highest paid
-
చనిపోయినా.. చచ్చేంత సంపాదన
చచ్చీచెడీ సంపాదించాననే మాట వినే ఉంటారు. కానీ నిజంగానే చనిపోయినా వందల కోట్ల రూపాయల్లో సంపాదిస్తున్నవారు ఎందరో ఉన్నారు? సాధారణంగా మ్యుజీషియన్లు, సింగర్లు, రైటర్లకు వారి పాటలను, రచనలను వాడుతున్నవారు రాయల్టీగా కొంత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సృష్టించినవారు చనిపోయినా.. వారి పేరిట రాయల్టీ వసూలై వారసులకు అందుతూనే ఉంటుంది. మరి ఇలా ‘చనిపోయినా’ అత్యధి కంగా సంపాదిస్తున్నవారు ఎవరో తెలుసా?టాప్ మైఖేల్ జాక్సన్ఫోర్బ్స్ '2024లో అత్యధిక పారితోషికం పొందిన డెడ్ సెలబ్రిటీల' జాబితా ప్రకారం.. మైఖేల్ జాక్సన్ గత ఏడాది రాయల్టీల ద్వారా 600 మిలియన్ డాలర్లు (సుమారు రూ.5,044 కోట్లు) సంపాదించాడు. రూ.2,102 కోట్లతో సింగర్, రైటర్ ఫ్రడ్డీ మెర్క్యూరీ, రూ.630 కోట్లతో రైటర్ డాక్టర్ సియస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. -
అప్పట్లో గూగుల్‌లో అత్యధిక జీతం.. ఇప్పుడు ఏకంగా బిలియనీర్
నేటి రోజుల్లో బిలియనీర్ అవడం అనేది అసాధ్యమైన విషయమేమీ కాదు.. పాలో ఆల్టో నెటవర్క్స్ సీఈవో నికేష్ అరోరా (Nikesh Arora)నే అందుకు ఉదాహరణ. ఒకప్పుడు గూగుల్‌లో అత్యధిక జీతం అందుకున్న ఆయన ఇప్పుడు ఏకంగా బిలియనీర్ అయ్యారు. గూగుల్‌లో ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసిన నికేష్ అరోరా అత్యధిక వేతనం అందుకున్నారు. ఆ తర్వాత సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ ఆయన్ను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్యాకేజీ చెల్లించి నియమించుకుంది. ప్రస్తుతం పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో చేరిన ఆయన బిలియనీర్ల జాబితాలోకి అడుగుపెట్టాడు. సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ పరిశ్రమ బూమ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదే ఉదాహరణ. నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12 వేల కోట్లు)గా ఉంది. అరుదైన టెక్ సీఈవో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. వ్యవస్థాపకుడు కాకుండా బిలియనీర్ అయిన అరుదైన టెక్ సీఈవోగా నికేష్ అరోరా నిలిచారు. పాలో ఆల్టో నెట్వర్క్స్ 2018లో నికేష్ అరోరాను నియమించుకున్నప్పుడు 125 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్లను ఆయనకు అందించింది. హై-ప్రొఫైల్ హ్యాకింగ్లు ఎక్కువవుతన్న నేపథ్యంలో వ్యాపార సంస్థలకు సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఆవశ్యకత పెరిగింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ ధర నాలుగు రెట్లు పెరిగింది. దీంతో అరోరా వాటా 830 మిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకంతకూ పెరిగిన సంపద ఈ స్టాక్‌లు, వేతనం, సంస్థలో చేరినప్పుడు లభించిన 3.4 మిలియన్ డాలర్లు ఇలా అన్ని కలుపుకొని నికేష్ అరోరా నెట్‌వర్త్ ఇప్పుడు సుమారు 1.5 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా అరోరా 2023లో దాదాపు 300 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను విక్రయించినట్లు నివేదిక పేర్కొంది. పాలో ఆల్టో నెట్‌వర్క్స్‌లో అరోరా గతేడాది అందుకున్న పరిహారంలో అత్యధికంగా 7.5 లక్షల స్టాక్‌లు ఉన్నాయి. వీటి విలువ ప్రస్తుతం 220 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. -
జీఎస్టీ వసూళ్ల ఉత్సాహం
న్యూఢిల్లీ: ఎగవేత నిరోధక చర్యలు, అధిక వినియోగదారుల వ్యయాల ఫలితంగా జూలైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 11 శాతం పెరిగి (2022 ఇదే నెలతో పోల్చి) రూ.1.65 లక్షల కోట్లకు చేరాయి. 2017 జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వచి్చన తర్వాత, నెలవారీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లను అధిగమించడం వరుసగా ఇది ఐదవ నెల. ఆర్థికశాఖ ప్రకటన ప్రకారం వసూళ్ల తీరును క్లుప్తంగా పరిశీలిస్తే.. ► మొత్తం వసూళ్లు రూ.1,65,105 కోట్లు ► సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.29,773 కోట్లు. ► ఎస్జీఎస్టీ వసూళ్లు రూ.37,623 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.41,239 కోట్ల వసూళ్లుసహా) ► సెస్ రూ.11,779 కోట్లు (వస్తు దిగుమతులపై రూ.840 కోట్ల వసూళ్లుసహా) ఆర్థిక సంవత్సరంలో తీరిది... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో చరిత్రాత్మక స్థాయిలో రూ.1.87 లక్షల కోట్లు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయి. మే, జూన్లలో వరుసగా రూ.1.57 లక్షల కోట్లు, రూ.1.61 లక్షల కోట్లు చొప్పున ఖజానాకు జమయ్యాయి. -
ఇన్‌స్టా సంపాదనలో వీరిని మించిన వారే లేరు!
Highest Paid Instagram Stars 2023: ఆధునిక కాలంలో వాట్సాప్, ట్విటర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ రాజ్యమేలుతున్నాయి. సాధారణ ప్రజలను పక్కన పెడితే సెలబ్రిటీలు మాత్రమే ఇందులో బాగానే సంపాదిస్తున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఇన్‌స్టా ఒకటి. ఇది చాలా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్వర్క్. దాదాపు అన్ని బ్రాండ్లు, విక్రయదారులు, ఏదో ఒక సమయంలో, ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కలిసి పనిచేసే ప్రణాళికలను కలిగి ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు? వారు ఒక పోస్ట్‌కి ఎంత సంపాదిస్తున్నారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. క్రిస్టియానో రొనాల్డో ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో గురించి పెద్దగా పరిచయమే అవసరం లేదు. ఇన్స్టాగ్రామ్ ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీలలో ఒకడు. ఇతడు ఒక ఫోటో లేదా వీడియోని పోస్ట్ చేస్తే సుమారు 2.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. 643 మిలియన్స్ పాలొవర్స్ కలిగి ఉండటం వల్ల ఇంత మొత్తం చెల్లిస్తారని కూడా కొంతమంది చెబుతున్నారు. కైలీ జెన్నర్ కైలీ బ్యూటీ బ్రాండ్, కైలీ కాస్మోటిక్స్ ఓనర్ అయిన జెన్నర్ కూడా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జాబితాలో ఒకరు. ఈమె ఈమెకు సుమారు 415 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. జెన్నర్ ఒక పోస్టుకి లేదా వీడియోకి 1.8 మిలియన్ డాలర్లు తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. లియో మెస్సీ ఇక జాబితాలో మూడవ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీ అర్జెంటీనా దేశానికి చెందిన లియోనెల్ మెస్సీ. ఇతనికి 511 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఇన్‌స్టాలో ఒక పోస్ట్ లేదా వీడియో షేర్ చేస్తే 1.6 మిలియన్ డాలర్స్ తీసుకుంటాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఆఫర్ అంటే ఇలా ఉండాలి.. అతి తక్కువ ధరకే ఒప్పో 5జీ స్మార్ట్‌ఫోన్!) సెలీనా గోమెజ్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అభిమానులను కలిగిన ఉన్న స్పానిష్ గాయని, నటి 'సెలీనా గోమెజ్' ఇన్‌స్టాలో ఒక పోస్టుకి 1.4 మిలియన్ల డాలర్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈమెకు 456 మిలియన్స్ కంటే ఎక్కువ మంది పాలొవర్స్ ఉన్నారు. అంతే కాకుండా ఈమె అనేక బ్రాండ్లకు అంబాసిడర్‌గా కూడా ఉంది. (ఇదీ చదవండి: సెలబ్రిటీలతో కలిసి బిజినెస్.. ఆ నయా ట్రెండ్ మొదలుపెట్టిందే ఇతడు!) డ్వేన్ జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదించే సెలబ్రిటీల జివితలో ఐదవ వ్యక్తి డ్వేన్ జాన్సన్. ఈయన "ది రాక్"గా ప్రసిద్ధి చెందిన హాలీవుడ్ నటుడు. ఈయన మొదట డబ్ల్యుడబ్ల్యుఈ టీవీ షోలో రెజ్లర్‌గా ప్రజాదరణ పొందాడు. అంతే కాకుండా అనేక యాక్షన్ చిత్రాల్లో కూడా కనిపించాడు. ఇతడు ఒక పోస్టుకి ఇన్‌స్టాలో 1.1 మిలియన్ డాలర్లు తీసుకుంటాడని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. -
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు
వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట పండింది. ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ప్రముఖ కంపెనీలో అత్యధిక ప్యాకేజీ ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో ఉద్యోగం పొందిన విద్యార్థులు ఎన్ఐటీకి చెందిన వారే కావడం విశేషం. సాక్షి, వరంగల్: వరంగల్ ఎన్ఐటీ మరో అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఇటీవల గేట్ 2022 లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఘనత ఎన్ఐటి విద్యార్థికే దక్కగా తాజాగా ఏడాదిలో వెయ్యి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొంది సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాపస్ డ్రైవ్ ద్వారా 250 కంపెనీల్లో 630 మంది బీటెక్ విద్యార్థులు, 386 మంది పిజి విద్యార్థులు ఉద్యోగాలు పొందారని ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు తెలిపారు. మరో 50 మంది విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందారని చెప్పారు. 2019-20 సంవత్సరంలో 792 మంది 2020-21లో 839 మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందితే ఈసంవత్సరం ఇప్పటి వరకు 1016మంది ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో అత్యధికంగా ఏడాదికి 62 లక్షల 50 వేల వేతనంతో గౌరవ్ సింగ్, ప్రియాంష్ మహేశ్వరి దెశహ్ కంపెనీలో పని చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగాలు పొందిన వారిలో సగటున 14.5లక్షల ప్యాకేజీ లభించిందని డైరెక్టర్ ప్రకటించారు. 450 కంటే ఎక్కువ మంది ఫ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు వివిధ కంపెనీల నుండి ఇంటర్న్‌షిప్ ఆఫర్ పొందారని, నెలకు 20 వేల నుండి లక్ష అరవై వేల వరకు స్టైఫండ్ వస్తుందని తెలిపారు. ప్రభావంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు అనుకున్నన్ని జరగకపోయినా పెద్ద మొత్తంలో ఉద్యోగాలు లభించడం హర్షనీయమని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయని డైరెక్టర్ ఎన్వీ రమణ రావు స్పష్టం చేశారు. -
యూట్యూబ్ ‘ఫన్’- 2020
కరోనాతో యావత్ ప్రపంచం మూగబోయిన వేళ...తమ వీడియోలతో సందడి చేశారు. లాక్డౌన్ బోర్డమ్ను బ్రేక్ చేసి ప్రేక్షకుల్లో హుషారు నింపారు.యూత్‌ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ‘హైయెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్–2020’గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన శ్రీమంతుల చిరు పరిచయం... ► తొమ్మిది సంవత్సరాల కోటీశ్వరుడు! చానల్: రెయాన్ వరల్డ్ ఎర్నింగ్స్: 29.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 41.7 మిలియన్ బొమ్మలపై రివ్యూలు ఇచ్చే చానల్స్ తెగచూసే రెయాన్ కాజీ(టెక్సాస్) ఒకరోజు తల్లితో కలిసి సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. అబ్బాయి కోరిక నెరవేర్చడానికి, అతడిలోని టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి ఏకంగా హైస్కూల్లో తాను చేస్తున్న కెమిస్ట్రీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది లోన్ కాజీ. 2015లో మొదలైన ‘రెయాన్ వరల్డ్’ యూట్యూబ్ చానల్‌కు అనూహ్యస్పందన లభించింది. విద్యను వినోదంతో కలిపి మిక్స్ చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ► హాస్యం, సాహసం సేయరా డింభకా! చానల్: మిస్టర్ బీస్ట్ ఎర్నింగ్స్: 24 మిలియన్ సబ్స్క్రైబర్స్: 47.8 మిలియన్ నార్త్ కరోలిన(యూఎస్)లోని ఒక రెస్టారెంట్. సర్వర్ ఆర్డర్ అడిగింది. ‘రెండు గ్లాసుల మంచినీళ్లు చాలు’ అన్నాడు ఆ యువకుడు. తాగి వెళ్లిపోయాడు. అతడు కూర్చున్న టేబులపై ఒక చీటి ఉంది. ‘కమ్మని మంచినీళ్లు ఇచ్చినందుకు–థ్యాంక్స్’ చీటి పక్కనే టిప్. అంత పెద్ద మొత్తంలో టిప్ చూడడంతో ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. ‘ఎవరీ టిప్పర్?’ అని ఆరాతీస్తే ‘యూట్యూబ్స్టార్ మిస్టర్ బీస్ట్’ అని చెప్పారు. 22 సంవత్సరాల జిమ్మి డొనాల్డ్సన్ ‘మిస్టర్ బీస్ట్’ యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయ్యాడు. 13 సంవత్సరాల వయసు నుంచే యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యాలకు హాస్యం జోడిస్తే...ఆ ఫలితమే మిస్టర్ బీస్ట్. ► ఆడుతా తీయగా హాయిగా! చానల్: ప్రెస్టెన్ ఎర్నింగ్స్: 19 మిలియన్ సబ్స్క్రైబర్స్: 33.4 మిలియన్ తన సమీపబంధువు ఒకరు లండన్‌లో ‘లండన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితో డల్లాస్(యూఎస్)లో సొంతంగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు ప్రెస్టెన్ అర్స్మెన్. ప్రధాన చానల్‌తో పాటు మరోఅయిదు చానల్స్ ఉన్నాయి. గేమింగ్ వీడియోలు అతడి చానల్స్‌కు ముడిసరుకు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. ఛాలెంజ్ వీడియోలు, ప్రాంక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు 26 సంవత్సరాల ప్రెస్టెన్. ► చిన్నారి కాదు చిచ్చర పిడుగు చానల్: నస్ట్యా ఎర్నింగ్స్: 18.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 190.6 మిలియన్ టిక్ టాక్ పాప్లర్ కిడ్‌గా ఫేమస్ అయిన రష్యన్ చిన్నారి అనస్టాసియ ‘నస్ట్యా’ చానల్‌కు పిల్లల్లో అనూహ్యమైన ఆదరణ ఉంది. ఊహాత్మకమైన వీడియోలు, విజ్ఞానం, వినోదం మిళితమైన వీడియోలతో ‘నస్ట్యా’తో బ్రహ్మాండమైన పేరు సాధించింది. యూట్యూబ్ సెన్సేషనల్‌గా నిలిచిన ఆరేళ్ల అనస్టాసియ పేరు బ్రాండ్‌గా మారింది. ప్రసిద్ధ కంపెనీలు తమ ఉత్పత్తులు అనస్టాసియ పేరు వాడుకుంటున్నాయి. ‘జాజ్వేర్’ అనే బొమ్మల కంపెనీ ఈ చిన్నారి పేరుతో ఒక బొమ్మను కూడా తయారుచేసింది. ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్‌లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనల్ని మెచ్చుకునేవాటితో పాటు నొచ్చుకునేలా చేసేవి కూడా ఉంటాయి. ‘ఫీడ్‌బ్యాక్’ను గైడ్లైన్గానే తీసుకోవాలి తప్ప ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు మరింత అతిగా కృంగిపోకూడదు. పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. –విద్య అయ్యర్ (విద్య వోక్స్ యూట్యూబ్ చానల్) మనవాళ్ల విషయానికి వస్తే భువన్ బామ్ (19.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), ఆశిష్ చంచలని వైన్ (18.7 మిలియన్ సబ్స్క్రైబర్స్) గౌరవ్ –టెక్నికల్ గురూజీ (18.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), విద్య–అయ్యర్ విద్య వోక్స్ (7 మిలియన్ ), సనమ్ పాప్–రాక్ బ్యాండ్(7 మిలియన్ సబ్స్క్రైబర్స్), శృతి అర్జున్ ఆనంద్ (8 మిలియన్ సబ్స్క్రైబర్స్)....మొదలైవారు ప్రేక్షక ఆదరణతో పాటు ఆర్థికవిజయం అందుకుంటున్నారు. కంటెంట్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాను. యూత్ మా ప్రధాన టార్గెట్. వీడియోలపై కుబుంబసభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. మార్పులుచేర్పులు చేస్తుంటాను. ‘నాకు నచ్చితే అందరికీ నచ్చినట్లే’ అనే భావనలో నుంచి బయటికి రావాలి. – శృతి అర్జున్ ఆనంద్, ఫేమస్ యూట్యూబర్ -
అక్షయ్, సల్మాన్‌లకు చోటు ; షారుక్ మిస్
న్యూయార్క్ : ప్రపంచంలో అత్యధికంగా ఆర్జిస్తున్న టాప్ 100 సెలబ్రిటీల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది షారుక్ ఖాన్ ఈ జాబితాలో 65వ స్థానంలో నిలువగా ఈసారి మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు. 2017 జూన్ 1 నుంచి 2018 జూన్ 1 మధ్య కాలంలో ప్రముఖల సంపాదన ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందించింది. టాప్ 100లోని సెలబ్రిటీలు చెల్లించే ముందస్తు పన్నుల విలువ 22 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఈ జాబితాలో అక్షయ్ రూ. 276 కోట్లతో 76వ స్థానంలో నిలువగా, సల్మాన్ రూ. 257 కోట్లతో 82వ స్థానంలో నిలిచారు. అమెరికన్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ 1946 కోట్లతో ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలువగా, యాక్టర్ జార్జ్ క్లూనీ 2వ స్థానంలో, అమెరికన్ మోడల్ కైలీ జెన్నర్ 3వ స్థానంలో, ఫుట్‌బాల్ ప్లేయర్స్ లియోనల్ మెస్సీ 8వ స్థానంలో, క్రిస్టియానో రొనాల్డో 10వ స్థానంలో నిలిచారు. కాగా క్రితం ఏడాది ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో భారత్ నుంచి షారుక్ రూ.245 కోట్లతో 65వ స్థానంలో, సల్మాన్ రూ.238 కోట్లతో 71వ స్థానంలో, అక్షయ్ రూ.228 కోట్లతో 80వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
ఆమెకు ఒక్క ఎపిసోడ్ కే రూ.1.25 కోట్లు!
భారతీయ బుల్లితెరలపై ప్రసారాలు మొదలైనప్పటి రియాలిటీ షోలలో సినీనటులదే హవా అని తెలిసిందే. హీరోల విషయం పక్కనపెడితే రియాలిటీ షోల్లో నటీమణుల ఎంపిక విధానం కాస్త ఆసక్తికరంగా ఉంటుంది. వివిధ భాషల్లో రియాలిటీ షోలు చేస్తోన్న హీరోలు ఒకేసారి వెండితెర, బుల్లితెరలపై అభిమానుల్ని కనువిందు చేస్తున్నారు. అదే మహిళల దగ్గరికి వచ్చేసరికిమాత్రం ట్రెండిగ్ హీరోయిన్లను కాదనుకుని మాజీ హీరోయిన్లకు పట్టం కడుతుంటారు షో నిర్వాహకులు. మాధురీ దీక్షిత్, శిల్పా శెట్టి, సోనాలి బింద్రే, కాజల్ సోదరి తనీషా, ఇషా డియోల్, తెలుగులో సదా, రోజా, తమిళంలో కుష్భూ లాంటివాళ్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తోన్న లేదా వ్యవహరించిన రియాలిటీ షోలు ఎంత హిట్ అయ్యాయో తెలిసింది. ఒకానొక దశలో మాధురీ, శిల్పాలకు ఒక్కో ఎపిసోడ్ కు గానూ కోటి రూపాయాల పారితోషికం లభించేంది. ఇప్పుడా రికార్డును మరో వెటరన్ హీరోయిన రవీనా టాండన్ బద్దలుకొట్టబోతోంది. ఒక్క ఎపిసోడ్ కు రూ.1.25 కోట్లు.. బాలీవుడ్ నటీనటుల పరంగా బుల్లితెర చరిత్రలోనే అత్యధిక పారితోషికం ఇది! ఈ రికార్డు పారితోషికం అందుకోబోతోంది మరెవరోకాదు.. వెటరన్ హీరోయిన్ రవీనా టాండన్. చానెల్ 'వి' రూపొందిస్తోన్న 'షైన్ ఆఫ్ ఇండియా' రియాలిటీ షోకు ఆమె జడ్జిగా వ్యవహరించనున్నారు. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ షోకు మరో నటి ఫర్నాజ్ షెట్టి యాంకరింగ్ చేస్తారు. రవీనా గతంలోనూ 'సాహిబ్ బీవీ గులాం', 'ఛోటే మియా', కామెడీకా మహా ముఖాబ్లా', సింప్లీ బాతే విత్ రవీనా' లాంటి రియాలిటీ షోల్లో ప్రేక్షకులను మెప్పించారు. -
పారితోషికంలో అమితాబ్, సల్మాన్, అక్షయ్, ధోనీ అదుర్స్
న్యూయార్క్: ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వందమంది ప్రముఖుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలకు చోటు దక్కింది. 2015 సంవత్సరానికి ఫోర్బ్స్ విడుదల చేసిన ‘‘సెలబ్రిటీ-100’’ జాబితాలో అమెరికన్ బాక్సర్ ఫ్లోయ్డ్ మేవెదర్ రూ. 191 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్‌లు రూ. 21.36 కోట్ల ఆదాయంతో 71వ స్థానంలో నిలిచారు. రూ. 20.71 కోట్ల ఆదాయంతో అక్షయ్‌కుమార్ 76వ స్థానం దక్కించుకున్నారు. ఇండియన్ క్రికెటర్ మహేందర్‌సింగ్ ధోనీ రూ. 19.76 కోట్ల ఆదాయంతో 82 స్థానంలో నిలిచారు. -
పారితోషికం యాభై కోట్లు!
‘‘అదే కనుక నిజమైతే దేశంలో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరో హృతిక్ రోషన్ అవు తాడు’’ అని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు. మరి.. ‘మొహొంజొదారో’ అనే చిత్రానికి హృతిక్ డిమాండ్ చేసిన పారితోషికం ఆ స్థాయిలో ఉంది. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో అశుతోష్ గోవారీకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇది చారిత్రక కథాచిత్రం కావడంతో నటీనటులకు శారీరక శ్రమ ఎక్కువే ఉంటుందట. దాన్ని దృష్టిలో పెట్టుకుని, నిర్మాణానికి ఎక్కువ రోజులు పడుతుందనే కారణంగానే హృతిక్ 50 కోట్ల పారితోషికం డిమాండ్ చేశారట. ఈ చిత్రం నిర్మాణానికి సంబంధించి ఓ ప్రముఖ స్టూడియో అధినేతతో సంప్రదింపులు జరుపుతున్నారట అశుతోష్. మరో పదిహేను రోజుల్లో నిర్మాత ఎవరో తెలుస్తుంది. ఆ తర్వాత ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన విడుదల చేస్తారని సమాచారం. -
ఆ కిక్కే వేరు...
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం తెలివైనవాళ్ల లక్షణం అంటారు పెద్దలు. బాలీవుడ్ చిన్నది దీపికా పదుకొనే పెద్దల మాటలను అక్షరాలా ఫాలో అయిపోతుందేమో. ప్రస్తుతం టైమ్‌ని క్యాష్ చేసుకునే పని మీద ఉందట. కాక్టైల్, రేస్ 2, ఏ జవానీ హై దివానీ, చెన్నయ్ ఎక్స్‌ప్రెస్, రామ్‌లీలా.. ఇలా వరుసగా ఐదు సూపర్‌హిట్ చిత్రాల్లో నటించిన ఈ భామకు అమాంతం క్రేజ్ పెరిగిపోయింది. ‘అందచందాల్లో మాత్రమే కాదు... అభినయంలోనూ దీపికా సూపర్’ అని బాలీవుడ్‌వారు తెగ కితాబులిచ్చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో భారీ నిర్మాతలు, దర్శకులకు దీపికా ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్ అయిపోయింది. తమ సినిమాలో దీపికా ఉంటే ఆ కిక్కే వేరని, తను చాలా లక్కీగాళ్ అని కూడా కొంతమంది బలంగా ఫిక్స్ అయ్యారట. ఫలితంగా దీపికా పారితోషికం అమాంతంగా పెరిగిందని సమాచారం. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యధిక పారితోషికం ‘కోట్’ చేస్తున్న తార దీపికాయేనట. నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని వినికిడి. ఒక్కసారిగా లైఫ్ ఇంత మంచి టర్నింగ్ తీసుకున్నందుకు దీపికా తెగ ఆనందపడిపోతోంది. ‘యజమానికి గర్వం... పొరుగువారికి అసూయ’... అనే ఓ టీవీ కంపెనీ ప్రకటన తరహాలో... దీపికా వైభవానికి ఇతర నాయికలు కుళ్లుకుంటున్నారట. కానీ, ఇదేం పట్టించుకునే స్థితిలో లేని దీపికా.. ‘‘అవకాశాల గురించి ఆలోచించాల్సిన పని లేకుండాపోయింది. ఇప్పుడు నాక్కావల్సిందల్లా నా కుటుంబంతో గడపడానికి కొంత సమయం’’ అంటోంది.