సాక్షి, హైదరాబాద్ (సనత్‌నగర్): స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన ఎస్.అనిల్‌కుమార్ (31) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కృష్ణారెడ్డి బిల్డింగ్స్‌లో ఓషన్ బ్యూటీ స్టూడియో నిర్వహిస్తున్నాడు.
పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం స్టూడియోపై దాడులు నిర్వహించగా అక్కడ స్పా, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ లేకపోగా, కస్టమర్ల రిజిస్ట్రర్ నిర్వహించకపోవడం, సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం, అర్హులైన థెరపిస్ట్ లేకపోవడం తదితర సమస్యలను గుర్తించారు. స్టూడియోను మూసివేసి నిర్వాహకులు అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment