evasion of Service Tax
-
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
జీఎస్టీ వసూళ్ల ఉత్సాహం
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే.. ► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు ► సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.29,773 కోట్లు. ► ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా) ► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా) ఆర్థిక సంవత్సరంలో తీరిది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి. -
200 కోట్ల జీఎస్టీ మోసం
బనశంకరి (బెంగళూరు): నకిలీ బిల్లులు సృష్టించి సుమారు రూ.200 కోట్లకుపైగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను ఎగవేసిన ఆరోపణలపై విక్రమ్‌దుగ్గల్, అష్పాక్ అహ్మద్, నయాజ్ అహ్మద్ అనే ముగ్గురిని బెంగళూరు వాణిజ్య పన్నులశాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నగరంలోని టీ.దాసరహళ్లి, చిక్కబాణవారలో అనేక డొల్ల కంపెనీలు నడుపుతున్న వీరు విచ్చలవిడిగా జీఎస్టీ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ముగ్గురినీ అదుపులోకి తీసుకుని పలు కీలక ఫైళ్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద జీఎస్టీ మోసంగా అధికారులు చెబుతున్నారు. రూ.203 కోట్లకు పైగా విలువైన జీఎస్టీ పన్నుల ఎగవేతకు సంబంధించిన నకిలీ బిల్లులు కూడా లభ్యమయ్యాయి. రెండేళ్ల క్రితం మృతిచెందిన వారి పేర్లతో నకిలీ బిల్లులు సృష్టించారు. -
పన్ను ఎగవేత కేసులో సానియా హాజరవుతుందా?
హైదరాబాద్: ఆదాయ పన్ను ఎగవేత కేసులో సమన్లు అందుకున్న సానియా మీర్జా ఫిబ్రవరి16వ తేదీన సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరు కాకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. దీంతో ఆమె తరఫు ప్రతినిధి కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంలో సానియా సంబంధీకులు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె కానీ, ఆమె తరఫు వారు కానీ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరుకాకపోయినట్లయితే సానియాపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 2014లో సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ రూ.కోటి అందజేసింది. ఇందుకు సంబంధించి ఆమె సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదంటూ అధికారులు తాఖీదులు అందజేశారు. నిబంధనల ప్రకారం 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను కట్టనందుకు గాను ప్రస్తుతం జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.