హైదరాబాద్ మణికొండలోని ఓయూ కాలనీలో రమేష్ స్టూడియోను తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. జనవరి 27న ఉదయం సంపూర్ణ సూపర్ మార్కెట్ పైన రమేష్ స్టూడియోస్ ఏర్పాటు చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రమేష్ స్టూడియోస్‌తో పాటు డిఐ సూట్ ప్రారంభించారు.
తెలుగు చిత్ర నిర్మాత మండలి ప్రెసిడెంట్, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ చేతుల మీదుగా డబ్బింగ్ థియేటర్‌ను ప్రారంభించారు. ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎడిటింగ్ రూమ్‌ను ప్రారంభించారు. ఆపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ అనుపమ రెడ్డి చేతుల మీదగా రెండవ సెకండు సూట్‌ను ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపల్ చైర్మన్ నరేంద్ర, ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్, నల్గొండ డీసీఎంస్ ఛైర్మెన్ బొల్లా వెంకట రెడ్డితో పాటు పలువురు నగర కౌన్సిలర్స్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment