komatireddi venkat reddy
-
కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే: కోమటిరెడ్డి
హైదరాబాద్, సాక్షి: వికారబాద్ ఐఏఎస్‌పై దాడి కేసీఆర్,కేటీఆర్ కలిసి చేయించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు భవిష్యత్తు లేదని దాడులకు కుట్ర చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రేసింగ్ వ్యవహారంలో అనుమతులు లేకుండా డబ్బు బదిలీ చేశారు. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్ట్ కావాల్సిందే. దాడులకు దిగిన వారికి మద్దతిస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం ఉంది’’అని అన్నారు. -
కోమటిరెడ్డి వినోదం పంచుతున్నారు: జగదీష్‌రెడ్డి
సాక్షి,సూర్యాపేటజిల్లా:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం(అక్టోబర్19)ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్జెక్ట్‌పై కాకుండా కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు.సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడు. మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యం.1956లో మంచినీటితో ఉన్న మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మార్చింది ఎవరు. దొరలు,రజాకార్లకు నిలయం కాంగ్రెస్.కోమటిరెడ్డి బాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.ఇదీ చదవండి: రేవంత్,బండిసంజయ్లది డ్రామా: కేటీఆర్ -
సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డా.బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ఆదివారం రోడ్లు, భవనాల శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయం 5వ అంతస్తులోని 5F 11,12,13 గదుల వద్ద పూజలు నిర్వహించారు. తర్వాత మంత్రి కోమటిరెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే 9 ఫైల్స్‌పై సంతకం చేశానని తెలిపారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కృషి చేసిన వారికీ కృతజ్ఞతలు తెలిపారు. R&B శాఖ కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎంతో చర్చించి కౌన్సిల్ హాల్‌ను షిఫ్ట్ చేస్తున్నమని తెలిపారు. ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు తనకు అప్పగించారని పేర్కొన్నారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు ఫెన్సింగ్ తీసేసి సుందరీకరణ చేస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోని రోడ్లను రూ.100 కోట్లతో నాలుగు లైన్ల రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని కోమటిరెడ్డి తెలిపారు. రేపు(సోమవారం) తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అపాయింట్మెంట్ తీసుకుంటానని అన్నారు. తనకున్న పరిచాయలతో ఢిల్లీ నుంచి నిధులు తీసుకువస్తానని తెలిపారు. కొడంగల్ లింగంపల్లి-దుగ్యాల రోడ్డు, నేషనల్ హైవే రోడ్లు కూడా రావాల్సి ఉందని అందుకే 14 రోడ్లను.. నేషనల్ హైవే రోడ్లుగా గుర్తించాలని రేపు ఢిల్లీకి వెళ్తునట్లు తెలిపారు.హైదరాబాద్-విజయవాడ రోడ్‌ను ఆరు లైన్ల రోడ్‌గా మార్చాలని అన్నారు. నకిరేకల్ రోడ్డు అభివృద్ధి చేయాలని, హైదరాబాద్-కల్వకుర్తి రోడ్డును 4 లైన్లుగా మార్చాలని చెప్పారు. సెంట్రల్ రోడ్ నిఫ్రా స్ట్రక్చర్ నిధులు పెంచాలని కేంద్రాన్ని కోరనున్నట్లు తెలిపారు. మొత్తం ఐదు పనులను పూర్తి చేయాలని కేంద్ర మంత్రిని అడుగుతానని పేర్కొన్నారు. ఎల్బీనగర్ మల్కాపురం వరకు, మల్కాపురం నుంచి సూర్యాపేట వరకు 6 లైన్ల రోడ్డు పనులు చేయాలన్నారు. పది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. -
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..!
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..! -
ఏఐసీసీ షోకాజ్ నోటీసులు చెత్త బుట్టలో పడ్డాయి: కోమటిరెడ్డి
-
మూసీ ప్రక్షాళన పై ప్రధానితో చర్చించా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
ఎన్నికలకు నెల ముందు వరకు రాజకీయాలు మాట్లాడను : కోమటిరెడ్డి వెంకట రెడ్డి
-
రాష్ట్రంలోని సంపద కేసీఆర్ ఫ్యామిలీకే సరిపోవడం లేదు : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
-
TPCC: అధ్యక్షుడిగా కోమటిరెడ్డా? రేవంతా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నూతన సారథి ఎంపిక వ్యవహారం తుది అంకానికి చేరుకుంది. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు పలు కమి టీల జాబితా సోనియా గాంధీ చేతికి వెళ్లిందని, ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అనే సంకేతాలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడితోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్య క్షులు, ప్రధాన కార్యదర్శులతో సహా నాలుగైదు ఇతర కమిటీలను కూడా ప్రకటించనున్నారని సమా చారం. సుదీర్ఘ కసరత్తు తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఎదురు చూస్తున్న ప్రకటనకు రంగం సిద్ధమైందని, ఏ క్షణమైనా అధికారిక ఉత్తర్వులు రావొచ్చని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. ఆ ఇద్దరేనా..! టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతల పేర్లు ప్రతిపాదనకు వచ్చినా తుది పరిశీలన కోసం ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లనే అధిష్టానం పరిగణనలోకి తీసుకుంది. శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, మధుయాష్కీల పేర్లను చివరి వరకూ పరిశీలించినా పలు కారణాలతో వెనక్కు వెళ్లాయని, అనూహ్య పరిణామం జరిగితే తప్ప కోమటిరెడ్డి, రేవంత్‌లలో ఎవరో ఒకరు పీసీసీ అధ్యక్షుడు కావ డం దాదాపు ఖరారైందని తెలుస్తోంది. 10 జన్‌పథ్ సమాచారం ప్రకారం.. అధ్యక్షుడితో పాటు ఆరు గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను కూడా అధిష్టానం నియమించనుంది. అన్ని సామాజిక వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇచ్చేలా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ, ఇతర సామాజిక వర్గాలకు అవకాశం దక్కేలా ఆరుగురిని ఎంపిక చేయనున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాలో దామోదర రాజ నర్సింహ, బలరాం నాయక్, కొండా సురేఖ, షబ్బీర్ అలీ, మధుయాష్కీ లేదా మహేశ్‌కుమార్ గౌడ్, జగ్గారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి. వీరికి తోడు మరో 30 మందికి పైగా నేతలకు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించనున్నారు. కొన్ని కమిటీలు కూడా.. టీపీసీసీ కమిటీతోపాటు మరికొన్ని కమిటీల ఎంపిక కసరత్తును కూడా కాంగ్రెస్ అధిష్టానం పూర్తి చేసింది. ఇందులో ప్రచార, మేనిఫెస్టో, స్ట్రాటజీ, ఎన్నికల కమిటీలు ఉండనున్నాయి. ఈ కమిటీల్లో ఏదో ఒక దానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు చైర్మన్‌గా అవకాశం కల్పిస్తారని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారన్న దానిపై అధిష్టానం గోప్యతను పాటిస్తోంది. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇవ్వని నేపథ్యంలో ఆయన్ను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించనున్నారు. రేవంత్‌కు అధ్యక్ష పదవి ఇస్తే కోమటిరెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తారా లేక మరో నేతను ఎంపిక చేస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది. మేనిఫెస్టో కమిటీకి కూడా సీనియర్ నేతలను నియమిస్తారని, ఇతర కమిటీలతో కలిపి పూర్తి స్థాయిలో సామాజిక కోణంలో కూర్పు జరుగుతుందని, సీనియర్లందరికీ తగిన ప్రాతినిధ్యం ఉండేలా జాబితాలు తయారైనట్టు తెలుస్తోంది. ఈ కమిటీలకు సంబంధించిన జాబితాను పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జి కె.సి.వేణుగోపాల్ సోమవారం సోనియాకు అందజేశారని, ఒకట్రెండు రోజుల్లోనే ఢిల్లీ నుంచి అధికారిక ప్రకటన రానుందనే చర్చ జోరుగా సాగుతోంది. -
బెల్టు షాపులు మూసేస్తే నగదు బహుమతి
-
అవినీతిపై నేనొక్కడినే మాట్లాడా: కోమటిరెడ్డి
హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని ఎండగడితేనే ఆ పార్టీని ఓడించగలమని.. పథకాల అమలుపై ఒత్తిడి తెచ్చినా లాభం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పథకాల అమలుపై ఒత్తిడి తెస్తే లాభం లేదు. ఆదాయం లేదనో.. మరో కారణంతోనే కేసీఆర్ వాటిని దాటవేస్తారు. దానికి బదులు అవినీతి పాలనపై మాట్లాడితే ఫలితముంటుంది. గత మూడేళ్లుగా అవినీతి గురించి అసెంబ్లీలో ప్రస్తావించింది నేనొక్కడినే. మిషన్ భగీరథలో రూ. 20 వేల కోట్లు కేవలం పైపుల కోనుగోలుకే ఖర్చు చేస్తున్నారు. అందులో 5 శాతం పైపుల కంపెనీ నుంచే కేసీఆర్‌కు కమీషన్ వస్తోంది. దేశంలో ఐఎస్ఐ బ్రాండ్ కంపెనీలు 14 ఉన్నాయి. అందులో మూడు కంపెనీలనే ఎందుకు ఎంపిక చేసుకున్నారని’’ ప్రశ్నించారు.