
నగరంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, కంటెంట్ క్రియేటర్లు, క్రియేటివ్ బ్రాండ్ మేనేజర్లకు కావాల్సిన సకల సదుపాయాలతో సృజనాత్మక ఫ్యాషన్ స్టూడియోలు వెల్లివిరుస్తున్నాయి. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్ వేదికగా అధునాతన సాంకేతికతతో అరిసా బొట్టెగా క్రియేటివ్ స్టూడియో ప్రారంభమైంది.
ఇందులో ప్రత్యేకమైన ఇన్ డోర్ సెట్స్.. ఫొటోలు–వీడియోలు అత్యద్భుతంగా వచ్చేందుకు కావాల్సిన ప్రాప్స్.. తదితర అధునాతన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు సాతి్వక తెలిపారు. ఈ వేదికలో బ్రాండ్ విజువల్స్, ఫ్యాషన్ షూట్స్‌తో పాటు పెంపుడు జంతువులు, పిల్లల వినోదభరితమైన సెట్టింగ్‌లను ఏర్పాటు చేశామని శ్రీ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సెట్టింగ్స్‌లో పలువురు మోడల్స్ ఫొటోలకు ఫోజులిస్తూ సందడి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment