![Sobhita Dhulipala announces launch of creative studio - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/13/shobitha-dhulipala.jpg.webp?itok=yMN6AQ_T)
మనం పని చేస్తున్న రంగంలో ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనుకుంటారు కొందరు. ప్రస్తుతం శోభితా ధూళిపాళ్లకు కూడా ఇదే ఆలోచన వచ్చినట్టుంది. అందుకే స్టూడియో స్థాపిస్తున్నానని ప్రకటించారు. అయితే ఇది షూటింగ్‌లు చేసుకునే స్టూడియో కాదు. షూటింగ్ చేయాలంటే కావాల్సిన కథలకు స్టూడియో... క్రియేటివ్ స్టూడియో. ఈ విషయం గురించి శోభితా మాట్లాడుతూ – ‘‘నాకు రాయడం అన్నా, చదవడం అన్నా ఎంతిష్టమో నా పరిచయస్తులందరికీ తెలుసు.
ఆ ఇష్టమే నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసింది. పరిశ్రమలో సాధించిన ఏడెనిమిదేళ్ల అనుభవంతో మన దగ్గర ప్రతిభకు లోటు లేదని తెలిసింది. భిన్నమైన ఆలోచనలతో ఉన్న ప్రతిభ కలిగినవాళ్లను చాలామందిని చూశాను. క్రి యేటివ్ స్టూడియో అనుకోండి.. ఇంకేదైనా అనుకోండి.. నేనో ప్లాట్‌ఫామ్ స్థాపించాలనుకుంటున్నాను. కొత్త కొత్త ఆలోచనలు, కథలు, ఐడియాలను ఇక్కడ తయారు చేయించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పటికి కార్యరూపం దాల్చడం చాలా సంతోషం’’ అన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment