దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న జీఎస్టీ స్కాంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్‌లను సృష్టిస్తున్న ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) మీరట్ జోనల్ యూనిట్ అరెస్ట్ చేసింది.
రూ.3,100 కోట్లకు పైగా నకిలీ బిల్లులు జారీ చేయడం, రూ.557 కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందడం వెనుక నిందితులు సూత్రధారులని తేలింది. నిందితులకు మీరట్ ఎకనమిక్స్ అఫెన్స్ కోర్టు ఆగస్ట్ 8 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.
నోయిడా పోలీసుల సమాచారంతో డీజీజీఐ విస్తృతంగా డేటాను తనిఖీలు చేసింది. తనిఖీలు అనంతరం ఆనంద్ కుమార్, అజయ్ కుమార్, విక్రమ్ జైన్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ కంపెనీల పేరుతో అకౌంట్‌లను తెరవడంలో బ్యాంక్ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అధికారులు గుర్తించారు. అసలు వ్యాపార కార్యకలాపాలు నిర్వహించనప్పటికీ 240 షెల్ కంపెనీలకు బ్యాంక్ ఖాతాలను తెరించేందుకు అనుమతించిన కొన్ని బ్యాంకులపై డిజీజీఐ దర్యాప్తు చేస్తోంది.
ఈ కేసులో 246 డొల్ల కంపెనీల ప్రమేయం ఉంది. రూ.2,142 కోట్ల నకిలీ ఇన్ వాయిస్ లను వెల్లడించే పత్రాలను డీజీజీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు సిండికేట్లు రూపొందించిన ఇన్వాయిస్‌లను నుంచి ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకున్న 1,500 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
ఈ రెండు సిండికేట్లు 3 నకిలీ సంస్థల ద్వారా రూ.142 కోట్ల ఐటీసీతో కలిపి రూ.557,246 కోట్ల పన్ను పరిధిలోకి వచ్చే టర్నోవర్ కలిగిన ఇన్వాయిస్లను 1,500కు పైగా లబ్ధిదారుల సంస్థలకు జారీ చేసినట్లు డీజీజీఐ అధికారి ఒకరు తెలిపారు. ప్రధాన లబ్దిదారుల సంస్థలు ఢిల్లీలో ఉన్నాయని, మరికొన్ని ఇతర 26 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది. ఈ సిండికేట్ ఏజెంట్ల నెట్ వర్క్ తో పనిచేస్తూ పేదల ఆధార్, పాన్ కార్డులను సేకరించి వారికి కొద్ది మొత్తం చెల్లిస్తున్నట్లు తేలింది.
చదవండి👉 'ఆ దగ్గు మందు కలుషితం.'. భారత్‌లో తయారైన సిరప్‌పై WHO అలర్ట్
Comments
Please login to add a commentAdd a comment