సాక్షి, ధర్మపురి: ధర్మపురిలోని హరితహోటల్‌లో పర్యాటకంమాటున రాసలీలలు కొనసాగుతున్నాయి. మందుబాబులు.. విటులు హోటల్‌ను వేదిక చేసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రెండునెలల క్రితం మందుబాబులతోపాటు కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. ఆ సంఘటన మరువకముందే సోమవారం ఓ జంట రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడింది. ధర్మపురికి వచ్చే పర్యాటకుల కోసం గోదావరి ఒడ్డున మూడేళ్ల క్రితం పర్యాటక శాఖా వారి ఆధ్వర్యంలో హరితహోటల్‌ను నిర్మించారు. ఈ హోటల్‌లో మద్యం, మాంసానికి తావులేదు. హోటల్‌లో ఉండాలంటే ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకుంటారు. హోటల్‌లో చేరేముందు పర్యాటకుల ఆధార్‌కార్డు తప్పనిసరిగా తీసు కోవాల్సి ఉంటుంది. నిర్వాహకులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. రెండునెలల క్రితం పోలీసులు దాడుల చేయగా.. హోటల్ అసాంఘిక కార్యకలపాలు సాగిస్తున్నట్లు తేలింది. ఆ సమయంలో మేనేజర్‌ను సస్పెం డ్ చేశారు. అప్పటినుంచి హోటల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం
అడ్డంగా దొరికిన జంట
భార్యాభర్తలమని చెప్పి హోటల్‌ను అద్దెకు తీసుకున్న ఓ జంట రెండురోజులుగా బయటకు రావడం లేదు. దీంతో కొందరు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో పోలీసులు గదిని తెరువగా ఆ జంట రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది. గదిలో మందుతోపాటు ఇతర వస్తువులున్నాయి. కరీంనగర్‌కు చెందిన ఓ వివాహిత (భర్త నుంచి విడాకులు తీసుకుంది) సిద్దిపేటకు చెందిన ఓ యు వకుడితో ప్రేమలో పడింది. హోటల్‌లో గదిని తప్పుడు చిరునామాతో అద్దెకు తీసుకున్నట్లు తేలింది. అయినా సిబ్బంది ఆధార్‌కార్డులు పరిశీలించకుండానే వారినుంచి కొంతసొమ్ము తీసుకుని అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో సీఐ లక్ష్మీబాబు జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. హోటల్ నిర్వాహకులనూ మందలించారు. తప్పుడు ధ్రువీ కరణ పత్రాలతో వస్తే గదులు ఇవ్వవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment