child murder case
-
చిన్నారి హత్య కేసు; దోషికి మరణశిక్ష
గాంధీనగర్: సూరత్‌లో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన దుర్మార్గుడికి గుజరాత్ హైకోర్టు మరణశిక్ష విధించింది. కేసు తీవ్రత దృష్ట్యా నిందితుడు అనిల్ యాదవ్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. బిహర్‌కు చెందిన అతడు సూరత్‌లో నివాసం ఉంటూ గత ఏడాది అక్టోబర్‌లో దారుణానికి ఒడిగట్టాడు. అక్కడ తెలిసిన వారి పాపను ఏడాది క్రితం కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంట్లోనే లైంగికదాడికి పాల్పడి, ఆ తర్వాత చిన్నారిని హతమార్చి మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో ఉంచి అక్కడి నుంచి పారిపోయాడు. తమ కూతురు కనిపించడం లేదని చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యల్లో మృతదేహం అనిల్ ఇంట్లో ప్లాస్టిక్ సంచిలో ఉండటం చూసి నిర్ఘాంతపోయారు. తర్వాత అనిల్ యాదవ్‌ను పోలీసులు గాలించి పట్టుకున్నారు. కేసు విచారణలో భాగంగా 38 మంది సాక్షుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. చిన్నారి మృతదేహానికి జరిపిన వైద్య పరీక్షలు, అటాప్సీని చార్జిషీట్లో పొందుపరిచారు. సూరత్‌లో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసులో అనిల్ యాదవ్‌కు ప్రత్యేక న్యాయస్థానం ఉరి శిక్ష కూడా విధించింది. స్పెషల్ కోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్థించింది. -
హోరెత్తిన హన్మకొండ
హన్మకొండ: నిరసనలతో హన్మకొండ హోరెత్తింది. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. ర్యాలీలు, రాస్తారోకోలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఒక దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి, కాళోజి కూడలి, అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజా సంఘాలు వేలాదిగా చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపాయి. కాళోజి కూడలిలో టైర్లు దగ్ధం చేయడం, కోర్టు ఎదుట ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టే క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు అటు వైపు రాకుండా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు చెదరగొట్టారు. మరోవైపు చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని చేతకానితనంగా ఎండగడుతూ పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చారు. హన్మకొండ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ‘వీ వాంట్ జస్టిస్’.. సీఎం స్పందించా లంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్దకు రాగానే పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకోగా అక్కడే రెండు గంటల పాటు కూర్చున్నారు. పోలీసులు శాంతింప జేసి శ్రీహిత తల్లిదండ్రులతో పాటు కొంత మంది బృందాన్ని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆ కిరాతకుడు అతి కిరాతకుడే..!
అలీగఢ్ : ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనలో నిందితుల్లో ఒకరైన జహీద్ సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడని, బెయిల్‌పై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాజా కేసుతో కలిపి మొత్తం అతనిపై నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక నిందితులు జహీద్, అస్లాంను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. (పాశవిక హత్యపై ప్రకంపనలు) రూ. 10 వేల కోసం దారుణం.. టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
చిన్నారి హత్యోదంతం : సిట్ ఏర్పాటు
లక్నో : పది వేల రూపాయల అప్పు తీర్చలేదన్న కోపంతో.. రెండున్నరేళ్ల చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటన పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజాగ్రహానికి భయపడిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసును త్వరితగతిన విచారణ చేసేందుకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దారుణం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోన్న నేపథ్యంలో పోలీసులు నిందితుల మీద జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్ బృందం ఈ కేసును దర్యాప్తు చేస్తుందని ఎస్ఎస్పీ ఆకాశ్ కుల్హరి తెలిపారు. ఇప్పటికే శాంపిల్స్‌ను ఆగ్రా ఫోరెన్సిక్ లాబ్‌కు పంపించామన్నారు. కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను ఇప్పటికే ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. అంతేకాక చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాహీద్, అస్లాం అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై లైంగిక దాడి జరగలేదని.. పోస్ట్ మార్టమ్ రిపోర్టు కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని పోలీసులు తెలిపారు. కేసు తీవ్రత దృష్ట్యా నిందుతుల మీద జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ క్రమంలో నిందితుల కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాల్సిందిగా మృతురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నాడు. వారికి తెలియకుండా ఈ హత్య జరిగి ఉండదని అతను ఆరోపిస్తున్నాడు. నిందితుల కుటుంబ సభ్యుల నుంచి తనకు ప్రాణాపాయం ఉందని.. వారిని అరెస్ట్ చేయకపోతే.. తనను కూడా చంపేస్తారని బాలిక తండ్రి ఆరోపించాడు. -
చిన్నారి హత్య కేసులో మహిళ అరెస్టు
చెన్నై, టీ.నగర్: బన్రూట్టిలో న్యాయవాదితో కలిసి చిన్నారిని హతమార్చిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. కడలూరు జిల్లా, బన్రూట్టి కంబన్ వీథికి చెందిన మురుగన్, శివరంజని (24) దంపతులు. వీరికి గౌతమన్ (3) అనే కుమారుడు, ఒకటిన్నర ఏడాది వయసున్న ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. శివరంజని ఇంటికి నడువీరపట్టి ప్రాంతానికి చెందిన న్యాయవాది నటరాజన్, అతని భార్య ధైర్యలక్ష్మి తరచుగా వెళ్లేవారు. ఆ సమయంలో వల్లలార్ వీధిలో నివసిస్తున్న యువతి కమలి శివరంజని ఇంటికి ఎదురుగానున్న ఆమె స్నేహితురాలు కార్తికా ఇంటికి వెళ్లి వచ్చేది. ఆ సమయంలో న్యాయవాది నటరాజన్‌కు, కమలికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ధైర్యలక్ష్మికి తెలిసింది. ఆమె ఖండించింది. దీంతో ఆగ్రహించిన కమలి, నటరాజన్ ధైర్యలక్ష్మిని ఏదైనా ఒక వివాదంలో ఇరికించి జైలుకు పంపాలని నిర్ణయించారు. గత డిసెంబరు శివరంజని ఇంటికి వెళ్లిన కమలి శివరంజని కుమార్తె ప్రియదర్శిని ముఖంపై దిండుతో హతమార్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు బిడ్డ తల్లిదండ్రుల వద్ద నాటకమాడింది. కాలక్రమంలో కమలి బిడ్డను హతమార్చినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన ఆమె దీని గురించి గ్రామ నిర్వాహక అధికారికి హత్య చేసినట్లు చెప్పింది. బన్రూట్టి డీఎస్పీ నాగరాజన్ ఆధ్వర్యంలోని పోలీసులు కమలిని అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో నటరాజన్ హత్యకు కుట్రను రూపొందించినట్లు తెలిసింది. పోలీసులు నటరాజన్, కమలిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పరారీలో ఉన్న నటరాజన్ కోసం గాలిస్తున్నారు. మంగళవారం తహసీల్దార్ ఆరుముగం, పోలీసు అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వాహించారు. -
సూరత్ అత్యాచార కేసులో కీలక మలుపు
-
సూరత్ అత్యాచార బాధితురాలు తెలుగు బిడ్డే..!
సూరత్: గుజరాత్ రాష్ట్రం సూరత్‌లో అత్యాచారం, హత్యకు గురైన తొమ్మిదేళ్ల బాలిక ఎవరో తెలిసిపోయింది. గత పన్నెండు రోజులుగా బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు పోలీసులు చేపట్టిన ‘సోషల్ పోస్టర్’ ప్రచారం ఫలించింది. సోషల్ మీడియాలో మృతురాలి ఫోటో చూసి ఆమె తమ కూతురేనంటూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ కుటుంబం సూరత్ పోలీసులను ఆశ్రయించింది. తమ కూతురు గతేడాది అక్టోబర్‌లో అదృశ్యమైందని వారు పేర్కొన్నారు. పోలీసులు వారి వద్ద గల చిన్నారి ఆధార్ కార్డుతో మృతదేహాన్ని పోల్చి చూశారు. మృతురాలి తల్లిదండ్రులు వారేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు వెల్లడించారు. డీఎన్ఏ పరీక్షల అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. 10 రోజుల జాప్యమెందుకు..? శరీరంపై 86 గాట్లతో సూరత్‌లోని భేస్తాన్ ప్రాంతంలో గల క్రికెట్ స్టేడియం వద్ద బాలిక మృతదేహాన్ని ఏప్రిల్ 6న పోలీసులు గుర్తించారు. దాదాపు 5 గంటల పోస్టుమార్టం అనంతరం బాలిక దాదాపు 8 రోజలు అత్యాచారానికి, ఆపై హత్యకు గురైందని తేలింది. అయితే ఫోరెన్సిక్ పరీక్షల కోసం బాలిక శరీర నమూనాలను పోలీసులు ఏప్రిల్ 6న పంపించాల్సి ఉంది. కానీ 10 రోజుల జాప్యం తర్వాత ఏప్రిల్ 16న ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆ నమూనాలు చేరినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసుల్ని వివరణ కోరగా నమూనాలను ఏప్రిల్ 6నే పంపినట్లు చెప్పడం గమనార్హం. ఈ పది రోజుల జాప్యానికి కారణాలేమై ఉంటాయన్నది ఎన్నో పశ్నలను లేవనెత్తుతోంది. బాలిక తల్లిదండ్రులెవరో గుర్తించేందుకు అటు పోలీసులు,వ్యాపారులు స్పందించిన తీరు అమోఘం. సూరత్ ప్రాంతంలోని ప్రతి వ్యాపారి తమ వంతుగా ఆమె ఆచూకీని తెలుపుతూ వారివారి దుకాణాల ముందు ఆ చిన్నారి ఫోటోని ప్రదర్శించారు. -
‘సైతాన్ ఆవహించింది.. అందుకే హత్య చేశా’
న్యూయార్క్ : బ్రూక్లీన్‌కు చెందిన ఇద్దరు చిన్నారులను అతి కిరాతంగా పొడిచి.. ఓ చిన్నారి చావుకు కారణమైన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు నిచ్చింది. చిన్నారులను కత్తితో విచక్షణా రహితంగా పొడవడాన్ని అత్యంత హేయమైన చర్యగా కోర్టు అభివర్ణించింది. నిందితుడు డేనియల్ సేయింట్ హాబర్ట్ మాట్లాడుతూ.. తనను సైతాను ఆవహించిందని, ఆ సమయంలో ఏం చేస్తున్నానో తెలియక చేశానని కోర్టు విచారణలో తెలిపాడు. వివరాల్లోకి వెళితే.. 2014 సంవత్సరంలో బ్రూక్లీన్‌కు చెందిన ప్రిన్స్ జోషువా అవిట్టో (6), మికైలా (7) ఇంటి సమీపంలోని ఆట స్థలంలో ఆడుకున్న తర్వాత ఇంటికి బయలు దేరారు. అదే ప్రాంతానికి చెందిన సెయింట్ హాబర్ట్ వారిని వెంబడించాడు. మెట్ల మీదుగా భవంతి పైఅంతస్థులో ఉన్న తమ ఇంటికి వెళుతుండగా.. లిఫ్టులో వెళితే బాగుంటుందని చెప్పి లోపలికి ఎక్కించాడు హాబర్ట్. లిఫ్టు లోపల మాట్లాడుకుంటున్న చిన్నారులను అల్లరి చేయవద్దని హాబర్ట్ వారించాడు. అయినా వాళ్లు వినకపోవడంతో వెంట తెచ్చుకున్న కత్తితో ప్రిన్స్‌ను 16 సార్లు పొడిచాడు. ఆ తర్వాత మికైలాను కూడా 12 సార్లు పొడిచాడు. పిల్లల అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో కత్తి అక్కడే పడేసి పరారయ్యాడు. కత్తిపోట్లతో రక్తమోడుతున్న చిన్నారులిద్దరినీ స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ప్రిన్స్ ప్రాణాలతో పారాడుతూ తొమ్మిది రోజుల తర్వాత ప్రాణాలు విడిచాడు. మికైలా మాత్రం ప్రాణాలతో బయట పడింది. నాలుగు రోజుల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కత్తి మీద ఉన్న రక్తపు మరకల్లోని డీఎన్ఏ సహాయంతో అతడే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు నిర్ధారించారు. కోర్టు శిక్ష విధించిన అనంతరం ప్రిన్స్ తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. హాబర్ట్కు జీవితఖైదు విధించడంతో తమ కుమారుడి ఆత్మకు శాంతి కలుగుతుందన్నారు. -
ఎవరా చిన్నారి?
సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి ఠాణా పరిధిలోని బొటానికల్ గార్డెన్ వద్ద మృతదేహంగా లభించిన గర్భిణి హత్య... ఉప్పల్ చిలుకానగర్‌లో వెలుగు చూసిన మూడు నెలల చిన్నారి నరబలి... రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉదంతాలు పోలీసులను పరుగులు పెట్టించాయి. ఈ రెండు కేసులను సైబరాబాద్, రాచకొండ పోలీసులు కొలిక్కి తీసుకువచ్చినా.. ఇంకా కొన్ని ‘మిస్టరీలు’ అలాగే మిగిలిపోయాయి. మరోపక్క ఈ కేసుల్లో ఆసక్తికర అంశాలు, కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘బొటానికల్ గార్డెన్’ కేసులో హతురాలు పింకి ఫొటో పోలీసులు సేకరించలేకపోయారు. బిహార్‌కు చెందిన ఆ కుటుంబం వద్ద పేదరికం కారణంగా ఒక్క ఫొటో కూడా లేకుండా పోయింది. ఈ ఉదంతంతో ఫొటో మిస్ కాగా... నరబలి కేసులో ప్రతాప్‌సింగారం వద్ద మూసీలో పడేసిన కారణంగా చిన్నారి మొండెం గల్లంతైంది. అదృశ్యంపై అందని ఫిర్యాదు ? తన భార్య ఆరోగ్యంతో పాటు ఇతర సమస్యలు తీరడానికి నరబలి ఇవ్వడానికి సిద్ధమైన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ గతనెల 31 అర్ధరాత్రి దాటిన తర్వాత బోయగూడ నుంచి శిశువును అపహరించాడు. రోడ్డు పక్కనే పడుకున్న దంపతుల నుంచి చిన్నారిని ఎత్తుకు వచ్చినట్లు నిందితుడు అంగీకరించాడు. ఎవరైనా తమ బిడ్డను కోల్పోతే పోలీసులను ఆశ్రయిస్తారు. కనీసం చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికే ప్రయత్నమైనా చేస్తారు. అయితే సదరు చిన్నారి అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. రాచకొండ పోలీసులు బోయగూడ వద్ద ఆరా తీసినా ఎవ్వరూ బిడ్డను పోగొట్టుకున్నట్లు వెలుగులోకి రాలేదని తేలడంతోఈ చిన్నారిని బెగ్గింగ్ మాఫియా ఎక్కడ నుంచో ఎత్తుకు వచ్చిందనే సందేహాలు కలుగుతున్నాయి. చిన్నారి అదృశ్యమైందని ఫిర్యాదు చేస్తే అసలు కథ బయటకు వస్తుందనే భయంతో ఆ దంపతులు మిన్నకుండినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. సిటీ అధికారుల సాయం కోరారా? రాజశేఖర్ శిశువును కిడ్నాప్ చేసినట్లు పేర్కొంటున్న బోయగూడ ప్రాంతం హైదరాబాద్‌లోని ఉత్తర మండల పరిధిలోకి వస్తుంది. ఈ వ్యవహారానికి సంబంధించి చిన్నారి సంబంధీకులను గుర్తించడానికి, మరికొన్ని ఆధారాలు సేకరించడానికి రాచకొండ పోలీసులు నగర అధికారుల సాయం కోరాల్సిందే. ఉత్తర మండలంలోని అనేక ప్రాంతాల్లో అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. కిడ్నాప్ చేసిన ప్రాంతంలో అవి లేకున్నా... అక్కడ నుంచి ఉప్పల్ రోడ్ వరకు ఉన్న వాటిని అధ్యయనం చేసే ఆస్కారం ఉంటుంది. ఫలితంగా రాజశేఖర్ కదలికలకు సంబంధించి మరింత పక్కా ఆధారాలు సేకరించడంతో పాటు శిశువును పోగొట్టుకున్న లేదా బెగ్గింగ్ మాఫియాపై వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మరోపక్క ఉత్తర మండలంలోని పెట్రోలింగ్ పోలీసులు ప్రతి రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు ఫుట్‌పాత్‌లపై ఉన్న వారి వివరాలు ఆరా తీస్తుంటారు. రాచకొండ పోలీసులు వీరిని సంప్రదిస్తే మరికొన్ని ఆధారాలు లభించే ఆస్కారం ఉన్నా పట్టించుకోలేదని సమాచారం. ఒక్క క్లూస్ టీమ్ విషయంలో మాత్రమే సిటీ నుంచి సహకారం తీసుకున్నారు. ఆధారాలు దొరికినా తప్పించుకునే యత్నం... శిశువును బలివ్వడం, క్షుద్రపూజల వెనుక రాజశేఖర్‌తో పాటు అతడి భార్య శ్రీలత సైతం కీలక పాత్ర పోషించింది. రాజశేఖర్ శిశువు తలను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి నగ్న పూజలు చేశారు. రెండు గదులున్న ఆ ఇంటి మధ్యలో తలను ఉంచాలనే ఉద్దేశంతో ఆర్చ్ దగ్గర పెట్టి తంతు పూర్తి చేశారు. ఆపై ఆ ప్రాంతాన్ని పూర్తిగా కడిగేశారు. దాదాపు నాలుగు రోజుల క్రితం ఘటనాస్థలిని పరిశీలించిన హైదరాబాద్ క్లూస్ టీమ్ అధికారులు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న లుమినాల్ అనే రసాయనం, జర్మనీ నుంచి ఖరీదు చేసిన సూపర్ లైట్–ఎంఓ5 వినియోగించి ఆర్చి వద్ద తనిఖీలు చేశారు. ఫలితంగా అక్కడ రక్తం మరకలు ఉన్నట్లు తేలినా.. అవి మనిషివా? వేరే జంతువుకు చెందినవా? అనే సందేహం ఉంది. ఓపక్క దీనిని నిర్థారించడానికి నమూనాలకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. శ్రీలతను ఈ విషయంపై ప్రశ్నించగా గత నెల 24న తాము సమ్మక్క పూజ నేపథ్యంలో కోడిని బలిచ్చామంటూ చెప్పి తప్పించుకోజూసింది. చివరకు ఫోరెన్సిక్, డీఎన్ఏ రిపోర్టులు అసలు నిజాలు బయటపెట్టి భార్యభర్తల్ని కటకటాల్లోకి పంపాయి. ముందే చెప్పిన ‘సాక్షి’... ఉప్పల్‌లోని చిలుకనగర్ చిన్నారి కేసులో రెండు అంశాలు ‘సాక్షి’ ముందే చెప్పింది. ఈ ఉదంతం ఈ నెల 1న వెలుగులోకి వచ్చింది. అదే రోజు ఘటన పూర్వాపరాలను పరిశీలించి నరబలిగా అనుమానించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 2న ‘నగరంలో నరబలి?’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది జరిగిన పది రోజుల వరకు ఆ చిన్నారి మగ, ఆడ శిశువా అనే స్పష్టత లేదు. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు ఈ నెల 9న గుర్తించారు. దీనికి సంబంధించి ‘ఆ తల ఆడ శిశువుదే!’ పేరుతో 10న కథనం ప్రచురించింది. అది డబుల్ మర్డరే.. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బోటానికల్ గార్డెన్ వద్ద ముక్కలుగా లభించిన గర్భిణి కేసులో హత్యకు గురైంది ఒక్కరు కాదు ఇద్దరుగా పరిగణించే ఆస్కారం ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) ప్రకారం గర్భిణి హత్యకు గురైన సందర్భాల్లో గర్భస్థ శిశువు వయస్సు ఐదు నెలలకు మించి ఉంటే ఇద్దరు చనిపోయినట్లు పరిగణిస్తారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో మొత్తం 17 మంది చనిపోయారు. ఈ కేసును దర్యాప్తు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మృతుల్లో ఓ గర్భిణి సైతం ఉండటంతో చనిపోయిన వారి సంఖ్య 18గా నిర్థారిస్తూ కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దీని ప్రకారం చూస్తే పింకీ ఉదంతాన్నీ డబుల్ మర్డర్‌గా (జంట హత్యలు) తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కేసు డబుల్ మర్డర్‌గా అధికారికంగా పరిగణిస్తే నిందితులకు త్వరగా బెయిల్ లభించదని, నేరం నిరూపితమైతే శిక్ష కూడా ఎక్కువ పడే ఆస్కారం ఉందని చెబుతున్న నిపుణులు సైబరాబాద్ పోలీసులు ఈ కోణంలో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
నరబలి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్
-
ఉప్పల్ నరబలి కేసులో కీలక ఆధారాలు
-
కారకులకు ఐదేళ్ల జైలు
బోరుబావిలో చిన్నారి మృతి కేసు.. పుల్కల్(ఆందోల్): రెండేళ్ల క్రితం బోరు బావిలో పడి ఓ బాలుడు మృతిచెందిన సంఘటనకు సంబంధించి మెదక్ సెషన్స్ కోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. భూ యజమానితోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ఎం.వాణి తీర్పు వెలువరించారు. ఉమ్మడి మెదక్ జిల్లా పుల్కల్ మండల పరిధిలోని బొమ్మారెడ్డిగూడెంకు చెందిన కుమ్మరి రాములు తన వ్యవసాయ భూమిలో బోరు వేసేందుకు వెంకటేశ్‌కు పనులు అప్పగించాడు. 2015 నవంబర్ 27న బోరు వేసినా.. నీళ్లు పడకపోవడంతో ఆ గుంతను పూడ్చకుండానే వదిలేశారు. మరుసటి రోజు ఉదయం మూడేళ్ల బాలుడు రాకేశ్ ఆడుకుంటూ వెళ్లి ఆ బోరుబావి గుంతలో పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు 24 గంటలపాటు శ్రమించినా బాలుడిని రక్షించలేకపోయారు. దీంతో భూమి యాజమాని రాములుతోపాటు బోర్‌వెల్స్ నిర్వాహకుడిపై కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా మెదక్ సెషన్స్ కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేసింది. ‘‘ఇలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కావొద్దు. మరణాలకు బాధ్యులైన వారికి సరైన శిక్షలు వేస్తేనే వీటిని నివారించగలుగుతాం. బోర్లు వేసి అలాగే వదిలేయడంతో చిన్నారుల మృతికి కారణమవుతున్నారు’’అని జడ్జి వాణి పేర్కొన్నారు. అమలుకు నోచుకోని హామీలు రాకేశ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని అప్పటి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, ఎమ్మెల్యే బాబూమోహన్, ఎంపీ బీబీ పాటిల్‌లు హమీ ఇచ్చారు. మృతుడి కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు రాకేశ్ కుటుంబానికి పైసా సాయం చేయలేదు. మూడెకరాల భూమి కూడ ఇవ్వలేదు. -
తన పరిస్థితి రాకూడదని అమ్మే విసిరేసింది
కాకినాడ క్రైం: మాతృత్వానికి మించిన వరం స్త్రీకి మరొకటి లేదు. అయితే నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లే ఆ పసిమొగ్గను తుంచేసింది. ఆడశిశువుగా పుట్టడమే చిన్నారి చేసిన నేరమైంది. ఒక పక్క సంతానం కోసం దంపతులు దేవాలయాల చుట్టూ తిరుగుతుంటే మరో పక్క తమ సహజీవనానికి ఆటంకమవుతుందని ప్రియుడు సతాయించ డంతో ఇరవై రోజుల ఆడ శిశువును వదిలించుకోవడానికి ఉప్పుటేరులోకి విసిరేసి, చిన్నారి ఉసురు తీసింది. కాకినాడ వ¯ŒSటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS పరి«ధిలోని జగన్నాథపురం శ్రీరామ్‌నగర్ పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల రేకాడి కాసులు కాకినాడకు చెందిన తాపీ మేస్త్రి గంగ అలియాస్ వీరబాబు వద్ద కూలి పనిలోకి వెళుతుంటుంది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఈమెకు వివాహం కాలేదు. ఈక్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగి ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా రెండేళ్ల బాబు ఉన్నాడు. డిసెంబర్ 15వ తేదీన రెండో కాన్పుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. తన తల్లి దండ్రులకు నలుగురు కుమార్తెలు ఉండటం, ఇంకా ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు కాకపోవడంతో శిశువును వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. తన ఆర్థిక పరిస్థితి, సహజీనం చేస్తున్న వ్యక్తి ఆడ శిశువు పుట్టడంపై సతాయించడంతో తన భవిష్యత్తు ఏమవుతుందోననే మీమాంసలో వెనకా ముందు ఆలోచించకుండా 20 రోజుల శిశువును తన ఇంటి పక్కనే ఉన్న ఉప్పుటేరులో ఈ నెల నాలుగో తేదీ రాత్రి 11.30 గంటలకు విసిరేసింది. అంతటితో ఆగక తన బిడ్డ కనిపించడం లేదని స్థానికులను నమ్మించడానికి ప్రయత్నించింది. తొలుత ఈమె చెప్పే మాటలు తల్లిదండ్రులే నమ్మలేదు. ఐదో తేదీ ఉదయం పోటుకి మృతదేహం ఉప్పుటేరు ఒడ్డుకి కొట్టుకొచ్చింది. స్థానిక వార్డు సభ్యులు కామాడి దశరధుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై టి.రామకృష్ణ కేసును అనుమానాస్పదంగా నమోదు చేసి సీఐ ఏఎస్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు. ఈ మేరకు శిశువును ఉప్పుటేరులో విసిరేసిన తల్లి రేకాడి కాసులును శనివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ ఏఎస్ రావు తెలిపారు. శనివారం జగన్నాథపురం వీఆర్వో వద్దకు వెళ్లి నేరం అంగీకరించి, లొంగిపోయింది. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకి తరలించగా, రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సై రామకృష్ణను అభినందించారు. -
తల్లీకూతుళ్ల హత్యకేసులో ముగ్గురి అరెస్ట్
అనంతపురం: అనంతపురం జిల్లాలో శనివారం జరిగిన తల్లీకూతుళ్ల హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గోరంట్ల మండలం కరావులపల్లితండాలో ఓ ఉన్మాది తన తమ్ముడి భార్య, ఆమె ఇద్దరు కుమార్తెలను కిరాతకంగా హత్య చేశాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనలో మదనమోహన్ నాయక్ భార్య లక్ష్మీదేవి(32), ఆమె కుమార్తెలు యమున(8), చందనబాయి(2) లను హత్య చేశాడు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు శంకర్‌నాయక్ లొంగిపోయాడు. నిందితుడు శంకర్ నాయక్‌తో పాటు ఆమె భార్య, తల్లిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.