కమలి, ప్రియదర్శిని
చెన్నై, టీ.నగర్: బన్రూట్టిలో న్యాయవాదితో కలిసి చిన్నారిని హతమార్చిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. కడలూరు జిల్లా, బన్రూట్టి కంబన్ వీథికి చెందిన మురుగన్, శివరంజని (24) దంపతులు. వీరికి గౌతమన్ (3) అనే కుమారుడు, ఒకటిన్నర ఏడాది వయసున్న ప్రియదర్శిని అనే కుమార్తె ఉంది. శివరంజని ఇంటికి నడువీరపట్టి ప్రాంతానికి చెందిన న్యాయవాది నటరాజన్, అతని భార్య ధైర్యలక్ష్మి తరచుగా వెళ్లేవారు. ఆ సమయంలో వల్లలార్ వీధిలో నివసిస్తున్న యువతి కమలి శివరంజని ఇంటికి ఎదురుగానున్న ఆమె స్నేహితురాలు కార్తికా ఇంటికి వెళ్లి వచ్చేది. ఆ సమయంలో న్యాయవాది నటరాజన్‌కు, కమలికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
ఈ వ్యవహారం ధైర్యలక్ష్మికి తెలిసింది. ఆమె ఖండించింది. దీంతో ఆగ్రహించిన కమలి, నటరాజన్ ధైర్యలక్ష్మిని ఏదైనా ఒక వివాదంలో ఇరికించి జైలుకు పంపాలని నిర్ణయించారు. గత డిసెంబరు శివరంజని ఇంటికి వెళ్లిన కమలి శివరంజని కుమార్తె ప్రియదర్శిని ముఖంపై దిండుతో హతమార్చింది. తర్వాత ఏమీ తెలియనట్లు బిడ్డ తల్లిదండ్రుల వద్ద నాటకమాడింది. కాలక్రమంలో కమలి బిడ్డను హతమార్చినట్లు తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో తనను పోలీసులు అరెస్టు చేస్తారని భావించిన ఆమె దీని గురించి గ్రామ నిర్వాహక అధికారికి హత్య చేసినట్లు చెప్పింది. బన్రూట్టి డీఎస్పీ నాగరాజన్ ఆధ్వర్యంలోని పోలీసులు కమలిని అరెస్టు చేసి విచారణ జరిపారు. ఇందులో నటరాజన్ హత్యకు కుట్రను రూపొందించినట్లు తెలిసింది. పోలీసులు నటరాజన్, కమలిపై కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పరారీలో ఉన్న నటరాజన్ కోసం గాలిస్తున్నారు. మంగళవారం తహసీల్దార్ ఆరుముగం, పోలీసు అధికారుల సమక్షంలో బిడ్డ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వాహించారు.
Comments
Please login to add a commentAdd a comment