studio
-
మస్క్ కొత్తగా గేమింగ్ స్టూడియో!
రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలని ఎక్స్ సీఈఓ ఇలాన్‌మస్క్ అన్నారు. మస్క్ ఆధ్వర్యంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ‘ఎక్స్ఏఐ’ సాయంతో త్వరలో ఏఐ ఆధారిత గేమింగ్ స్టూడియోను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. గేమింగ్ పరిశ్రమలో పెద్ద సంస్థల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఈ రంగాన్ని తిరిగి గొప్పగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ విభాగంలోని ప్రవేశిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఆవిష్కరణలు కరవుగేమింగ్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్, సోనీ వంటి దిగ్గజ కంపెనీలతో పోటీ పడాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు మస్క్ తెలిపారు. ఈ పరిశ్రమలో ఆవిష్కరణలు లేక స్తబ్దత నెలకొందన్నారు. ఎక్స్ఏఐ ద్వారా ఈ పరిశ్రమను తిరిగి గొప్పగా తీర్చిదిద్దుతామన్నారు. డొజికాయిన్ గేమింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బిల్లీ మార్కస్ ఇటీవల ఈ రంగంపై స్పందిస్తూ ఈ పరిశ్రమలో కార్పొరేట్ ఆధిపత్యం అధికమైందన్నారు. ఆయా సంస్థల వ్యక్తిగత ఆసక్తుల వల్ల ‘మానిప్యులేటివ్’ కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయని చెప్పారు. మార్కస్ వ్యాఖ్యలను మస్క్ అంగీకరిస్తూ ‘చాలా గేమ్ స్టూడియోలు పెద్ద సంస్థల యాజమాన్యంలో ఉన్నాయి. గేమింగ్ పరిశ్రమను మళ్లీ గొప్పగా చేయడానికి ఎక్స్ఏఐ గేమ్ స్టూడియోను ప్రారంభించబోతోంది. రాజకీయ ప్రమేయంలేని గేమింగ్ వ్యవస్థ ఉండాలి’ అని తెలిపారు.ఎక్స్‌బాక్స్‌పై విమర్శలుమైక్రోసాఫ్ట్ ఆధ్వర్యంలోని గేమింగ్ బ్రాండ్ ‘ఎక్స్‌బాక్స్’లో వివక్షతతో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నట్లు ఇటీవల విమర్శలొచ్చాయి. కొన్ని గేమ్‌ల్లో నల్లజాతీయులకు అధిక ప్రాధాన్యం ఇస్తూ, తెల్లవారిని ఆయా గేమ్‌ల్లో తక్కువ చేసి చూపిస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. దాంతో మస్క్ తన ఎక్స్ ఖాతాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ట్యాగ్ చేస్తూ ‘ఇది చట్టవిరుద్ధం’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి: అదానీ అప్పులపై బ్యాంకులు సమీక్షఇరువైపులా సంభాషించే ఏఐమార్చి 2023లో మస్క్ ఎక్స్ఏఐను స్థాపించారు. దీన్ని ‘గ్రోక్’ ఏఐ సాయంతో అభివృద్ధి చేశారు. ఇరువైపులా సంభాషించేందుకు వీలుగా దీన్ని రూపొందించారు. కృత్రిమ మేధ సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి అమెరికాలోని టేనస్సీలోని మెంఫిస్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కంప్యూటర్ను ఏర్పాటు చేసే ప్రణాళికలను సైతం కంపెనీ గతంలో ప్రకటించింది. -
ఫొటోలు ఇవ్వని స్టూడియో యజమానికి జరిమానా
అనంతపురం: పెళ్లి సమయంలో తీసిన ఫొటోలు, వీడియో ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన స్టూడియో యజమానికి రూ.50 వేల జరిమానా విధిస్తూ జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం.శ్రీలత శుక్రవారం తీర్పు వెలువరించారు. వివరాలు... అనంతపురానికి చెందిన శ్రీనివాసకుమార్ గత ఏడాది తన కుమారుడి వివాహ వేడుకకు సంబంధించి ఫొటోలు, వీడియో తీసేందుకు ఫొట్రోగాఫర్ జయచంద్రతో రూ.85 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో రూ.75 వేలను చెల్లించాడు. అయితే పెళ్లి ముగిసి నెలలు గడుస్తున్నా ఫొటోలు, వీడియో ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో శ్రీనివాసకుమార్ నిలదీశాడు. ఆ సమయంలో ఫొటోలు, వీడియో ఇవ్వడానికి కుదరదని, కావాలంటే డబ్బు తిరిగి ఇస్తానని జయచంద్ర తెలిపి, ఆ మొత్తం కూడా ఇవ్వకుండా మొండికేశాడు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. జయచంద్ర తీసుకున్న రూ.75 వేలను 24 శాతం వడ్డీతో సహా చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేయడంతో పాటు సేవాలోపానికి గాను మరో లక్ష రూపాయల జరిమానా, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించాలని పిటీషన్ దాఖలు చేశాడు. దీనికి సంబంధించిన నోటీసులు అందుకున్న స్టూడియో యజమాని కమిషన్ ఎదుట హాజరు కాకుండా ముఖం చాటేశాడు. దీనిపై పూర్వపరాలు విచారించిన అనంతరం ఫిర్యాది పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని రూ.75వేలను 9శాతం వడ్డీతో సహా చెల్లిచండంతో పాటు మానసిన వేదనకు గురిచేయడం, సేవాలోపానికి గాను రూ.50 వేలు జరిమానా, కోర్టు ఖర్చులకు మరో రూ.5 వేలు అంతా కలిపి 45 రోజుల్లోపు చెల్లించాలని జిల్లా వినియోగదారుల న్యాయస్థానం చైర్పర్సన్ ఎం శ్రీలత, సభ్యులు డి. గ్రేస్ మేరి, బి. గోపీనాథ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. -
ఫొటో షూట్లకువినూత్న వేదిక..
నగరంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు, క్రియేటివ్ బ్రాండ్ మేనేజర్లకు కావాల్సిన సకల సదుపాయాలతో సృజనాత్మక ఫ్యాషన్ స్టూడియోలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్ వేదికగా అధునాతన సాంకేతికతతో అరిసా బొట్టెగా క్రియేటివ్ స్టూడియో ప్రారంభమైంది. ఇందులో ప్రత్యేకమైన ఇన్ డోర్ సెట్స్.. ఫొటోలు–వీడియోలు అత్యద్భుతంగా వచ్చేందుకు కావాల్సిన ప్రాప్స్.. తదితర అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు సాతి్వక తెలిపారు. ఈ వేదికలో బ్రాండ్ విజువల్స్, ఫ్యాషన్ షూట్స్‌తో పాటు పెంపుడు జంతువులు, పిల్లల వినోదభరితమైన సెట్టింగ్‌లను ఏర్పాటు చేశామని శ్రీ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సెట్టింగ్స్‌లో పలువురు మోడల్స్ ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు. -
ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో కిసాన్ స్టూడియో, కాల్ సెంటర్
సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సమీకృత రైతు సమాచార కేంద్రం (ఐసీసీ కాల్ సెంటర్)’ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఏపీ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి లో కిసాన్ అవుట్‌బౌండ్ కాల్ సెంటర్‌తో పాటు కిసాన్ స్టూడియోలను అందుబాటులోకి తెచ్చింది. వీటిని కేంద్ర మంత్రి అర్జున్ ముండా బుధవారం జాతికి అంకితం చేశారు. ఇప్పటికే తెలంగాణ ఓ కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా, రాజస్థాన్‌లోనూ ఏర్పాటుకు అక్కడి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే చానల్‌ను జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పరిశీలించారు. వారిచ్చిన సూచనలతోనే కేంద్రం జాతీయ స్థాయిలో కాల్ సెంటర్, స్టూడియోలను కేంద్రం తీసు కొచ్చిందని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదీ కేంద్ర కాల్ సెంటర్ ఈ కేంద్రం ద్వారా నిపుణులైన సిబ్బంది రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు. సీనియర్ అధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు ఇందులో ఉంటారు. వ్యవసాయ, అనుబంధ రంగాల సమగ్ర సమాచారాన్ని క్రోడీకరిస్తూ రైతులకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా ఈ కాల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రధాన పంటలు సాగయ్యే ప్రాంతాల రైతులకు ఈ కాల్ సెంటర్ మార్గదర్శకంగా నిలుస్తుంది. రైతుల కు ఫోన్ చేసి పంటల స్థితిగతులు, అక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. వాటి తీవ్రతను బట్టి అధ్యయనం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఆ ప్రాంతాలకు పంపిస్తారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలపై రైతుల సూచనలు తీసుకుని అమలు చేస్తారు. కార్పొరేట్ స్థాయిలో గన్నవరం ఐసీసీ కాల్ సెంటర్ ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ఐసీసీ కాల్ సెంటర్, ఆర్బీకే ఛానల్‌ను ఏర్పాటు చేశారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, 67 మంది సిబ్బందితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ రైతులకు సాగులో, క్షేత్ర స్థాయిలో వారు ఎదుర్కొనే అన్ని సమస్యల పరిష్కారానికి చక్కని వేదికగా నిలిచింది. సమస్య తీవ్రతను బట్టి 24 గంటల్లో బృందాలను గ్రామాలకు పంపి రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తూ రైతుల మన్నననలు చూరగొంది. ఛానల్ ద్వారా సీజన్లో పంటలవారీగా అభ్యుదయ రైతులు, శాస్త్రవేత్తలతో సలహాలు, సూచనలతో కూడిన వీడియోలతో పాటు ప్రత్యక్ష ప్రసారాలతో రైతులకు దగ్గరైంది. ఐసీసీ ద్వారా 8.26 లక్షల కాల్స్, 12,541 వాట్సప్ సందేహాలను నివృత్తి చేశారు. అలాగే ఆర్బీకే ఛానల్ ను 2.81 లక్షల మంది సబ్‌స్క్రైబ్ చేసుకోగా, 57.12 లక్షల మంది వీక్షించారు. వ్యవసాయ అను బంధ రంగాలకు చెందిన 1,698 వీడియోలను అప్లోడ్ చేసుకొన్నారు. ఐసీసీ సేవలను కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖతో పాటు ఎన్నో రాష్ట్రాలు వాటి ప్రతినిధులను పంపి అధ్యయనం చేశాయి. బ్రిటిష్ హై కమిషనర్ గారేట్ వైన్ ఓనర్, యూఎన్వోకు చెందిన ఎఫ్ఏవో కంట్రీ హెడ్ చి చోరి, ఇథియోపియా దేశ వ్యవసాయ శాఖ మంత్రి మెలెస్ మెకోనెన్ ఐమెర్ వంటి ప్రముఖులు ఈ కేంద్రం పనితీరును ప్రశంసించారు. మన విధానాలు కేంద్రం అనుసరిస్తోంది సీఎం జగన్ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు విధానాలను కేంద్రం అనుసరిస్తోంది. పలు రాష్ట్రాలు కూడా వాటిని ప్రవేశపెడుతున్నాయి. గన్నవరంలోని ఐసీసీ కాల్ సెంటర్ నాలుగేళ్లుగా రైతుల సేవలో తనదైన ముద్ర వేసుకుంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఏపీ స్ఫూర్తితో కేంద్రం కేసీసీను తీసుకురావడం నిజంగా గొప్ప విషయం. ఐసీసీ కాల్ సెంటర్‌ను మరింత పటిష్ట పరిచి సేవలను మరింత విస్తృతం చేస్తాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
AP Cinema : మినీ స్టూడియోతో హార్సిలీహిల్స్‌కు మహర్దశ
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రముఖ వేసవి విడిది కేంద్రం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియోను నిర్మిస్తే ఈ ప్రాంతానికి మహర్దశ పట్టనుంది. దీని ఏర్పాటు దిశగా జరుగుతున్న ప్రయత్నాలతో హార్సిలీహిల్స్ భవిష్యత్‌లో సినిమా చిత్రీకరణలకు ప్రముఖ కేంద్రంగా మారనుంది. తద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధితోపాటు ఆర్థికంగానూ ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎత్తయిన కొండల సొగసులు, ప్రకృతి అందాలు, దట్టమైన అటవీప్రాంతం, చుట్టూ కొండలతో హార్సిలీíహిల్స్ ఇప్పటికే ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందకుపైగా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. 1966లో సూపర్‌స్టార్ కృష్ణ నటించిన కన్నెమనసులు సినిమాతో మొదలై ఎన్నో కన్నడ, తెలుగు, తమిళ సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది. అయితే ఏ ప్రభుత్వం ఇక్కడ షూటింగ్ కోసం చర్యలు చేపట్టలేదు. దీంతో 1996లో కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత పెద్ద నటులెవరూ హార్సిలీహిల్స్ వైపు కన్నెత్తి చూడలేదు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ దర్శకనిర్మాత మహీ వీ రాఘవ కొండపై మినీ స్టూడియో, అమ్యూజ్మెంట్ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో హార్సిలీహిల్స్‌కు మంచి రోజులు రానున్నాయని అంటున్నారు. మళ్లీ ఈ మధ్యే సందడి.. ఈ మధ్యకాలంలో హార్సిలీహిల్స్ పరిసర ప్రాంతాల్లో సినిమాలు, వెబ్ సిరీస్ చిత్రీకరణల సందడి నెలకొంది. మహీ వీ రాఘవ ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్ చేస్తే నిర్మాణ వ్యయం భారీగా తగ్గించుకునే అవకాశం ఉందని గుర్తించి ఇటువైపు అడుగులు వేశారు. ఆయన దర్శకత్వం వహించిన పాఠశాల, యాత్ర–2 చిత్రీకరణలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. సైతాన్ వెబ్ సిరీస్‌ను సైతం ఇక్కడే చేశారు. ఇంకా విడుదలకాని ‘సిద్ధా లోకం ఎలా ఉంది’ కూడా ఇక్కడే నిర్మాణం జరుపుకుంది. మహీ వీ రాఘవే కాకుండా ఇంకా పలువురు సినిమాలు, వెబ్ సిరీస్‌లను చిత్రీకరిస్తున్నారు. మినీ స్టూడియోతో ఎన్నో సౌకర్యాలు కొండపై మినీ స్టుడియో నిర్మాణం కోసం రెండెకరాల భూమిని కేటాయించాలని మహీ వీ రాఘన ప్రభుత్వానికి ప్రతిపాదించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మినీ స్టూడియోతో ఎన్నో రకాలుగా స్థానికులు లబ్ధి పొందడమే కాకుండా, ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. వ్యాపారపరంగా ఆర్థికంగానూ ప్రయోజనాలు ఉంటాయి. స్టూడియో ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్కోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. లైట్స్, చిన్న కెమెరాలు, జనరేటర్లు, వాహనాలు, వెబ్ సిరీస్ కోసం అవసరమైనవి షూటింగ్ కోసం వెంట తీసుకురావాల్సిన పరిస్థితి ఉండదు. షూటింగ్‌కు వచ్చేవారికి విడిది సౌకర్యాలు, భోజనం, షూటింగ్లో పనులు.. ఇలా ప్రతి విషయంలోనూ స్థానికులకు ఆర్థికంగా ప్రయోజనం లభిస్తుంది. పెద్ద సినిమాలు లేకున్నా ఏడాదికి రెండు వెబ్ సిరీస్‌ల చిత్రీకరణ జరిగినా రూ.5 నుంచి రూ.10 కోట్లు ఖర్చవుతుంది. కాబట్టి స్థానికులకు వివిధ రకాలుగా ఆదాయం లభిస్తుంది. స్థానికులకు ఆదాయం, తక్కువ ఖర్చుతో చిత్రీకరణే లక్ష్యం.. హార్సిలీహిల్స్‌పై మినీ స్టూడియో ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని షూటింగ్‌లకు కేంద్రంగా చేయాలన్నదే లక్ష్యం. ఇక్కడి ప్రదేశాలను వెబ్సైట్లో పెట్టి సినిమా చిత్రీకరణలకు అనువనే విషయాన్ని తెలియజేస్తాం. మదనపల్లె, ఆరోగ్యవరం, పరిసర ప్రాంతాల చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూ ప్రచారం చేస్తాం. పురాతన కట్టడాలు, భవనాలు, పల్లెలు హార్సిలీహిల్స్ పరిసరాల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ సినిమాలు, వెబ్ సిరీస్‌లు తక్కువ ఖర్చుతో చిత్రీకరణ చేసుకునేలా ప్రణాళిక రూపొందిస్తాం. అనుభవజ్ఞులైన వారిని నియమించి సహకారం అందిస్తాం. స్థానికులకు ఆదాయ మార్గాలు పెంచేలా చూస్తాం. –మహీ వీ రాఘవ, ప్రముఖ దర్శకనిర్మాత -
హైదరాబాద్‌లో స్టూడియోల మాటేమిటి?
సాక్షి, హైదరాబాద్: సినీ దర్శకుడు మహి వి.రాఘవకు ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని సంతర్పణ చేయనుందంటూ ఎల్లోమీడియాలో వచ్చిన కథనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెనుకబడిన తన ప్రాంత అభివృద్ధి కోసమే మదనపల్లి సమీపంలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో నిర్మాణానికి స్థలం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దరఖాస్తు చేశానని.. తన ప్రాంతానికి మంచి చేయాలనే సంకల్పం లేకపోతే హార్సిలీ హిల్స్‌లో ఎందుకు స్టూడియో నిర్మించాలనుకుంటాను? అని రాఘవ ఇప్పటికే స్పష్టం చేయగా.. ఆంధ్రజ్యోతి మాత్రం యాత్ర–2 సినిమా చేసినందుకు రెండెకరాలు కట్టబెడుతున్నారంటూ తన అక్కసునంతా వెళ్ల్లగక్కింది. ఈ కథనాన్ని పలువురు సినీ ప్రముఖులు తప్పుపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆయన సినీ దోస్తులకు హైదరాబాద్‌లో వందల ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారని.. ఇప్పుడు రాయలసీమ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా మినీ స్టూడియో కోసం రెండెకరాలు అడిగితే బాబుకు బాకా ఊదే ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియా రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడుతున్నారు. చంద్రబాబు ధారాదత్తం చేసిన భూముల గురించి ఆంధ్రజ్యోతి, ఎల్లోమీడియాకు ప్రశ్నించే దమ్ముందా? అని ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పేనా?: కల్యాణ్ ఈ మేరకు నటుడు, నిర్మాత, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కల్యాణ్ నిలదీశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియో విడుదల చేస్తూ.. రాయలసీమలోని హార్సిలీ హిల్స్‌లో మినీ స్టూడియో కోసం డైరెక్టర్ మహి వి.రాఘవ్ రెండు ఎకరాల స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరడం తప్పయితే.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సినిమా రంగానికి చెందిన పలువురికి హైదరాబాద్‌లో స్థలాలు ఇవ్వడం తప్పు అనిపించలేదా? అని ప్రశ్నించారు. హార్సిలీ హిల్స్‌లో రెండు ఎకరాలు సంతర్పణ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. అసలు ఇంతవరకూ దానిపై ఎలాంటి జీవో రాలేదని.. ఎంత ధరకు ఇస్తున్నారు? దేనికోసం ఇస్తున్నారు? ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నారా? లేదా స్టూడియో నిర్మాణానికా అన్నది ఆలోచించకుండా ఇష్టానుసారం రాయడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో సినిమా వాళ్లకు చంద్రబాబు ఇచ్చినవన్నీ ఒప్పు అనుకున్నప్పుడు రాఘవకు ఇస్తే కూడా ఒప్పు అనుకోవాలి కదా? ఇక్కడ తప్పు అనుకున్నప్పుడు హైదరాబాద్‌లో స్థలాలు కట్టబెట్టడం కూడా తప్పే కదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఇచ్చిన స్థలాలన్నీ తప్పు అంటారా? ఒప్పు అంటారా? అన్న విషయం తెలుగు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను ప్రశ్నించారు. గతంలో ఎందరికో సబ్సిడీపై భూములు సినీ రంగం అభివృద్ధికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అక్కినేని నాగేశ్వరరావుకు ప్రభుత్వం 14 ఎకరాల స్థలాన్ని తక్కువ ధరకు స్టూడియో నిర్మాణానికి ఇచ్చిందని, ఎన్టీఆర్ కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టూడియోలు కట్టుకున్నారని కల్యాణ్ చెప్పారు. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో, ఆనంద్ సినీ సర్వీసెస్(5 ఎకరాలు), ప్రసాద్ ల్యాబ్‌కు కూడా అప్పట్లో సబ్సిడీ ధరకు ప్రభుత్వం స్థలం ఇచ్చిందన్నారు. ప్రసాద్ ల్యాబ్‌కు ఎదురుగా కె.రాఘవేంద్రరావు, ఆయన సోదరుడు కృష్ణమోహన్‌కు కూడా స్థలం ఇచ్చారని, రాఘవేంద్రరావు స్థలం వెనుక సంగీత దర్శకుడు చక్రవర్తికి కూడా స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రసాద్ ఐ మ్యాక్స్‌కు నెక్లెస్ రోడ్డులో స్థలం ఇచ్చిన విషయం గుర్తులేదా? అని ప్రశ్నించారు. సినీ కార్మికుల కోసం ఫిల్మ్‌నగర్ సమీపంలోని చిత్రపురి కాలనీకి 67 ఎకరాల స్థలం ఇచ్చారని, తెలంగాణ ఏర్పడ్డాక డైరెక్టర్ ఎ¯Œ.. శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నిర్మాత రామానాయుడుకు వైజాగ్ రుషికొండలో దాదాపు 20 ఎకరాల స్థలం ఇచ్చిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. -
స్టూడియోకి స్థలం కేటాయింపు.. మహి వి.రాఘవ్ స్ట్రాంగ్ కౌంటర్!
టాలీవుడ్ డైరెక్టర్ మహి వి.రాఘవ్ ఇటీవలే యాత్ర-2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈనెల 8న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మహి వి.రాఘవ్ తనపై వస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. రాయలసీమకు సినీ ఇండస్ట్రీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. నా ప్రాంతం కోసమే నా వంతుగా ఏదో ఒకటి చేయాలనే ఆశయంతో కేవలం రెండు ఎకరాల భూమిలోనే మిని స్టూడియో నిర్మించాలనుకుంటున్నట్లు మహి తెలిపారు. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఆసక్తి చూపించరని అన్నారు. ఓ వర్గం మీడియా దీని గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదని విమర్శించారు. వాళ్ల ప్రభుత్వంలో వాళ్లకు నచ్చినవారికి ఎవరెవరికో ఎక్కడెక్కడో భూములు ఇచ్చిందని.. వాటి గురించి ఎవరూ మాట్లాడరని ఆయన మండిపడ్డారు. నా ప్రాంతం కోసం కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలనుకుంటే దీనిపై పనిగట్టుకుని రాద్ధాంతం చేస్తున్నారని మహి వి.రాఘవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నా ప్రాంతానికి ఏదో చేయాలనే ఆశయం లేకపోతే.. నేను హైదరాబాద్‌లోనో.. వైజాగ్‌లోనో స్టూడియో కట్టుకోవటానికి స్థలం కావాలని అడుగేవాణ్ని కదా అని మహి ప్రశ్నించారు. వెనుకబడిన ప్రాంతంగా చూసే మదనపల్లిలోనే ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటానని వివరించారు. నేను రాయలసీమ ప్రాంతంలోని మదనపల్లిలోనే పుట్టి పెరిగా.. అక్కడే చదువుకున్నా.. అందుకే నా ప్రాంతం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆశయంతోనే ముందుకెళ్తునన్నారు. రచయిత, నిర్మాత, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నానని.. మూన్ వాటర్ పిక్చర్స్, 3 ఆటమ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థలను స్థాపించినట్లు తెలిపారు. నా సినిమాలు పాఠశాల, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయలసీమలోనే చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. మహి వి.రాఘవ్ మాట్లాడుతూ..'సినీ ఇండస్ట్రీ రాయలసీమ కోసం ఏం చేసింది? నా ప్రాంత అభివృద్ధి కోసమే మినీ స్టూడియో కట్టాలనుకుంటున్నా. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉంటున్నా. సొంతంగా రెండు నిర్మాణ సంస్థలను స్థాపించా. సినీ పరిశ్రమలో రాయలసీమ అంటే షూటింగ్స్ చేయటానికి ఎవరూ ఇష్టపడరు. నా ప్రాజెక్ట్స్ రాయలసీమలోనే చిత్రీకరించా. ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధా లోకమెలా ఉంది అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మదనపల్లి, కడప ప్రాంతాల్లో రూపొందించాం. వాటి కోసం దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయల ఖర్చు చేశా' అని తెలిపారు. నా ప్రాంతం కోసమే నా తపన.. అనంతరం మాట్లాడుతూ.. 'నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేదన్నారు. మదనపల్లిలో సినిమాలు చేయటం వల్ల స్థానిక హోటల్స్, లాడ్జీలు, భోజనాలు, జూనియర్స్‌కు ఉపయోగపడుతుందని భావించా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. బుద్ధి ఉన్నోడెవడైనా దీని గురించి ఆలోచించాలి. నా స్టూడియో నిర్మాణం కోసం యాభై, వంద ఎకరాలు అడగలేదు. కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాలనుకున్నా. రాయలసీమకు ఎవరైనా ఏమైనా చేశారా! మీరు చేయరు... చేసేవాడిని చెయ్యనియ్యరు. ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించలేదు. వాళ్ల ప్రియమైన ప్రభుత్వం ఎవరెవరికీ భూములను ఎక్కడెక్కడో ఇచ్చింది. వీటి గురించి ఎవరూ మాట్లాడరు. నా ప్రాంతంలో కేవలం రెండు ఎకరాల్లో మినీ స్టూడియో కట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు' అని మహి వి.రాఘవ్ మండిపడ్డారు. -
టీవీ స్టూడియోలో దుండగుల దాడి.. లైవ్‌లో వీక్షించిన ప్రేక్షకులు!
ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నోబోవా తాజాగా క్రిమినల్ గ్రూప్ ‘ఈక్వెడార్ గ్యాంగ్స్టర్స్ స్టార్మ్ స్టూడియో’పై సైనిక చర్యకు ఆదేశించారు. హుడ్ ధరించిన ఈ గ్రూప్‌నకు చెందిన ముష్కరులు టెలివిజన్ స్టూడియోపై దాడి చేయడంతో పాటు భద్రతా బలగాలను, పౌరులను చంపుతామని బెదిరించడంతో అధ్యక్షుడు ఇటువంటి ఆదేశాలు జారీచేశారు. ఈక్వెడార్‌లో పేరుమోసిన నేరస్తుడు జోస్ అడాల్ఫో ఇటీవల మాసియాస్ జైలు నుండి తప్పించుకోవడంతో దేశంలో భద్రతా సంక్షోభం తలెత్తింది. దేశంపై గ్యాంగ్స్టర్లు యుద్ధం ప్రకటించారు. దీంతో దేశం అంతర్గత సాయుధ సంఘర్షణలో ఉందని అధ్యక్షుడు నోబోవా ప్రకటించారు. శాంతియుత స్వర్గధామంగా ఉన్న ఈక్వెడార్‌పై పట్టుసాధించేందుకు ఇటీవలి కాలంలో మెక్సికన్,కొలంబియన్ కార్టెల్స్‌తో సంబంధం కలిగిన ప్రత్యర్థి ముఠాలు పోటీ పడుతున్నాయి. తాజాగా ఈ క్రిమినల్ గ్రూపులను మట్టుబెట్టేందుకు సైనిక చర్య చేపట్టాలని దేశ సాయుధ బలగాలను అధ్యక్షుడు నోబోవా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పోర్ట్సిటీలోని టీసీ టెలివిజన్ స్టూడియోలో తుపాకులు, గ్రెనేడ్లతో దుండగులు దాడికి పాల్పడిన దరమిలా అధ్యక్షుడు ఈ ప్రకటన చేశారు. కాగా స్టూడియోలో తుపాకీ కాల్పుల మధ్య ఒక మహిళ.. ‘షూట్ చేయవద్దు, దయచేసి కాల్చకండి’ అని వేడుకుంది. అయితే ముష్కరులు వార్తలు చదువుతున్న వ్యక్తితో పాటు అక్కడున్న ఇతర ఉద్యోగులను నేలపై కూర్చోమని ఆదేశించి, తలపై తుపాకీ ఎక్కుపెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని బెదిరించారు. ఈ ఉదంతమంతా టీవీ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారమైంది. లైవ్‌లో తుపాకీ శబ్దాలూ వినిపించాయి. దీనిని ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. సుమారు 30 నిమిషాల గందరగోళం తర్వాత అధికారులు స్టూడియోలోకి ప్రవేశించడం కనిపించింది. దీనికి ముందు గ్యాంగ్స్టర్లు పోలీసు అధికారులను కిడ్నాప్ చేశారు. అధ్యక్షుడు నోబోవా ప్రకటించిన 60 రోజుల అత్యవసర పరిస్థితి, రాత్రిపూట కర్ఫ్యూకి నిరసనగా గ్యాంగ్స్టర్లు దేశంలోని పలు నగరాల్లో పేలుడు పదార్థాలతో విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించారు. కాగా 36 ఏళ్ల నోబోవా దేశంలో మాదకద్రవ్యాల సంబంధిత నేరాలు, హింసకు వ్యతిరేకంగా పోరాడతానని డేనియల్ నోబోవా ప్రతిజ్ఞ చేసిన దరిమిలా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
బెంగళూరులో యాక్సెంచర్ ఏఐ స్టూడియో.. ఏంటిది.. ఏం చేస్తుంది?
Accenture Generative AI Studio: ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ బెంగళూరులో జెనరేటివ్ ఏఐ స్టూడియోను ఏర్పాటు చేసింది. దాదాపు రూ.25 వేల కోట్ల పెట్టుబడిలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్టూడియో ఉద్దేశం, ఉపయోగం, అందించే సేవలు వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం గురించి తెలిసిందే. అన్ని రంగాల వ్యాపారాలు ఈ టెక్నాలజీ వినియోగంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. దీన్ని అందిపుచ్చుకునేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ యాక్సెంచర్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. రాబోయే మూడేళ్లలో ఏఐ, డేటా ప్రాక్టీస్‌లో 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25 వేల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించిన కొన్ని నెలల తర్వాత, డిసెంబర్ 18న యాక్సెంచర్ భారత్‌లోని బెంగళూరులో జనరేటివ్ ఏఐ స్టూడియోను ప్రారంభించింది. ఉత్పాదక కృత్రిమ మేధ (Generative AI) ఆధారంగా పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి క్సెంచర్ డేటా, ఏఐ బృందం క్లయింట్లతో కలిసి పని చేసేందుకు ఓ చోటును కల్పించడమే ప్రాథమికంగా ఈ స్టూడియో ఉద్దేశం. ఏఐ ఆధారిత పరిష్కారాలతో సంస్థలు తమ వ్యాపారాలను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. జనరేటివ్ ఏఐ అనేది ఒక రకమైన కృత్రిమ మేధస్సు. ఇది శిక్షణ డేటాను పోలి ఉండే కొత్త డేటాను రూపొందించగలదు. వ్యాపార ప్రక్రియలను ఆప్టిమైజ్ చేయడానికి దీనిని ఉపయోగించవచ్చని కంపెనీ చెబుతోంది. యాక్సెంచర్‌లోని గ్లోబల్ లీడ్- డేటా & ఏఐ సెంథిల్ రమణి ప్రకారం.. మొత్తం వాల్యూ చైన్‌లోని సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తూ తమ ఏఐ పెట్టుబడులను పెంచుకోవడానికి ఈ స్టుడియో సహాయపడుతుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో పెరిగిన పెట్టుబడి విస్తృత ధోరణిని యాక్సెంచర్ ఏఐ స్టుడియో ప్రతిబింబిస్తుంది. యాక్సెంచర్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో 74 శాతం C-సూట్ (ఉన్నత కార్యవర్గాలు) 2024లో తమ ఏఐ సంబంధిత వ్యయాన్ని పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఇది అంతకుముందు సంవత్సరంలో 50 శాతమే ఉండేది. అందించే సేవలు స్టూడియో ఉత్పాదక ఏఐకి సంబంధించిన అనేక రకాల సేవలను అందిస్తుంది. వీటిలో యాజమాన్య ఉత్పాదకకేఐ మోడల్ “స్విచ్‌బోర్డ్,” అనుకూలీకరణ పద్ధతులు, మోడల్ మేనేజ్డ్ సేవలు, ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉన్నాయి. క్లయింట్లకు ఉత్పాదక ఏఐ పరిష్కారాలను అర్థం చేసుకోవడం, ప్రయోగం చేయడం, స్వీకరించడం, పెంచుకోవడంలో సహాయపడేలా ఈ సేవలను రూపొందించినట్లు యాక్సెంచర్ పేర్కొంటోంది. -
బుడి బుడి నడకల నుంచి సూపర్ స్పీడ్ వరకు...
సక్సెస్ అనేది రాత్రికి రాత్రి వచ్చేది కాదు. నిద్రలేని రాత్రులు ఎన్నో గడపాల్సి ఉంటుంది. తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, విజయం కోసం ఎదురు చూస్తూ ఏఐ ఇంగ్లీష్ ట్యూటర్ స్టార్టప్ ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా ఘన విజయం సాధించింది అనుశ్రీ గోయల్... కొన్ని సంవత్సరాల క్రితం... స్టాన్ఫోర్డ్(యూఎస్)లో యూత్ ఫెయిల్యూర్ స్టార్టప్‌ల గురించి పాల్ గ్రహమ్ విశ్లేషణాత్మకమైన ప్రసంగం ఇచ్చాడు. ‘స్టార్టప్‌కు సంబంధించిన సమస్త విషయాలపై దృష్టి పెడుతున్నారు. ప్రజలు బాగా కోరుకునేది ఏమిటి అనే కీలకమైన విషయాన్ని మాత్రం మరిచిపోతున్నారు’ పాల్ గ్రహమ్ అన్నప్పుడు హాల్లో చప్పట్లు మారుమోగాయి. ఆ ప్రేక్షకులలో అనుశ్రీ గోయెంకా ఉంది. అనుశ్రీకి గ్రహమ్ ఉపన్యాసం ఎంతో స్ఫూర్తిని ఇచ్చింది. అహ్మదాబాద్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన అనుశ్రీ మానిటర్ గ్రూప్‌లో కన్సల్టంట్గా అయిదు సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత స్క్రోల్ మీడియా, స్విగ్గీలో పనిచేసింది. ఉద్యోగం యాంత్రికం అనిపించిందో, ఇంతకంటే చేయడానికి ఏం లేదు.. అనే నిర్లిప్తత ఆవహించిందో తెలియదు కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి కొత్త దారిలోకి వచ్చింది. ‘వ్యాపారంపై నా ముద్ర ఉండాలి. అది నాకు సంతోషం కలిగించేలా ఉండాలి’ అనుకుంటూ రంగంలోకి దిగింది అనుశ్రీ. పది సంవత్సరాలు కార్పొరేట్ ప్రపంచంలో పనిచేసిన అనుశ్రీ గ్రహమ్ ప్రసంగాన్ని పదేపదే గుర్తు తెచ్చుకుంటూ బెంగళూరు కేంద్రంగా ‘స్పార్క్ స్టూడియో’తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రయాణం మొదలుపెట్టింది. ‘స్పార్క్ స్టూడియో’ అనేది పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎక్స్ట్రా కరిక్యులర్ లెర్నింగ్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్. మొదట ‘స్పార్క్ స్టూడియో’ ఐడియాను శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీ ఎనలిస్ట్లకు చెప్పినప్పుడు– ‘సక్సెస్ కావడం కష్టం’ అంటూ ఎన్నో కారణాలు చెప్పారు. అయినా వెనకడుగు వేయలేదు అనుశ్రీ. ‘మన దేశంలో హై–క్వాలిటీ ఆర్ట్స్, లిబరల్ ఎడ్యుకేషన్‌కు కొరత ఉంది’ తాను తరచుగా విన్న మాట ‘స్పార్క్ స్టూడియో’కు శ్రీకారం చుట్టడానికి కారణం అయింది. పిల్లలకు ఆన్లైన్ బోధన చేయడానికి ‘స్పార్క్ స్టూడియో’ ద్వారా దేశవ్యాప్తంగా పేరున్న పెయింటర్లు, మ్యూజిషియన్లు, ఇతర ఆర్టిస్ట్‌లను ఒకే వేదిక మీదికి తీసుకు వచ్చింది అనుశ్రీ. ‘స్పార్క్ స్టూడియో’ ప్రారంభమైన కొద్ది నెలల తరువాత... ‘ఎక్స్ట్రా కరిక్యులర్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉంది. మీరు చాలా ఆలస్యంగా దీనిలోకి అడుగు పెట్టారు. ఇప్పటికే ఎంతోమంది సక్సెస్ సాధించారు. ఇప్పుడు మీరు కొత్తగా వచ్చి చేసేదేమిటి?’ ఇలాంటి కామెంట్స్ ఎన్నో వినిపించాయి. ‘వంద వ్యాపారాల్లో నీదొకటి అయినప్పుడు దానిపై నీదైన ముద్ర, శైలి ఉండాలి’ అని గ్రహమ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తన స్నేహితులైన కౌస్తుబ్ ఖడే, జ్యోతిక సహజనందన్, నమిత గోయెంకాలతో ఒక టీమ్‌గా ఏర్పడింది అనుశ్రీ. ‘నేను బాగా పేరున్న స్కూల్లో చదువుకున్నాను. అయితే హై–క్వాలిటీ ఆర్ట్స్ కరికులమ్‌కు అక్కడ చోటు లేదు. స్పార్క్ స్టూడియో ద్వారా విద్యార్థులకు ఉపయోగపడే నిర్మాణాత్మకమైన కరికులమ్‌ను డిజైన్ చేశాము. పిల్లలు యానిమేషన్, మ్యూజిక్, ఫొటొగ్రఫీ...ఎన్నో నేర్చుకోవచ్చు. తమ పిల్లలు ఎన్నో కళలు నేర్చుకోవచ్చు అనే ఆలోచన తల్లిదండ్రులకు బాగా నచ్చింది. ఆర్ట్స్, మ్యూజిక్ ద్వారా పిల్లల్లో భాషా నైపుణ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని ఎంత నచ్చజెప్పినా, వారు డబ్బు ఖర్చు చేయడానికి సిద్ధంగా లేకపోవడం అసలు సమస్య. మార్కెట్ అంటే ఇదే అనే విషయం ఆలస్యంగా అర్థమైంది. ఇలా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాను’ అంటుంది అనుశ్రీ. రెండు సంవత్సరాల ‘స్పార్క్ స్టూడియో’ ప్రయాణం లాభాలు లేవు, నష్టాలు లేవు అన్నట్లుగా ఉండేది. అప్పటికే కొన్ని ప్రసిద్ధ ఎక్స్ట్రాకరిక్యులర్ ఎడ్టెక్ స్టార్టప్‌లు మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ఏం మిస్ అవుతున్నాం’ అంటూ ఆలోచిస్తున్న సమయంలో అనుశ్రీకి తట్టిన ఐడియా....పబ్లిక్ స్పీకింగ్ కోర్స్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈ రెండు అంశాలు చేర్చడంతో అప్పటి వరకు బుడి బుడి నడకల ‘స్పార్క్ స్టూడియో’ వేగం పుంజుకుంది. సక్సెస్‌ఫుల స్టార్టప్‌గా నిలిచింది. ‘నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి’ అంటుంది అనుశ్రీ గోయెంక. నమ్మకమే వెన్నెముకగా ఉన్న వ్యాపారం ఇది. నమ్మకాన్ని డబ్బుతో కొనలేము. కష్టపడి సంపాదించుకోవాలి. – అనుశ్రీ గోయెంకా తన బృందంతో అనుశ్రీ గోయెంకా -
భీమ్ హాలీవుడ్ మూవీ చేస్తున్నాడా..?
-
విశాఖలో రికార్డింగ్ స్టూడియో నిర్మిస్తా..
ఏయూక్యాంపస్: సినిమా సంగీతం రూపకల్పనకు వీలుగా విశాఖలోని భీమిలిలో రికార్డింగ్ స్టూడియోను నిర్మిస్తానని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సెయింట్ లూక్స్ సంస్థ సహకారంతో నూతనంగా నిర్మించిన ఆడియో రికార్డింగ్ స్టూడియో, తరగతి గదులను ఆదివారం ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి థమన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను మ్యూజిక్ ల్యాండ్‌గా భావిస్తున్నానని, విశాఖ కేంద్రంగా సినీ సంగీత ప్రయాణానికి ఇదో మంచి ఆరంభంగా నిలుస్తుందన్నారు. తనకు దేశ, విదేశాల్లో స్టూడియోలున్నాయని, త్వరలో విశాఖలోనూ స్టూడియో నిర్మిస్తానన్నారు. తన విశ్రాంత జీవితాన్ని ప్రశాంత నగరమైన విశాఖలో గడిపేందుకే తాను ఇష్టపడతానని తెలిపారు. ఎంతో సుదీర్ఘ అనుభవం కలిగిన సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్ మార్గదర్శకంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆడియో ఇంజినీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ అకాడమీని ప్రారంభించడం మంచి పరిణామమని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏయూను తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్టు చెప్పారు. సంగీత దర్శకుడు ఆశీర్వాద్ లూక్స్, సెయింట్ లూక్స్ సంస్థల అధినేత ప్రీతం లూక్స్ తదితరులు పాల్గొన్నారు. -
స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్ నిర్వహణ
సాక్షి, హైదరాబాద్ (సనత్‌నగర్): స్టూడియో ముసుగులో స్పా, మసాజ్ సెంటర్లను నిర్వహిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన మేరకు.. అమీర్‌పేటకు చెందిన ఎస్.అనిల్‌కుమార్ (31) అమీర్‌పేట ధరంకరం రోడ్డులోని కృష్ణారెడ్డి బిల్డింగ్స్‌లో ఓషన్ బ్యూటీ స్టూడియో నిర్వహిస్తున్నాడు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం స్టూడియోపై దాడులు నిర్వహించగా అక్కడ స్పా, మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ కేంద్రానికి ఎటువంటి అనుమతులు, ట్రేడ్ లైసెన్స్ లేకపోగా, కస్టమర్ల రిజిస్ట్రర్ నిర్వహించకపోవడం, సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం, అర్హులైన థెరపిస్ట్ లేకపోవడం తదితర సమస్యలను గుర్తించారు. స్టూడియోను మూసివేసి నిర్వాహకులు అనిల్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. చదవండి భార్యకు వేరొకరితో సంబంధం.. అనుమానం ఉన్మాదిని చేసింది -
ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం, టెక్నీషియన్ మృతి
స్వర మాంత్రికుడు, లెజెండరి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్టూడియోలో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో టెక్నీషియన్ మృతి చెందినట్లు తమిళ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. వివరాలు.. చెన్నైలోని రెహమాన్ పంచతాన్ రికార్డింగ్ స్టూడియోలో ఇటీవల ఓ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండగా లైట్ మెన్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. లైట్ బిగిస్తుండగా ఆయనకు షాక్ తగలడంతో కిందపడి మృతి చెందినట్లు పలు తమిళ వెబ్సైట్లలో కథనాలు వచ్చాయి. చదవండి: హీరోయిన్‌తో విద్యార్థి అనుచిత ప్రవర్తన, అసహనం వ్యక్తం చేసిన నటి అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈ స్టూడియో ద్వారా రెహమాన్ లైవ్ షోలు, కన్సర్ట్లు చేస్తారు. చెన్నైలో తన ఇంటిలోనే ఈ స్టూడియోను నిర్వహిస్తున్నారు. కాగా చాలా గ్యాప్ తర్వాత రెహమాన్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. గతేడాది వచ్చిన విక్రమ్ కోబ్రా, లైఫ్ ఆఫ్ ముత్తు, పొన్నియన్ సెల్వన్ పార్ట్-1కు సంగీతం అందించారు. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-2తో పాటు తమిళంలో పలు చిత్రాలకు ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: శృతి హాసన్‌కు ఐ లవ్ యూ చెప్పడంపై వివరణ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని -
సినీ కార్మికుడి నుంచి... స్టూడియో అధినేతగా..
సాక్షి,దేవరాపల్లి(అనకాపల్లి): సినీ పరిశ్రమలో కార్మికుడిగా చేరిన కళామతల్లి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగి నేడు సినిమా స్టూడియో యజమాని స్థాయికి చేరుకోగలిగారు... అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలానికి చెందిన కొల్లి రామకృష్ణ. 1978లో చెన్నైలో సినీ రంగ కార్మికుడిగా చేరి, వివిధ భాషల్లో తీసిన 1600 సినిమాలకు విజయ వాహిని స్టూడియో తరపున సౌండ్ ఇంజినీర్‌గా పని చేశారు. 1997లో తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడి శబ్ధాలయ స్టూడియోలో చేరి 2001 వరకు పని చేశారు. 2002లో రిథమ్ డిజిటల్ సినీ స్టూడియోను తానే సొంతంగా నిర్మించుకున్నారు. 2014 నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా, ఉపాధ్యక్షుడిగా పని చేసి గత నెల(ఏప్రిల్) 27న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది... ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఫిల్మ్ ఛాంబర్లో సినీ రంగంలోని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, సినీ స్టూడియో యజమానులు సభ్యులుగా ఉంటారు. దాసరి నారాయణరావు, రామానాయుడు, రాజేంద్రప్రసాద్ తదితర సినీరంగ ప్రముఖులు అధ్యక్షుడిగా పని చేసిన ఫిల్మ్‌చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని రామకృష్ణ తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన తన స్వగ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. తాను సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్ని, విశేషాలను వివరించారు. సినిమా షూటింగ్‌లకు ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విశాఖనగరం ఎంతో అనుకూలంగా ఉంటుందని తెలిపారు. సినీ రంగానికి ఏపీ ఎంతో అనుకూలం ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు తీసేందుకు అనువైన అహ్లాదకర ప్రాంతాలు, అందమైన లొకేషన్లు అనేకం ఉన్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సినీ రంగం మరింత అభివృద్ధి చెందే విధంగా త్వరలోనే ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డిని ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గం కలిసి కోరతాం. ఈనెల ఆఖరి బుధవారం మా సంస్థ కార్యవర్గం సమావేశమై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాం. మా సంస్థకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో దీనికి అనుబంధ సంస్థలు ఉన్నాయి. వీటిని త్వరలో సందర్శిస్తాం. –కొల్లి రామకృష్ణ, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చదవండి: Photo Feature: ఆకులు లేని పూల చెట్టు -
అరవింద డిజైన్ స్టూడియోను ప్రారంభించిన లావణ్య త్రిపాఠి (ఫొటోలు)
-
Youtube Studio: డిజిటల్ వరల్డ్ మీకు నచ్చేలా మీరు మెచ్చేలా..
యూట్యూబ్ తెలిసినంతగా చాలామందికి యూట్యూబ్ స్టూడియో తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్టూడియోలో ఏం ఉంటాయి? క్రియేటర్లకు దారి చూపించే విశ్లేషణ పరికరాలు ఉంటాయి. మన బండికి వేగం పెంచే ఇంధనాలు ఉంటాయి... ‘యూట్యూబ్ స్టూడియో’ క్రియేటర్స్‌కు ఇల్లులాంటిది. ఆ ఇంటిలో చిన్నవాళ్లకు విలువైన సలహాలు ఇచ్చే పెద్దమనిషిలాంటిది. భరోసా ఇచ్చే బాస్లాంటిది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా వీజి. దాన్ని నిలబడేలా చేయడం, పరుగెత్తేలా చేయడం శానా కష్టం. ఇది ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. యూట్యూబ్ ఛానల్ హిట్టు,ఫట్టు వెనుక ‘అదృష్టం’ పాత్ర ఏమీ ఉండదు. మన పాత్రే ఉంటుంది. ఆ పాత్ర రక్తి కట్టాలంటే, మీరు విజయపథంలో దూసుకెళ్లాలంటే.. మీకు అవసరమైనది యూట్యూబ్ స్టూడియో. ఆడియన్స్ ఇంటరాక్షన్ నుంచి ఛానల్ డెవలప్మెంట్ వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ స్టూడియోలో.. ఛానల్ డ్యాష్‌బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఎనాలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్, మోనిటైజేషన్, కస్టమైజేషన్, ఆడియోలైబ్రరీ.. మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లేలిస్ట్, ఎనలిటిక్స్. ఛానల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే ప్లేలీస్ట్లు తప్పనిసరి. యూట్యూబ్ స్టూడియోలో ప్లేలీస్ట్లు క్రియేట్ చేయడానికి... 1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. లెఫ్ట్ మెను, సెలెక్ట్ ప్లేలీస్ట్ 3. క్లిక్–న్యూ ప్లే లీస్ట్ 4.ఎంటర్–ప్లే లీస్ట్ టైటిల్ 5. సెలెక్ట్–ప్లేలీస్ట్ విజిబిలిటీ సెట్టింగ్స్ 6. క్లిక్ ఆన్ క్రియేట్ ఎడిట్ చేయడానికి...1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. సెలెక్ట్ ప్లేలీస్ట్ 3.ఎడిట్–క్లిక్ 4. డిస్క్రిప్షన్–క్లిక్ 5.సేవ్ ఛానల్ స్పీడ్ అందుకోవడానికి, కంటెంట్ స్ట్రాటజీని రీడిజైన్ చేసుకోవడానికి ‘ఎనాలిటిక్స్’ కావాలి. ఇందులోకి వెళ్లాలంటే...1.మీ ఎకౌంట్లోకి లాగ్ అవ్వాలి 2. క్లిక్–ప్రొఫైల్ ఐకాన్ 3.సెలెక్ట్–యూట్యూబ్ స్టూడియో 4. క్లిక్–గో టూ ఛానల్ ఎనాలిటిక్స్ 5. సెలెక్ట్–ఎనాలిటిక్స్ (లెఫ్ట్ హ్యాండ్ మెనూ) బిగ్గెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే వినూత్నమైన అప్డెట్స్తో ముందుంటుంది. ‘యూట్యూబ్ స్టూడియో’కి సంబంధించి తాజా అప్డ్ట్ల విషయానికి వస్తే.. హైలీ రిక్వెస్టెడ్ ఫీచర్‌గా చెప్పుకునే ‘డార్క్‌మోడ్’ ఫీచర్ యూట్యూబ్‌కు మాత్రమే కాకుండా ‘యూట్యూబ్ స్టూడియో’కు వచ్చేసింది. ఫ్రెష్‌లుక్ ఇవ్వడమే కాదు కళ్లకు భారం పడకుండా తేలిగ్గా ఉంటుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. రియల్‌టైమ్ కార్డ్స్‌ను మెరుగుపరిచారు. గతంలో ఈ కార్డ్స్ ‘బేసిక్ వోవర్ వ్యూ డాటా’ డిస్‌ప్లేకే పరిమితం. తాజా అప్డేట్తో సబ్‌స్క్రైబర్ కౌంట్స్, వీడియో వ్యూస్.. ఇలా అప్–టు–ది–మినిట్ డాటా డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని ‘మెన్షెన్ ఇన్‌బాక్స్’తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. దీని ద్వారా మీ ఛానల్ ఎక్కడెక్కడ మెన్షెన్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు. ఉదా: మరో ఛానల్ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ ట్యాగ్ అయితే దాని గురించి తెలుసుకోవచ్చు. ‘మీ సినిమా ఆడాలంటే మీకు నచ్చగానే సరిపోదు. ప్రేక్షకులకు మీకంటే బాగా నచ్చాలి’ అనేది అత్యంత పాత విషయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా మరిచిపోతూనే ఉంటాం. ఛానల్ వ్యవహారం కూడా అంతే. ‘చేసిందంతా చేసేశాను. ఇంకేటి సేత్తాం’ అనుకోవద్దు. ‘యూట్యూబ్ స్టూడియో’పై లుక్కేయండి. ఆడియెన్స్ నాడి కనిపెట్టండి. సరదిద్దుకోండి. దూసుకుపోండి. -
'అల్లు' స్టూడియోస్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్య నట దిగ్గజంగా పేరొందిన అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్లు కుటుంబ సభ్యులు గురువారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన కుటుంబసభ్యులు అల్లు స్టూడియోస్ ప్రారంభించారు. సినిమా, టీవీ చిత్రీకరణలకు ఉపయోగపడేలా ఈ స్టూడియో భారీస్థాయిలో నిర్మాణం జరుపుకోనుంది. ఈ అల్లు స్టూడియో ప్రారంభోత్సవంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిర్మాత అల్లు బాబీ పాల్గొన్నారు. తన ముగ్గురు తనయులతో కలిసి ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అల్లు అరవింద్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. స్టూడియో ప్రారంభించడంపై అల్లు అరవింద్ త్వరలో ప్రకటన చేస్తారని తెలుస్తోంది. -
ప్రతిభకు కొదవ లేదు
మనం పని చేస్తున్న రంగంలో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకుంటారు కొందరు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్లకు కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే స్టూడియో స్థాపిస్తున్నానని ప్రకటించారు. అయితే ఇది షూటింగ్‌లు చేసుకునే స్టూడియో కాదు. షూటింగ్ చేయాలంటే కావాల్సిన కథలకు స్టూడియో... క్రియేటివ్ స్టూడియో. ఈ విషయం గురించి శోభితా మాట్లాడుతూ – ‘‘నాకు రాయడం అన్నా, చదవడం అన్నా ఎంతిష్టమో నా పరిచయస్తులందరికీ తెలుసు. ఆ ఇష్టమే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. పరిశ్రమలో సాధించిన ఏడెనిమిదేళ్ల అనుభవంతో మన దగ్గర ప్రతిభకు లోటు లేదని తెలిసింది. భిన్నమైన ఆలోచనలతో ఉన్న ప్రతిభ కలిగినవాళ్లను చాలామందిని చూశాను. క్రి యేటివ్ స్టూడియో అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. నేనో ప్లాట్‌ఫామ్ స్థాపించాలనుకుంటున్నాను. కొత్త కొత్త ఆలోచనలు, కథలు, ఐడియాలను ఇక్కడ తయారు చేయించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చడం చాలా సంతోషం’’ అన్నారామె. -
చెన్నై: ఇళయరాజా, ఎల్వీప్రసాద్ స్టూడియో వివాదం
-
పదేళ్ల తర్వాత లైవ్‌లో దొరికిపోయాడు
చంఢీగఢ్ : ఓ వ్యక్తి తను చేసిన హత్యల గురించి ఓ టీవీ షో లైవ్‌లో నోరువిప్పి అడ్డంగా బుక్కయ్యాడు. హత్యలు జరిగిన పదేళ్ల తర్వాత పోలీసులకు చిక్కాడు ఈ ఘటన చంఢీగఢ్‌లో బుధవారం చోటు చేసుకుంది. చంఢీగఢ్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ మహీందర్ సింగ్ ఓ టీవీ షో లైవ్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతను 2010లో తన ప్రేయసి సరబ్జిత్ కౌర్‌ను హత్య చేసిన విషయాన్ని అంగీకరించాడు. ఆమెకు తన బావతో ఎఫైర్ ఉందని అందుకే చంపాలనుకున్నానని చెప్పుకొచ్చాడు. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందామని పిలిచి చంఢీగఢ్లోని ఓ హోటల్లో ఆమెను హతమార్చానని అంగీకరించాడు. దీంతో పోలీసులు ఉన్నపలంగా టీవీ చానల్ స్టూడియోకు చేరుకుని అతన్ని లైవ్‌లోనే అరెస్టు చేశారు. కాగా అతను తన మరో ప్రేయసిని హతమార్చిన కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. దీనిపైన కూడా లైవ్‌లో అతను నోరు విప్పాడు. ఆమె ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో ప్రేమాయణం జరుపుతోందని అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. దీనిపై అతను ఇప్పటికే శిక్ష అనుభవిస్తుండగా గత కొంతకాలంగా బెయిల్‌పై తిరుగుతున్నాడు. -
యానిమేషన్ స్టూడియోకు నిప్పు
టోక్యో: జపాన్‌లోని ప్రముఖ యానిమేషన్ స్టూడియోకు ఓ వ్యక్తి నిప్పుపెట్టడంతో మంటల్లో చిక్కుకుని 33 మంది చనిపోగా దాదాపు అంతే సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. జపాన్ వాసులను షాక్‌కు గురిచేసిన ఈ ఘటన క్యోటోలో చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం ఓ దుండగుడు స్థానిక క్యోటో యానిమేషన్ స్టూడియోలోకి ప్రవేశించాడు. ‘మీరు చస్తారు’ అని అరుచుకుంటూ ప్రవేశ ద్వారం వద్ద గుర్తు తెలియని ద్రవాన్ని చల్లి, ఆ వెంటనే నిప్పంటించాడు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఉద్యోగులంతా ప్రాణ భయంతో పైనున్న మూడంతస్తులకు చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే, వారు మంటల తీవ్రత నుంచి తప్పించుకోలేకపోయారు. మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది 33 మృతదేహాలను వెలికి తీశారు. ఇందులో 20 మృతదేహాలు మూడో ఫ్లోర్‌లోనే పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో 36 మంది కాలిన గాయాలపాలు కాగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని వివరించారు. బాధితుల్లో చాలా మంది కంపెనీ ఉద్యోగులేనని తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన నిందితుడి(41)ని కూడా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. అతడు కంపెనీ ఉద్యోగి కాదని మాత్రమే పోలీసులు వెల్లడించారు. తన వస్తువును క్యోటో యానిమేషన్ కంపెనీ దొంగతనం చేసిందని నిందితుడు ఆరోపిస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ప్రమాదానికి అతడు గ్యాసొలిన్ను వాడి ఉంటాడని భావిస్తున్నారు. ఘటన స్థలి నుంచి పోలీసులు కొన్ని కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, అవి నిందితుడివేనా కాదా అనేది తెలియరాలేదు. ప్రమాదం సమయంలో ఆ భవనంలో 70 మందికి పైగా ఉన్నట్లు సమాచారం. లకీ స్టార్, కె–ఆన్, హరుహి సుజుమియాతోపాటు పోకెమాన్, విన్నీది పూహ్ వంటి యానిమేషన్ చిత్రాలతో క్యోటో యానిమేషన్ ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. కాగా, జపాన్‌లో ఇటువంటి విద్రోహ చర్యలు జరగడం చాలా అరుదు. 2001లో టోక్యోలో అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 2016లో ఓ వ్యక్తి టోక్యోలోని నర్సింగ్ హోం వద్ద కత్తితో దాడి చేసి 19 మందిని పొట్టనబెట్టుకున్నాడు. స్టూడియో వద్ద సహాయక చర్యలు -
అందుబాటు ధరలో చందమామ!
2023 అమెరికన్ స్పేస్–ట్రావెల్ కంపెనీ ‘స్పేస్–ఎక్స్’ తొలి ప్రైవేట్ ప్యాసింజర్‌ను చంద్రుడి పైకి పంపింది. ఆ ప్యాసింజర్ పేరు యుసకు మాయిజవా. జపాన్ బిలియనీర్. ఈ యుసకు భూమి మీద ల్యాండయ్యాడో లేదో కనిపించిన టీవీ స్టూడియోల్లోకి దూరి ‘ఆహా చంద్రమండలం’ ‘ఓహో చంద్రమండలం’ అంటూ స్పీచ్‌లు మొదలుపెట్టాడు. ఇల్లు దాటి ఎప్పుడూ పక్క ఊరికి పోనివారు కూడా యుసకు స్పీచ్‌లు విని తెగ ఇదై పోయారు. జీవితంలో ఒక్కసారైనా చంద్రుడి మీదికి వెళ్లి రావాలని కలలు కన్నారు. కానీ ఏం లాభం? యుసకులాంటి బిలియనీర్లకు తప్ప సామాన్యులకు ‘స్పేస్–ఎక్స్’ ధరలు అందుబాటులోకి లేవు. 2025 బిలియనీర్లు, మిలియనీర్లకే కాదు సామాన్యజనానికి కూడా ధరలు అందుబాటులోకి తెచ్చి చారిత్రక విప్లవానికి శ్రీకారం చుట్టింది స్పేస్–ఎక్స్.అదిగో ఆ ఊళ్లో ఏదో అలికిడి అవుతుంది. ఒక్కసారి లుక్కేద్దామా మరీ...‘‘ఏం ఎంకయ్య మామా, ఏటో పయనమైనట్లున్నావు’’‘‘నాకు ఒక్కగానొక్క కూతురు అనే విషయం నీకు తెలుసుకదరా అల్లుడు..’’‘‘ఎటు వెళుతున్నావో చెప్పరా మామా అంటే, నాకు ఒక్కగానొక్క కూతురు అంటావేమిటి నీ యెంకమ్మ. చెవుడుగానీ వచ్చిందా ఏమిటి?’’‘‘నీకు తొందరెక్కువ, ఆగెహే. నేను చెప్పేది ఓపిగ్గా విను. నా ఒక్కగానొక్క కూతురు పెళ్లి ఘనంగా చేశాను అనే విషయం నీకు తెలుసు కదా. నువ్వు అడిగినంత కట్నం ఇస్తాను కోరుకో అల్లుడు అని అల్లుడుగారికి బంపర్ ఆఫర్ ఇచ్చాను. ‘నీ కట్నం ఎవరికి కావాలి! నన్ను చంద్రుడి మీదికి పంపించు చాలు’ అని కోరాడు. రెండు సంవత్సరాల క్రితం కోటీశ్వరులకు తప్ప మనలాంటోళ్లకు చంద్రుడిపైకి వెళ్లే అవకాశం లేనేలేదు. అందుకే తరువాత చూద్దాంలే అల్లుడు అని వాయిదా వేశాను. ఇది దృష్టిలో పెట్టుకొని పోయిన ఏడాది సంక్రాంతికి ఆయన మా ఇంటికి రాలేదు, అమ్మాయిని కూడా పంపలేదు. ఎలారా దేవుడా అని తెగ బాధ పడుతుండగా స్పేస్–ఎక్స్ ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చిన తీపి వార్త తెలిసింది. ఇప్పుడు ఒక్కసారేమిటి? సంవత్సరానికి ఆరుసార్లు అల్లుడిని చంద్రుడి పైకి పంపించగలను. రేపే మా అల్లుడి చంద్రమండల యాత్ర. అందుకే పట్నం వెళుతున్నాను’’(సరిగ్గా ఆరు నెలల మూడు రోజుల తరువాత...) ‘‘ఏం మామా, దిగులుగా కూర్చున్నవ్? మీ అల్లుడిని చంద్రుడి మీదికి పంపాలనేది నీ ఏకైక కోరిక. అది కూడా నెరవేరింది కదా. ఇంకా దిగులెందుకు?’’‘‘ఏం చంద్రయాత్రో ఏమో...మా అమ్మాయి కాపురం బుగై్గపోయింది’’‘‘ఏమైంది మావా?!’’‘‘మా అల్లుడు చంద్రుడిపైకి వెళ్లి ఆరునెలలు దాటింది. రెండు నెలలు తిరక్కుండానే రావాల్సిన వాడు ఆరునెలలైనా రాకపోయేసరికి ఆందోళన మొదలైంది...’’‘‘ఏదైనా ప్రమాదం జరిగిందా ఏమిటి?’’ ‘‘ప్రమాదమా పాడా! ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ చంద్రమండలం అధికారులతో మాట్లాడితే అల్లుడిని మాతో మాట్లాడించారు. కోషియా మూడుమాజియా అనే కొరియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, చావైనా బతుకైనా ఆమెతోనే అన్నాడు అల్లుడు. మీ పెళ్లిని నేను ఆమోదిస్తున్నాను...ముందైతే భూమి మీదికి రావయ్యా మగడా అన్నాను. ‘నేనేమన్నా చెవిలో రాకెట్ పెట్టుకున్నాననుకుంటున్నావా! భూమి మీదికి రాగానే మా ఇద్దరినీ విడదీయాలనేదే కదా నీ రావుగోపాల్రావు ప్లాను. నేను రాను గాక రాను. కూలో నాలో చేసుకొని మేమిద్దరం ఇక్కడే బతుకుతాం’ అన్నాడు గట్టిగా.ఇక ఆరోజు నుంచి రాత్రి కాగానే మా అమ్మాయి ఇంటి నుంచి పరుగెత్తుకు రావడం, ఆకాశంలో చందమామను చూస్తూ...‘చందమామ రావేనా మొగుడిని తేవే’ అని శోకాలు తీస్తూ పాడటం.దాని పాటలు వినలేక ఛస్తున్నాననుకో!’’ మరో ఊళ్లో... ‘‘ఏంటయ్యా కోటేశ్వర్రావు అలా నెత్తి మీద వైట్క్లాత్ వేసుకొని ఏడుస్తున్నావు?’’‘‘చంద్రుడి మీద అడుగు మోపితే నీ ఆస్తులు రెట్టింపు అవుతాయని ఒక జ్యోతిష్యుడు చెబితే ఛలో చంద్రమండలం అంటూ పరుగులు తీశాను. అక్కడికి వెళ్లాక అర్థమైంది....’’‘‘ఏమైంది?’’‘‘నీకు మొదటి నుంచి చెప్పాలి. చంద్రమండలంలోని ముఖ్యమైన ప్రాంతాలను మన ఇండియన్ కంపెనీ ‘మస్కా’కు కాంట్రాక్ట్ ఇచ్చారట. ఈ ‘మస్కా’వాళ్లు అక్కడ తమ తడాఖా చూపిస్తున్నారు. బిగ్ ఫాల్కాన్ రాకెట్లో నుంచి చంద్రుడిపై అడుగుపెట్టగానే... ఆహా! ఎంత అందంగా ఉంది ఈ చంద్రలోకం అన్నాను అక్కడ కనిపించిన వాడితో. ఓకే సార్ అని ఒక చీటీ చేతిలో పెట్టాడు. అందులో 33 డాలర్లు అని ఉంది. మన ఇండియన్ కరెన్సీలో 2,490 రూపాయలన్నమాట. ఎందుకు ఇది? అని అడిగితే...హియరింగ్ ట్యాక్స్. ఈలోకంలో ఏది వృథాగా వినరు. ట్యాక్స్ ఉంటుంది... అని చెప్పాడు. ఆ తరువాత... చంద్రమండలంలో ఒక వీధిలో నడిచి నడిచి ఫుట్‌పాత్‌పై ఉన్న ఒక బెంచిపై కూలబడ్డాను. ఇంతలో నా దగ్గరకు ఒక ఆఫీసర్ వచ్చి రసీదు చేతిలో పెట్టాడు. 249 డాలర్లు అని ఉంది. అనగామన ఇండియన్ కరెన్సీలో 18,290 రూపాయలు. ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచాను. ‘ఇక్కడ ఫ్రీగా కూర్చోవడం కుదరదు. బెంచి ట్యాక్స్ ఉంటుంది’ అన్నాడు. ఆ ట్యాక్స్ కూడా కట్టాను. వెంటనే మరో చీటీ చేతిలో పెట్టాడు. ‘ఇది ఎందుకు?’ అని అడిగాను. ఇంతకు ముందు ‘ఎందుకు?’ అని గట్టిగా అరిచారు. ఇది ‘అరుపు ట్యాక్స్’ అన్నాడు. అదీ కట్టాను.‘‘ఛీ... పొరపాటున చంద్రలోకానికి వచ్చాను.భూమి మీద టోల్ట్యాక్స్లాంటి అయిదారు ట్యాక్స్‌లు కడితే సరిపోయేది. ఇక్కడేమిటి? ప్రతిదానికి తొక్కలో ట్యాక్సు’’ అన్నాను.మరో చీటీ చేతిలో పెట్టాడు.‘ఇది ఏమిటి?’ అన్నాను భయంగా.‘ఇన్సల్ట్ ట్యాక్స్.... పది లక్షల నలభైవేల నాలుగు వందల డెబ్బై రెండు రూపాయలు’ అన్నాడు గంభీరంగా.అదీ కట్టాను.చంద్రుడిపైకి అడుగు పెట్టి మళ్లీ తిరుగురాకెట్ ఎక్కేవరకు... కూర్చుంటే ట్యాక్స్, లేస్తే ట్యాక్స్, తుమ్మితే ట్యాక్సు, దగ్గితే ట్యాక్సు... మాట్లాడితే టాకింగ్ ట్యాక్స్, మాట్లాడకపోతే సైలెన్స్ ట్యాక్స్... ఇలా రకరకాల ట్యాక్స్‌లతో తడిసి మోపెడైంది. నా ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అదీ సంగతి!’’ – యాకుబ్ పాషా -
ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో చోరీ
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకి చెందిన పాటల రికార్డింగ్ స్టూడియోలో చోరీ జరిగింది. ఫిలింనగర్ రోడ్ నంబర్ 10లోని ప్లాట్ నంబర్ సి.45లో ఉన్న స్టూడియోలో దాచిన రూ.4.5 లక్షలు అపహరణకు గురయ్యాయి. జనవరి 27న చెన్నై వెళ్లిన ఆయన ఈ నెల 2న తిరిగి వచ్చారు. అవసరం నిమిత్తం శనివారం బీరువా తెరిచి చూడగా అందులోని నగదు కనిపించలేదు. దీంతో మణిశర్మ వ్యక్తిగత సహాయకుడు వెంకటేశ్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ ఆయన మేనేజర్ జి.సుబ్బానాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. -
వనస్థలిపురంలో రెండుచోట్ల చోరీలు
సాక్షి, హైదరాబాద్: వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పలుచోట్ల చోరీలు జరిగాయి. సహారా కాలనీ, వనస్థలి హిల్స్ కాలనీలలో దొంగతనాలు జరిగాయి. ఓ ఫోటో స్టూడియో, మరో రియల్ ఎస్టేట్ కార్యాలయంలో రూ.2 లక్షల విలువైన కెమెరాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు దొంగలు తీసుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేస్తున్నారు.