
సాక్షి,సూర్యాపేటజిల్లా:బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శనివారం(అక్టోబర్19)ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సబ్జెక్ట్‌పై కాకుండా కోమటిరెడ్డి బూతులు మాట్లాడుతున్నాడు.
సమస్యను పక్కదారి పట్టిస్తూ మీడియాకు వినోదం పంచుతున్నాడు. మూసీ కాలుష్యానికి కారణం ఎవరో చర్చకు సిద్ధమా? కాంగ్రెస్ ద్రోహ ఫలితమే మూసీ కాలుష్యం.1956లో మంచినీటితో ఉన్న మూసీని 2014 నాటికి కాలుష్యకాసారంగా మార్చింది ఎవరు. దొరలు,రజాకార్లకు నిలయం కాంగ్రెస్.కోమటిరెడ్డి బాష చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు’అని జగదీష్‌రెడ్డి మండిపడ్డారు.
ఇదీ చదవండి: రేవంత్,బండిసంజయ్‌లది డ్రామా: కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment