
ఇతర కులాల వారికి మత్స్యశాఖ అధికారులు మంజూరు చేసిన కుల ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, జలుమూరు(శ్రీకాకుళం) : కాదేదీ అవినీతికి అనర్హం అన్న రీతిలో గత ప్రభుత్వ హయాంలో దోచుకున్న తెలుగుదేశం నాయకుల అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సహజ వనరులను కొల్లగొ ట్టి కోట్లు గడించిన టీడీపీ నేతలు.. ఆఖరుకు పింఛ న్ల కోసం కులాలను కూడా మార్చేసి అవినీతికి తెరతీశారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పింఛన్లు మంజూరు కావడం, ఇతర రాయితీలు లభిస్తుండటంతో వారి ధ్రువపత్రాలను ఇతర కులస్తులకు అ క్రమ మార్గంలో అందించి వసూళ్లకు పాల్పడ్డారు.
చక్రం తిప్పిన తెలుగు తమ్ముళ్లు!
నరసన్నపేట నియోజకవర్గంలో గంగపుత్రులకు దక్కాల్సిన పింఛన్లు, ఇతర పథకాలు ఇతర కులస్తులు తప్పుడు కులధ్రువీకరణ పత్రాలతో పొందుతున్నారు. ఈ వ్యవహారంలో స్థానిక తిమడాం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత చక్రం తిప్పి పింఛన్లు మంజూరు చేయించాడని సమాచారం. దీనికి చెన్నాయవలసకు చెందిన మత్య్సకార యువకుడు అంతా తానై వ్యవహరించి మత్య్సకా ర ధ్రువపత్రాలను సిద్ధం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అన్నీ అక్రమాలే..
గతంలో ఇదే నాయకుడు తిమడాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం, ఇసుక అక్రమ రవాణా, నీరు చెట్టు పనులు, తుఫాన్ పరిహారం, విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ ఉద్యోగాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ కూడా అప్పటి ఎమ్మెల్యే పేరు చెప్పి అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా మత్స్యకారులకు చెందిన పింఛన్లు తమ సామాజిక వర్గానికి మంజూరు చేయించుకోవడం గమనార్హం. తిమడాం, లచ్చన్నపేట, గొటివాడ, రావిపాడు, అక్కురాడ కాలనీ తదితర గ్రామాల్లో సుమారు 20 మంది వరకు తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్నట్లు తెలిసింది. తిమడాంలో వెలమల నాగమయ్య, ముద్దాడ మల్లేశ్వరరావు, పంచిరెడ్డి గడ్డయ్య, దూసి లక్ష్మీనారాయణ, యండమూడి రాము, పిల్లల శిమ్యయ్య, నవిరి రాజారావు తదితరులకు మత్స్యకార ధ్రువపత్రాలు మంజూరయ్యాయి. వాస్తవంగా వీరంతా వేరే కులాలకు చెందిన వారు. మూడు నాలుగు గ్రామాల్లోనే 20 మంది వరకూ బయటపడితే మండల వ్యాప్తంగా ఎంతమంది ఉంటారన్నదానిపై దర్యాప్తు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. పింఛను లబ్ధిదారులు వేర్వేరు గ్రామాలకు చెందినవారైన ఈ అక్రమ పింఛన్లు మాత్రం చెన్నాయవలస నుంచే మంజూరు కావడం విశేషం.
అధికారులపై ఒత్తిడి!
వాస్తవంగా మత్స్యకారులకు పింఛన్లు మంజూరు చేయాలంటే ఆ శాఖ అభివృద్ధి అధికారి ఆమోదం కావాలి. ఇందుకోసం తగిన ధ్రువపత్రాలను పరిశీలించాలి. బోటు రిజిస్ట్రేషన్, మత్స్యకార సంఘాల గుర్తింపుకార్డు, రేషన్, ఆధార్‌కార్డు, సాగరం, స్వదేశీ మత్స్యకార వృత్తిలో ఉన్నారా లేదా అనే విషయం ధ్రువీకరించాలి. ముఖ్యంగా మత్స్యశాఖలో ధ్రువపత్రాలు ఇచ్చే సమయంలో కార్యాలయం రికార్డు, సీరియల్ నంబరు ఉంటాయి. ఇవేవీ లేకుండా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కాగా, జలుమూరు మండల పరిధిలో మంజూరైన ఈ తరహా పింఛన్లు తొలగించేందుకు సదరు టీడీపీ నాయకుడు రంగంలోకి దిగినట్లు సమాచారం. విషయం బయటకు పొక్కకముందే పింఛన్లు తొలగించాలని మండల పరిషత్‌తోపాటు మత్స్యశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
సంతకాలు ఫోర్జరీ చేశారు
నరసన్నపేట నియోజకవర్గంలో మత్స్యకారులు కాని వారిని మత్స్యకారులుగా గుర్తించి పిం ఛన్లు మంజూరు చేసిన సంగతి నాకు తెలియ దు. కుల ధ్రువీకరణ పత్రాల్లో ఉన్న సంతకాలు నావి కావు. నాతో పాటు అంతకుముందున్న అధికారుల సంతకాలను కూడా ఫోర్జరీ చేసినట్లుగా తెలుస్తోంది. మత్స్యకారుడి గుర్తింపు కార్డును చూడకుండానే ధ్రువపత్రాలు ఇచ్చేసినట్టుంది. పొరపాట్లను సరిదిద్దుతాం.
– పి.శాంతారావు, మత్స్యశాఖ పర్యవేక్షణాధికారి
Comments
Please login to add a commentAdd a comment