
తల్లీకూతుళ్ల హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్ల మండలం కరావులపల్లితండాలో ఓ ఉన్మాది తన తమ్ముడి భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా హత్య చేశాడు.
ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో మదనమోహన్ నాయక్ భార్య లక్ష్మీదేవి(32), ఆమె కుమార్తెలు యమున(8), చందనబాయి(2) లను హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు శంకర్‌నాయక్ లొంగిపోయాడు. నిందితుడు శంకర్ నాయక్‌తో పాటు ఆమె భార్య, తల్లిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.