నగరంలో సంచలనం కలిగించిన చిన్నారి తల కేసు విచారణలో హైదరాబాద్ పోలీసులు మరో కీలక అడుగు వేశారు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ డివిజన్ పరిధిలోని మైసమ్మ దేవాలయం సమీపంలో రాజశేఖర్ క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై చిన్నారి తల లభించిన విషయం తెలిసిందే. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శనివారం రాజశేఖర్ ఇంట్లో ఆధారాల కోసం దాదాపు 9గంటల తనిఖీలు నిర్వహించారు