తన పరిస్థితి రాకూడదని అమ్మే విసిరేసింది
Published Sat, Jan 7 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
కాకినాడ క్రైం:
మాతృత్వానికి మించిన వరం స్త్రీకి మరొకటి లేదు. అయితే నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లే ఆ పసిమొగ్గను తుంచేసింది. ఆడశిశువుగా పుట్టడమే చిన్నారి చేసిన నేరమైంది. ఒక పక్క సంతానం కోసం దంపతులు దేవాలయాల చుట్టూ తిరుగుతుంటే మరో పక్క తమ సహజీవనానికి ఆటంకమవుతుందని ప్రియుడు సతాయించ డంతో ఇరవై రోజుల ఆడ శిశువును వదిలించుకోవడానికి ఉప్పుటేరులోకి విసిరేసి, చిన్నారి ఉసురు తీసింది. కాకినాడ వ¯ŒSటౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒS పరి«ధిలోని జగన్నాథపురం శ్రీరామ్‌నగర్ పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల రేకాడి కాసులు కాకినాడకు చెందిన తాపీ మేస్త్రి గంగ అలియాస్ వీరబాబు వద్ద కూలి పనిలోకి వెళుతుంటుంది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడంతో ఈమెకు వివాహం కాలేదు. ఈక్రమంలో వారిద్దరి మధ్య చనువు పెరిగి ఐదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఫలితంగా రెండేళ్ల బాబు ఉన్నాడు. డిసెంబర్ 15వ తేదీన రెండో కాన్పుగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది. తన తల్లి దండ్రులకు నలుగురు కుమార్తెలు ఉండటం, ఇంకా ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లిళ్లు కాకపోవడంతో శిశువును వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. తన ఆర్థిక పరిస్థితి, సహజీనం చేస్తున్న వ్యక్తి ఆడ శిశువు పుట్టడంపై సతాయించడంతో తన భవిష్యత్తు ఏమవుతుందోననే మీమాంసలో వెనకా ముందు ఆలోచించకుండా 20 రోజుల శిశువును తన ఇంటి పక్కనే ఉన్న ఉప్పుటేరులో ఈ నెల నాలుగో తేదీ రాత్రి 11.30 గంటలకు విసిరేసింది. అంతటితో ఆగక తన బిడ్డ కనిపించడం లేదని స్థానికులను నమ్మించడానికి ప్రయత్నించింది. తొలుత ఈమె చెప్పే మాటలు తల్లిదండ్రులే నమ్మలేదు. ఐదో తేదీ ఉదయం పోటుకి మృతదేహం ఉప్పుటేరు ఒడ్డుకి కొట్టుకొచ్చింది. స్థానిక వార్డు సభ్యులు కామాడి దశరధుడు ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై టి.రామకృష్ణ కేసును అనుమానాస్పదంగా నమోదు చేసి సీఐ ఏఎస్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేశారు.
ఈ మేరకు శిశువును ఉప్పుటేరులో విసిరేసిన తల్లి రేకాడి కాసులును శనివారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ ఏఎస్ రావు తెలిపారు. శనివారం జగన్నాథపురం వీఆర్వో వద్దకు వెళ్లి నేరం అంగీకరించి, లొంగిపోయింది. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకి తరలించగా, రిమాండ్ విధించినట్లు తెలిపారు. కేసును ఛేదించిన ఎస్సై రామకృష్ణను అభినందించారు.
Advertisement
Advertisement