కడప అర్బన్ : కడప టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాచుపల్లె బస్టాండ్ వద్ద ఫొటో స్టుడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్న మల్లికార్జున (35) అనే వ్యక్తి అప్పుల బాధ తాళలేక శనివారం షాపులో విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప నగరంలోని అక్కాయపల్లెకు చెందిన మల్లికార్జున ఇటీవల మాచుపల్లె బస్టాండ్‌లో ప్రశాంత్ స్టుడియో పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి వచ్చి స్టుడియో షట్టర్ తెరిచి లోపలికి వెళ్లాడు. విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మధ్యాహ్నం భోజనం తీసుకుని వచ్చిన మృతుని భార్య మహేశ్వరమ్మ ఎంతసేపటికీ షట్టర్ తీయకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి షట్టర్ పగుల గొట్టించింది. లోపల అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని వెంటనే రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
Published Sat, Feb 11 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement
Advertisement