న్యూఢిల్లీ: ఢిల్లీలోని పహార్ గంజ్ ప్రాంతంలో ఒక హోటల్లో ఉంటున్న ఐదుగురు కుర్రాళ్లను మసాజ్ సెంటర్ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తులు బురిడీ కొట్టించారు. దౌర్జన్యం చేసి వారి దగ్గర నుండి రూ.27,000 నగదును దోచుకున్నారు. అనంతరం మోసపోయిన యువకులు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు సోహైల్ గులాం రబ్బానీ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన రవ్వలపాటి మోజెస్ అతని స్నేహితులు నవీన్, దినేష్, సురేందర్, సందీప్ లు పహార్ గంజ్ లోని హోటల్ అమాన్ లో ఉంటున్నారు. తెల్లవారు జాము 4.30 సమయానికి ఈ ఐదుగురు టీ తాగి సిగరెట్ కాల్చడానికి బయటకు వచ్చారు. అక్కడికి వచ్చిన ఒక యువకుడు వీరికి మసాజ్ సెంటర్ గురించి చెప్పి ఆశ పుట్టించాడు.
మసాజ్ అనగానే ఆశపడ్డ ఐదుగురు స్నేహితులు ఆ అజ్ఞాత వ్యక్తి వెనుక గుడ్డిగా వెళ్లారు. వారిని హోటల్ తాన్యకు తీసుకెళ్లిన అజ్ఞాత వ్యక్తి అక్కడ కూర్చోమని చెప్పి బయటకు వెళ్లి కోసుద్ది సేపటికి ఇద్దరు వ్యక్తులు లోపలికి వచ్చి తలుపులు గడి పెట్టారు. ఐదుగురిని చితక్కొట్టి వారి నుంచి డబ్బులు గుంజుకున్నారు. ఫోన్ పే ద్వారా రూ.27,000 తమ అకౌంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేయించారు. నిలువుదోపిడీ పూర్తైన తర్వాత ఐదుగురిని మర్యాదగా ఢిల్లీ విడిచి వెళ్లాలని లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించినట్లు తెలిపారు డీసీపీ సైన్.
ఫిర్యాదుదారుడు చెప్పిన వివరాల ప్రకారం నిందితులను అదుపులోకి తీసుకున్నామని తర్వాత ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కు వచ్చి వారిని గుర్తించినట్లు తెలిపారు. వారిని సోహైల్,గులాం రబ్బానీగా గుర్తించామని మా స్టైల్లో విచారణ జరపగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఈ సంఘటనలో హోటల్ యజమాని, మేనేజర్ పాత్ర ఏమిటనేది ఆరా తీస్తున్నామని ఒకవేళ వారు దోషులుగా తేలితే హోటల్ లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ నేతపై ప్రశంసలు కురిపించిన బీజేపీ ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment