
వ్యభిచార గృహంపై దాడి : ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని కేపీహెచ్‌బీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీ వసంతనగర్‌లోని ఓ ఇంటిలో నిర్వాహకుడు చైతన్య అనే వ్యక్తి విటులను తీసుకువచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి చైతన్యతో పాటు ఓ మహిళ, ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 సెల్ ఫోన్లు, రూ.11,720 నగదును స్వాధీనం చేసుకుని కేపీహెచ్‌బీ పోలీసులకు అప్పగించారు.