ఎటాక్...బండారు జంప్..
-
ఇదేనా మహిళలను గౌరవించడం!
‘ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపడరో అక్కడ సత్కర్మలకు విలువ ఉండద’ని భారతీయ సంస్కృతి తెలియజేస్తోంది. త్రిశక్తి రూపంగా, ప్రకృతికి ప్రతిరూపంగా, ఆదిశక్తిగా స్త్రీని ఆరాధించడం, పూజించడం భారతీయ సంప్రదాయం. మాతృదేవోభవ అంటూ తల్లిని తొలి దైవంగా గౌరవించే విశిష్ట సంస్కృతి భారతీయుల సొంతం. వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రంగాలలో స్త్రీలను గౌరవించడం, ప్రోత్సహించడం జరుగుతోంది. పురాణే తిహాసాల నుంచి నేటి ఆధునిక సమాజం వరకు పరిశీలిస్తే వేదా ధ్యయనం, కళలు, యుద్ధ నైపుణ్యాలు నుంచి నేటి ఆధునిక సమాజంలో విభిన్న బాధ్యతలను అలవోకగా నిర్వహిస్తు న్నారు మన మహిళలు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, కోడలిగా విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి కేవలం మహిళలకే ఉంది. తాను పుట్టినింటిని వదిలి, కుటుంబాన్నీ, బంధువులనూ వదలి, వేరొకరి ఇంటికి వెళ్లి వారికోసం నిస్వార్థంగా కృషి చేసే మహా మనిషి స్త్రీ మూర్తి. భారత దేశంలో స్త్రీకి అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఆదిమ కాలం నుంచీ ఉంది. అటువంటి సమాజంలో నేడు జరుగు తున్న కొన్ని సంఘటనలు మనిషితనం దిగజారడానికి అద్దం పడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆర్.కె. రోజాపై తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నత స్థానంలో, మంత్రి పదవిలో ఉన్న మహిళ గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజలందరినీ కదిలించింది. మహిళలను కించపరచడం, దూషించడం, వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం ఎంతమాత్రం హర్షణీయం కాదు. దీనిపై స్త్రీ, పురుషులనే వ్యత్యాసం లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తీ స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయ విలువలు, మానవీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలుగా ఈ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. సభ్య సమాజం బండారు ఉపయోగించిన పదజాలాన్నీ, వ్యాఖ్యల్నీ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళుతున్న ఈ కాలంలో ఇటువంటి అవమానాలకు మహిళలను గురిచేయడం సమంజసం కాదు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్త్రీ, పురుషులను సమానంగా చూడాలని కాంక్షించారు. స్త్రీల హక్కుల కోసం న్యాయ శాఖమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఇటువంటి మహనీయులు పుట్టిన ఈ దేశంలో, రాజ్యాంగ నిర్మాతల ఆశయా లకు విరుద్ధంగా మాట్లాడుతున్న వీరిని అంబేడ్కర్ వ్యతిరేక వాదులుగా చూడా ల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎవరైనా సరే మహిళలను అవహేళన చేయడాన్నీ, అవమానకరంగా మాట్లాడటాన్నీ ఉపేక్షించరాదు. ఇటువంటి సంఘటనలపై న్యాయస్థానాలు సైతం స్వచ్ఛందంగా స్పందించాలి. సుమోటోగా వీటిని స్వీకరిస్తూ మహిళల హక్కుల పరిక్షణకు పాటుపడాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక పటిష్ఠ వ్యవస్థనూ, చట్టాన్నీ ఏర్పాటు చేసే దిశగా న్యాయకోవిదులు దృష్టి సారించాలి. ప్రజాస్వామ్య వాదులూ, మానవీయ వాదులూ అంతా దీనిని ఖండించాల్సిన అవ సరం ఉంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. - వ్యాసకర్త విద్యావిభాగాధిపతి, ఏయూ. ‘ 94907 98631 -
టీడీపీ నేత బండారు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు వెళ్తా: మంత్రి రోజా
-
'కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఆయనే'
సాక్షి, విశాఖ : పొట్టిశ్రీరాములు జయంతి రోజున బండారు సత్యనారాయణ తప్పతాగి రోడ్డు మీద యాక్సిడెంట్ చేయడం దారుణమని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు పేర్కొన్నారు. మా తాతల నుంచి ఉన్న భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించి కబ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని మండిపడ్డారు. రానున్న స్థానిక సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాపై బురద జల్లేందుకు ప్రెస్మీట్లు పెట్టి తప్పుడు వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. 2016లో టీడీపీ హయాంలో సివీఎస్ రంగారావు నేతృత్వంలో పరిశీలించిన వ్యవసాయ భూములను, చెరువులను మేము కబ్జా చేశామని చేస్తున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలని హెచ్చరించారు. మా గౌరవాన్ని కించపరిచినందుకు మేము లీగల్‌గా కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
చంద్రబాబు బిస్కెట్‌తో ఇద్దరూ చెట్టాపట్టాల్..
పెందుర్తి: ‘అదిగో మూడు నల్లకార్లు వస్తున్నాయి. అందులో అన్న పెద్ద దొంగ.. తమ్ముడు చిన్న దొంగతో పాటు వాళ్ల కుడిఎడమల్లో ఉన్న వాళ్లూ దొంగలే. మా చంద్రబాబుకు బుద్ధి లేక అతడ్ని మా పార్టీలోకి రానిచ్చారు. అలాంటి వాళ్లకు నా పక్కన ఎన్నటికీ స్థానం లేదు’కొన్నాళ్ల కిందట సబ్బవరం మండల పరిషత్ మధ్యంతర ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు గండి బాబ్జీ, అతడి తమ్ముడు రవిపై అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన ఘాటు విమర్శలు ఇవి. ‘మావి నల్లకార్లు అయితే అతడిది.. అతడి కొడుకుది తెల్లకార్లు.. నియోజకవర్గంలో చేసేవన్నీ వైట్‌కాలర్ నేరాలే. ఇద్దరూ కలిపి దోపిడీలు తప్ప పాలన ఎక్కడా చేయడం లేదు.. చంద్రబాబు ఈసారి ఈ దగాకోర్లకు టికెట్ ఇవ్వడు. పెందుర్తి నుంచి ఈసారి టీడీపీ టికెట్ నాదే.. తప్పితే రెబల్ అవతారం ఎత్తైనా బండారును మట్టి కరిపిస్తాను’అదే సమయంలో ఎమ్మెల్యే బండారు, అతడి కొడుకుని ఉద్దేశించి గండి బాబ్జీ కౌంటర్ ఎటాక్. అప్పట్లో ఈ ఇద్దరి టీడీపీ నేతల ‘స్ట్రీట్ ఫైట్’చూసిన ఇరువురి అనుచరులు కూడా ‘సై’అంటూ కాలుదువ్వుకున్నారు. ఆ సన్నివేశాన్ని చూసి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనించసాగారు. సీన్ కట్ చేస్తే సార్వత్రిక ఎన్నికల నగరా మోగింది. ప్రత్యర్థి పార్టీ నుంచి తొలి జాబితా లోనే ఉత్సాహవంతుడైన యువకుడి పేరును ప్రతిపక్ష నేత ప్రకటించారు. కానీ అధికార పక్షంలో మాత్రం టికెట్ కోసం గండి–బండారు మధ్య పోరు సాగింది. చివరకు చచ్చీచెడీ.. బెదిరించో.. బుకాయించో.. సాగిలాపడో బండారే టికెట్‌ను ఎత్తుకొచ్చేశాడు. దీంతో అవమాన భారంతో రగిలిపోయిన బాబ్జీ వర్గీయులు ‘ఇన్నాళ్లు బండారు మమ్మల్ని చిత్రహింసలు పెట్టాడు.. తమను కంటికి రెప్పలా చూసుకునే మా గురువు సత్తా చూపుతాడు.. బండారుకు ఇక చుక్కలే’అంటూ బీరాలు పోయారు. మళ్లీ సీన్ కట్ చేస్తే.. మొగలిపురంలోని బాబ్జీ ఇంటికి బండారు, కొడుకు వెళ్లడం.. అన్న బాబ్జీ.. తమ్ముడు రవి చేతిలో చెయ్యివేసి ఆహ్వానించడం.. భోజనాలు చేయడం.. చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులివ్వడం.. గండి బాబ్జీ వీధుల్లో తిరుగుతూ బండారుకు దాసోహం కావడం చూస్తున్న జనం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. పెందుర్తి వీధుల్లో పౌరుష రసం పొంగుతుందని భావించిన ఒకరికి ఒకరు లొంగిపోయి ఓట్ల కోసం ఒకరు.. నామినేటెడ్ పదవి కోసం ‘రాజీ’రసాన్ని విరజిమ్మడాన్ని బాబ్జీ వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇన్నేళ్లూ బాబ్జీ మనుషులుగా బండారు, అతడి కొడుకు చేతిలో చావుదెబ్బలు తిన్న మాకు ఏంట్రా ఈ ఖర్మ అంటూ తలలు పట్టుకుంటున్నా రు. మరోవైపు బండారు–బాబ్జీ ‘స్ట్రీట్ డ్రామా’ ను చూస్తున్న ప్రజలు మాత్రం మా వద్ద దోచుకున్న సొమ్ము పట్టుకెళ్లడానికి ‘నల్లకార్లు–తెల్లకార్లు’ఒక్కటైపోయాయంటూ నిట్టూరుస్తున్నారు. బాబ్జీ ఈ అవమానాలను మరిచిపోయావా? ♦ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ టీడీపీలో చేరడాన్ని బండారు తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీలో చేరిన కొత్తలో బాబ్జీని, ఆయన అనుచరులను హీనంగా చూసేవారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు కూడా రానివ్వకుండా అంటరానితనం చూపేవారు. ♦ 2016 చివర్లో సబ్బవరం ఎంపీపీ మధ్యంతర ఎన్నిక సమయంలో బండారు–బాబ్జీ వర్గీయుల మధ్య పోటీ ఏర్పడింది. ఒకే పార్టీకి చెందిన వీరు తమ వర్గం వారికి ఎంపీపీ పదవి కట్టబెట్టాలన్న పంతంతో ఎంపీటీసీలకు ‘ప్రత్యేక క్యాంప్’లు కూడా నిర్వహించారు. చివరకు హైవోల్టేజ్ డ్రామాలో బాబ్జీ వర్గానికి చెందిన వ్యక్తి ఉమామహేశ్వరరావుకే ఆ పదవి దక్కింది. దీంతో బండారు తీవ్ర అవమాన భారంతో రగిలిపోయారు. ఎంతలా అంటే బాబ్జీ మనిషి అయిన ఎంపీపీ పాల్గొన్న ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికి కూడా బండారు నేటికీ హాజరు కాలేదు. అంతేకాదు ఎంపీపీపై భూఆక్రమణ కేసులు కూడా పెట్టించారు. ♦ వంగలి సమీపంలో పెట్రో వర్సిటీ శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రులతో పాటు సీఎం చంద్రబాబు కూడా వచ్చారు. అయితే ఆ కార్యక్రమానికి బాబ్జీని రాకుండా అడ్డుకున్నారు బండారు. ఆ సమయంలో బాబ్జీ వేదిక వద్దే ఆందోళన చేయడం పెద్ద దుమారమే రేగింది. ♦ బండారుకు అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ బాబ్జీ మనుషులపై కక్షసాధింపు చర్యలకు దిగారు. అనేక సందర్భాల్లో బండారు నేరుగానే విమర్శలు చేయడం, కేసులు పెట్టించడం వంటివి చేశారు. బండబూతులతో తూలనాడిన సందర్భాలూ కోకొల్లలు. -
'పదేళ్లు ఉంటాం.. 10 నిమిషాలు కూడా వదలం'
మహారాణిపేట (విశాఖపట్నం): వచ్చే పదేళ్లలో కనీసం పది నిమిషాలు కూడా వదలకుందా హైదరాబాద్ లోనే ఉంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. సెక్షన్ -8 విషయంలో గవర్నర్ ఇంకా మీనమేషాలు లెక్కించడం సబబు కాదని ఆయన అన్నారు. వెంటనే కేసీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఒకవేళ సెక్షన్ -8 అమలు చేయకుంటే పోలీసు వ్యవస్థను తామే ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలియజేశారు. సమాంతర పరిపాలన ఉండకూడదనుకుంటే గవర్నర్ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంకా రాద్ధాంతం చేస్తే లక్షలాది మందితో మరో ప్రజా పోరాటానికి సిద్ధమవుతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. సెక్షన్ 8ను అమలు చేయకుంటే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్‌తో ఉద్యమిస్తామన్నారు. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలు, జీహెచ్ఎంసీ వంటి వాటిని గవర్నర్ తన ఆధీనంలోకి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు రక్షణ లేదని, వారిని కేసీఆర్ ప్రభుత్వం దోషుల్లా చూస్తోందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గవర్నర్ 'సెక్షన్ -8' తక్షణమే అమలు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్య నారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కేవలం 10 జిల్లాలకు మాత్రమే సీఎం అని.. తాము కూడా కేంద్రాన్ని బెదిరించగలమని ఈ సందర్భంగా బండారు వ్యాఖ్యానించారు. ఇంకా పదేళ్ల పాటు హైదరాబాద్ లోనే ఉంటామని ఆయన అన్నారు.