అరెస్టయిన క్షోభియ
అన్నానగర్ : చిదంబరంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 74 మంది వద్ద రూ.3 కోట్లు మోసం చేసిన మహిళను పోలీసులు మంగళవారం అరెస్టుచేశారు. కడలూరు జిల్లా చిదంబరం ఉలుందూరుకు చెందిన ఇళందీపన్ (33) ఆహార భద్రత బోర్డులో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అతని వద్ద చిదంబరం సిలువైపురానికి చెందిన క్షోభియ (32) అనే మహిళ తాను ఆహార భద్రత బోర్డులో అధికారిగా పని చేస్తున్నట్టుగా చెప్పి ఐడి కార్డును చూపించింది. రూ.5 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తానని క్షోభియా చెప్పింది.
అది నమ్మిన ఇళందీపన్ రూ.3లక్షల 50వేల నగదు ఆమెకు ఇచ్చాడు. దీంతో నగదు తీసుకున్న ఒక వారంలో క్షోభియా ఇళందీపన్‌కు ఉద్యోగ నియామక ఉత్తర్వులు ఇచ్చింది. అతను పనిలో చేరడానికి వెళ్ళినప్పుడు అది నకిలీ ఉత్తర్వు అని తెలిసింది. దీంతో ఇళందీపన్ చిదంబరం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తూ వచ్చారు. విచారణలో క్షోభి యా, ఆమె తల్లి ఆరోగ్యసెల్వి (50) కలసి పలువురు యువకుల వద్ద ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నగదు తీసుకున్నారు. కడలూరులో కంప్యూటర్ సెంటర్ నడుపుతున్న రవిచంద్రన్ (33)తో కలిసి నకిలీ సర్టిఫికెట్లు తయారుచేసి మోసం చేస్తూ వచ్చినట్లు తెలిసింది. క్షోభియా మొత్తం 74 మంది వద్ద నుంచి రూ.3 కోట్లకు పైగా వసూలుచేసి మోసం చేసినట్లు తెలిసింది. దీంతో పోలీసులు మంగళవారం క్షోభియ, ఆరోగ్యసెల్వి, రవిచంద్రన్ ముగ్గురిని అరెస్టుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment