కరీంనగర్ టౌన్: కరీంనగర్ మూడో టౌన్ పోలీసులు శనివారం ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. వీరి నుంచి తొమ్మిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. అన్నీ కూడా హీరోహోండా కంపెనీకి చెందిన స్ల్పెండర్ బైకులే. పట్టుబడిన వారు ముగ్గురూ.. జె.మల్లేష్(29), పి.దేవేందర్(22), బాల సంతోష్(30)లు స్నేహితులే. వారందరూ కరీంనగర్ పట్టణంలోని వివిధ రెస్టారెంట్లలో పని చేస్తుండేవారు. ఖాళీ సమయాల్లో దొంగ తాళంతో బైక్‌లను దొంగిలించేవాళ్లు. మల్లేష్, బాలసంతోష్‌లు దొంగిలిస్తే దేవేందర్ అమ్మి పెట్టేవాడు.
ముగ్గురూ బైక్‌పై వస్తుండగా త్రీటౌన్ పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు. ఆసమయంలో తనిఖీ చేయగా బైక్‌కు సంబంధించిన పత్రాలు ఏవీ వారి వద్ద లేవు. పోలీసులు తనదైన శైలిలో విచారణ చేయగా విషయం మొత్తం వెల్లడైంది. పోలీసులు ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.