హైదరాబాద్లో పెప్పర్ఫ్రై స్టూడియో | Pepperfry to set up more experiential studios by Dec | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో పెప్పర్ఫ్రై స్టూడియో

Published Thu, Jun 23 2016 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

హైదరాబాద్లో పెప్పర్ఫ్రై స్టూడియో - Sakshi

హైదరాబాద్లో పెప్పర్ఫ్రై స్టూడియో

డిసెంబరుకల్లా మరో 10 కేంద్రాలు 
కంపెనీ ఫౌండర్ ఆశిష్ షా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫర్నీచర్, హోం డెకొరేటివ్ ఉత్పత్తుల విక్రయంలో ఉన్న ఈ-కామర్స్ కంపెనీ పెప్పర్‌ఫ్రై హైదరాబాద్ బంజారాహిల్స్‌లో స్టూడియోను ప్రారంభించింది. ఈ స్టూడియోలో ఉత్పత్తులను కేవలం ప్రదర్శిస్తారు. ఇంటి డిజైన్‌నుబట్టి ఏ ఫర్నీచర్ కొనాలో కంపెనీకి చెందిన ఆర్కిటెక్టులు, డిజైనర్లు కస్టమర్లకు సల హాలు, సూచనలు చేస్తారు. డిసెంబరుకల్లా స్టూడియోల సంఖ్యను ప్రస్తుతమున్న 8 నుంచి 18కి చేరుస్తామని పెప్పర్‌ఫ్రై.కామ్ ఫౌండర్ ఆశిష్ షా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌లో మరో కేంద్రం రానుందన్నారు. 400 సొంత ట్రక్కుల ద్వారా దేశంలో 500 పట్టణాల్లో ఫర్నీచర్‌ను సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. కంపెనీ విక్రయాల పరంగా 8 శాతం కస్టమర్లతో హైదరాబాద్ టాప్-5లో ఉందన్నారు.

 సమిష్టి నిర్ణయం: పెప్పర్‌ఫ్రై 10,000లకుపైగా ఉత్పత్తులను విక్రయిస్తోంది. వీటిలో సమకాలీన డిజైన్లు సగం ఉంటాయని కంపెనీ తెలిపింది. 65 శాతం అమ్మకాలు రాత్రి 7 తర్వాత లేదా వారాంతాల్లో జరుగుతున్నాయని ఆశిష్ వెల్లడించారు. దీనినిబట్టి చూస్తే ఫర్నీచర్ ఎంపిక కుటుంబ సభ్యుల సమిష్టి నిర్ణయంగా కనపడుతోందని అన్నారు.   దేశంలో హోం డెకొరేటివ్ , ఫర్నీచర్ విపణి రూ.1.32 లక్షల కోట్లుంది. ఇందులో వ్యవస్థీకృత రంగ వాటా 12-15 శాతం. ఈ ఏడాది రూ.1,000 కోట్ల టర్నోవర్‌ను పెప్పర్‌ఫ్రై లక్ష్యంగా చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement