
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే..
► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు
► సెంట్రల్ జీఎస్‌టీ వాటా రూ.29,773 కోట్లు.
► ఎస్‌జీఎస్‌టీ వసూళ్లు రూ.37,623 కోట్లు
► ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా)
► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా)
ఆర్థిక సంవత్సరంలో తీరిది...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్‌లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment