
బనశంకరి (బెంగళూరు): నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.200 కోట్లకుపైగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎగవేసిన ఆరోపణలపై విక్రమ్‌దుగ్గల్, అష్పాక్ అహ్మద్, నయాజ్ అహ్మద్ అనే ముగ్గురిని బెంగళూరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని టీ.దాసరహళ్లి, చిక్కబాణవారలో అనేక డొల్ల కంపెనీలు నడుపుతున్న వీరు విచ్చలవిడిగా జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని పలు కీలక ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసంగా అధికారులు చెబుతున్నారు. రూ.203 కోట్లకు పైగా విలువైన జీఎస్టీ పన్నుల ఎగవేతకు సంబంధించిన నకిలీ బిల్లులు కూడా లభ్యమయ్యాయి. రెండేళ్ల క్రితం మృతిచెందిన వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment